Crime

చోరీల డబ్బుతో హారర్ మూవీ.. షాకింగ్ ట్విస్ట్
Crime· 11 Jul 2026

చోరీల డబ్బుతో హారర్ మూవీ.. షాకింగ్ ట్విస్ట్

AP: కర్ణాటక రాష్ట్రంలోని చిక్‌మంగళూరు రేవులో వెల్డింగ్ పనులు చేసే ఆనంద్‌కు సినిమాలు చాలా ఇష్టం. ఎప్పటికైనా తానే ఓ మూవీ తీయాలనుకున్నాడు. దీంతో చోరీల బాటపట్టాడు. షాపింగ్ మాల్సే టార్గెట్‌గా అనంతపురంలోని డ్రెస్ సర్కిల్ మాల్‌లో నగదు చోరీ చేశాడు. ఇలా దోపిడీలు చేసి కూడగట్టిన రూ.2.5 కోట్లతో హీరో, దర్శకుడిగా రిటర్న్ బై ఆనంద్.. పేజీ నంబర్ 13 అనే హారర్ మూవీ తీశాడు. అప్పులు పెరగడంతో మళ్లీ చోరీలు చేస్తూ పోలీసులకు దొరికాడు. బెంగళూరు-అనంతపురం హైవేపై నిందితుడిని అరెస్ట్ చేశారు. లాడ్జిల్లో ఉంటే దొరుకుతానని కారులోనే తిరిగేవాడని పోలీసులు తెలిపారు.

ఫోక్సో కేసు పెట్టారని ఆరుగురిని హత్య చేశాడు
Crime· 11 Jul 2026

ఫోక్సో కేసు పెట్టారని ఆరుగురిని హత్య చేశాడు

TG: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని దైవాలగూడకు చెందిన ఓ బాలిక.. రాజ్ కుమార్ అనే వ్యక్తి తనను వేధిస్తున్నాడంటూ మే 16న తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రాజ్‌‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. తనపై ఫోక్సో కేసు పెట్టిన కుటుంబంపై అతడు కక్ష పెంచుకున్నాడు. బెయిల్‌పై వచ్చిన రాజ్ కుమార్ బాలిక ఇంటికి వెళ్లాడు. బాలిక కుటుంబంలోని ముగ్గురిని అతి కిరాతకంగా హత్య చేశాడు. బాలికను హత్య చేసే ముందు పొలంలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసి ప్రాణాలు తీశాడు. అనంతరం తన భార్య సరిత, మూడేళ్ల కూతురు, రెండేళ్ల కుమారుడిని కూడా హత్య చేశాడు.

ఆటో డ్రైవర్ దారుణం.. మహిళపై అత్యాచారం
Crime· 10 Jul 2026

ఆటో డ్రైవర్ దారుణం.. మహిళపై అత్యాచారం

TG: ఆటో ఎక్కిన మహిళపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన మేడ్చల్ జిల్లా పోచారం ఐటీకారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఉప్పల్‌లోని భరత్‌నగర్ వద్ద ప్యాసింజర్ ఆటో ఎక్కిన మహిళ ఘట్‌కేసర్ ప్రాంతంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాలని డ్రైవర్‌ను కోరింది. ఆమెను ORR సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి కూల్ డ్రింక్‌లో మత్తుపదార్థం కలిపి తాగించాడు. స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారానికి పాల్పడి ఫోన్, నగదు లాక్కుని పరార్ అయ్యాడు. మహిళ స్పృహలోకి వచ్చిన తర్వాత PSలో ఫిర్యాదు చేసింది. సాంకేతిక ఆధారాలు, CCTV ఫుటేజ్ పరిశీలించి 24గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేశారు.

అమెరికాలో తెలుగు మహిళ హత్య .. షాకింగ్ ట్విస్ట్
Crime· 10 Jul 2026

అమెరికాలో తెలుగు మహిళ హత్య .. షాకింగ్ ట్విస్ట్

AP: అమెరికాలో గత 8నెలల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విజయవాడకు చెందిన రజిత సబ్బినేని కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రజితను ఆమె భర్త అవినాశ్‌ నార్నే హత్య చేసినట్లు అమెరికా పోలీసులు గుర్తించారు. పెళ్లైన 4నెలలకే ఆమెను దారుణంగా చంపినట్టు విచారణలో నిర్ధారణ అయింది. ఆమెకు శ్వాస ఆడకుండా అతడు గొంతు నులిమినట్టు పోస్టుమార్టం నివేదికలో తేలింది. మరో మహిళతో వివాహేతర సంబంధం కారణంగానే హత్య చేసినట్లు తెలిపారు. దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించాలని ఆయన ప్రయత్నించినట్లు తెలిపారు. నిందితుడు అవినాశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

సినిమా రేంజ్‌లో నవ వధువు కిడ్నాప్
Crime· 9 Jul 2026

సినిమా రేంజ్‌లో నవ వధువు కిడ్నాప్

TG: కులాంతర వివాహం చేసుకున్న ఓ నవ వధువును ఆమె కుటుంబసభ్యులే కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది. మెదక్ జిల్లా ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ప్రణయ్, ఓ యువతిని ప్రేమించి ఈ నెల 6న కులాంతర వివాహం చేసుకున్నాడు. ఆ పెళ్లి వధువు కుటుంబసభ్యులకు ఇష్టం లేదు. దీంతో వారంతా తమ అమ్మాయిని ఎలాగైనా కిడ్నాప్ చేసి ఇంటికి తీసుకురావాలని ప్లాన్ చేశారు. వరుడు ప్రణయ్ ఇంటికి నాలుగు కార్లలో సైలెంట్‌గా వచ్చి చుట్టుముట్టారు. బలవంతంగా ఇంట్లోకి చొరబడి యువతిని తమవెంట లాక్కెళ్లారు. ఈ క్రమంలో అడ్డొచ్చిన ప్రణయ్, అతడి కుటుంబసభ్యులను సైతం కార్లలో ఎత్తుకెళ్లారు.

ఓవర్ స్పీడ్‌తో మహిళలపై దూసుకెళ్లిన బొలెరో
Crime· 9 Jul 2026

ఓవర్ స్పీడ్‌తో మహిళలపై దూసుకెళ్లిన బొలెరో

TG: రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్ పరిధిలోని సాతంరాయి వద్ద బస్టాప్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న మహిళలపైకి ఓవర్ స్పీడ్‌తో వచ్చిన బొలెరో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సుమ, సువర్ణ అనే ఇద్దరు మహిళలు తీవ్ర గాయాలతో స్పాట్‌లోనే చనిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శంషాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్‌బాడీలను పోస్ట్‌మార్టం నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అధికారులు నిర్లక్ష్యం వీడి వెంటనే ఇక్కడ జీబ్రా క్రాసింగ్, స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వాట్సాప్‌లో పరిచయం.. నమ్మించి లక్షల్లో మోసం
Crime· 9 Jul 2026

వాట్సాప్‌లో పరిచయం.. నమ్మించి లక్షల్లో మోసం

TG: హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టకు చెందిన సురేందర్‌రెడ్డికి ఎప్రిల్ నెలలో ఓ వాట్సాప్‌ గ్రూప్‌లో గీతాంజలి, శుభమ్‌, అమిత్‌ పేర్లతో ముగ్గురు పరిచయం అయ్యారు. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ చేస్తే భారీ లాభాలు వస్తాయని నమ్మించి ఒక ‘APK ఫైల్‌’ను పంపించారు. దానిపై క్లిక్‌ చేయించి ట్రేడింగ్‌ ఖాతాలు తెరిపించారు. బాధితుడు దశలవారీగా ట్రేడింగ్‌ ఖాతాల్లో రూ.8.55 లక్షలు జమచేశాడు. మే నెలలో జమచేసిన డబ్బును సురేందర్‌ విత్ డ్రా చేసేందుకు ప్రయత్నించగా, ఇంకా ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలని వారు డిమాండ్ చేశారు. దీంతో సురేందర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

TC కోసం ప్రిన్సిపల్ షాకింగ్ డిమాండ్
Crime· 9 Jul 2026

TC కోసం ప్రిన్సిపల్ షాకింగ్ డిమాండ్

TG: స్టూడెంట్స్‌కు విద్యాబుద్దులు నేర్పి ఆదర్శంగా ఉండాల్సిన ప్రిన్సిపల్‌ కొన్నాళ్లుగా తన వికృత చేష్టలతో ఓ స్టూడెంట్‌ని వేధిస్తున్నాడు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌ PG కాలేజ్ ప్రిన్సిపల్‌ మార్క్‌ పోలోనియస్‌ తన ఇంటికొచ్చి శారీరకంగా కలిస్తేనే TC ఇస్తానంటూ విద్యార్థికి చెప్పాడు. ఈసారి ఎలాగైనా మార్క్‌ దారుణాలను బయటపెట్టాలని ఆ అబ్బాయి తన ఫ్రెండ్స్‌తో కలిసి ప్రిన్సిపల్‌ ఇంటికి వెళ్లాడు. స్నేహితులను బయటే ఉంచి తానొక్కడే లోపలికి వెళ్లాడు. మార్క్‌ అనైతిక చేష్టలను అతడి ఫ్రెండ్స్ వీడియో తీశారు. వెంటనే ఆ బాధితుడు నేరుగా పోలీస్‌‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

అసైన్డ్ భూములకు అక్రమ పట్టాలు.. అధికారిణిపై వేటు
Crime· 9 Jul 2026

అసైన్డ్ భూములకు అక్రమ పట్టాలు.. అధికారిణిపై వేటు

TG: ధరణి పోర్టల్‌లోని సాంకేతిక లొసుగులను ఆసరగా చేసుకుని ప్రభుత్వ భూములను అధికారులు ప్రైవేట్ వ్యక్తులకు పట్టా చేసిన కుంభకోణాలు ఇంకా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో 448 ఎకరాల అసైన్డ్‌ భూములను పట్టా చేసినట్లు సిట్ విచారణలో తేలింది. తహసీల్దార్‌ దండు సుజాత కనీసం క్రాస్‌చెక్‌ చేసుకోకుండా, ఎలాంటి సపోర్టింగ్‌ డాక్యుమెంట్లు లేకుండా పట్టామార్పిడి చేసినట్లు గుర్తించారు. దీంతో తహసీల్దార్‌ను సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ కె.హైమావతి ఉత్తర్వులు జారీ చేశారు.

భార్య ముందే గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి భర్త సూసైడ్ అటెంప్ట్!
Crime· 8 Jul 2026

భార్య ముందే గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి భర్త సూసైడ్ అటెంప్ట్!

శ్రీకాకుళం చప్పర గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ శిరీష్ కుమార్‌కి(34) భార్య సులోచన, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా అతను ఊరిలోనే ఉండే మరో మహిళతో రిలేషన్ పెట్టుకుని కోయంబత్తూర్ పారిపోయాడు. విషయం తెలిసి భార్య చుట్టాల సాయంతో వాళ్ళిద్దరినీ శబరి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో హైదరాబాద్ తీసుకొస్తుండగా.. చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరకు రాగానే, శిరీష్ అతని గర్ల్‌ఫ్రెండ్ బాత్‌రూమ్‌లో పురుగుల మందు తాగి స్పృహ తప్పడంతో రైల్వే సిబ్బంది గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం వారి కండిషన్ సీరియస్‌గా ఉన్నట్లు డాక్టర్స్ తెలిపారు.

జైలుకు వెళ్లొచ్చినా తీరు మారలేదు
Crime· 8 Jul 2026

జైలుకు వెళ్లొచ్చినా తీరు మారలేదు

TG: నల్గొండ జిల్లా నకిరేకల్‌ టౌన్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. శివాజీనగర్‌లోని ఓ ఇంట్లో ఈ అక్రమ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అందిన పక్కా సమాచారంతో నకిరేకల్ పోలీసులు దాడి చేశారు. నిందితులు బట్కా యాదగిరి, టేకుమట్ల జానయ్యలను అరెస్ట్ చేశారు.​ కేసారం, కట్టంగూరు ప్రాంతాలకు చెందిన కొందరు RMPల సహకారంతో ఈ ముఠా దందా సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలోనూ నిందితులు ఇద్దరూ చివ్వెంల మండలంలో జరిగిన ఓ గర్భిణి మరణం కేసులో జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలిపారు.

డబుల్ మర్డర్ కేసులో కోర్టు సంచలన తీర్పు
Crime· 8 Jul 2026

డబుల్ మర్డర్ కేసులో కోర్టు సంచలన తీర్పు

TG: రాజన్నసిరిసిల్ల జిల్లాలో సంచలనం సృష్టించిన డబుల్ మర్డర్ కేసులో నిందితుడికి జిల్లా కోర్ట్ జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చినట్లు జిల్లా SP మహేష్ బి. గితే తెలిపారు. గంభీరావుపేట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన రెండు వేర్వేరు హత్య కేసుల్లో నిందితుడు వంగా సందీప్ రెడ్డికి కోర్ట్ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2018లో కొత్తపల్లి గ్రామానికి చెందిన బీనబోయిన దేవయ్యను, 2022లో కామారెడ్డి జిల్లాకు చెందిన మన్నె నరసింహులును భూవివాదాల నేపథ్యంలో హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. సాంకేతిక ఆధారాలు, 20 మంది సాక్షుల వాంగ్మూలాలను కోర్టు పరిగణనలోకి తీసుకుని నిందితుడికి జీవిత ఖైదు విధించింది.