Education

గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు బ్రాండెడ్‌ కిట్
Education· 16 Jun 2026

గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు బ్రాండెడ్‌ కిట్

TG: ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బాగాంధీ, BC, SC, ST, మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన బ్రాండెడ్‌ కిట్ అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కిట్‌లో యూనిఫాంతో పాటు స్కూల్‌ బ్యాగ్, బూట్లు, సాక్సులు, టై, బెల్ట్, బెడ్డింగ్‌ సామగ్రి, ప్లేటు, గ్లాసు, కటోరా ఇలా ప్రతి వస్తువులోనూ నాణ్యతకు పెద్దపీట వేయాలని CM రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పాఠశాల విద్యార్థులకే కాకుండా, మొదటిసారిగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే 2 లక్షల మంది విద్యార్థులకు కూడా కాలేజీ బ్యాగు, బెల్టు, టై, నల్లబూట్లు, సాక్సులను ఉచితంగా అందించనున్నారు.

ఇంటర్ విద్యార్థుల కోసం AP విద్యాశాఖ కీలక నిర్ణయం
Education· 15 Jun 2026

ఇంటర్ విద్యార్థుల కోసం AP విద్యాశాఖ కీలక నిర్ణయం

AP విద్యాశాఖ ఇంటర్ విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీలతో పోటీపడేలా ఉత్తీర్ణత శాతం పెంచేందుకు స్పెషల్ క్లాసులు నిర్వహణ, మెటీరియల్‌‌ను అందిస్తోంది. గతేడాది IIT, JEE, NEET, తదితర పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్‌ను కాస్త ఆలస్యంగా అందజేయగా, ఈసారి మాత్రం ముందుగానే అందజేశారు. ఈ మెటీరియల్ ఉచితంగానే ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేసే నిపుణులైన సబ్జెక్టు లెక్చరర్లతో మెటీరియల్‌ను రూపొందించారు.

OUలో కొత్త సాఫ్ట్‌వేర్..  PHD స్కాలర్స్‌కు షాక్
Education· 12 Jun 2026

OUలో కొత్త సాఫ్ట్‌వేర్.. PHD స్కాలర్స్‌కు షాక్

TG: ఉస్మానియా యూనివర్సిటీలో PHD స్కాలర్స్ AI సాయంతో పరిశోధనలు పూర్తిగా చేయకుండానే ప్రాజెక్టు రిపోర్ట్స్ సమర్పిస్తున్నట్లు OU అధికారులు గుర్తించారు. సరికొత్త AI చెకింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఏఐ ద్వారా పరిశోధన పూర్తిచేసి రికార్డులు సమర్పించిన విద్యార్థులకు PHD సీటు రాకుండా చేస్తామని అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. పీహెచ్‌డీ స్కాలర్లు చాట్‌జీపీటీ, జెమిని సహా ఇతర AI టూల్స్ ఉపయోగించి పరిశోధన పత్రాలను సమర్పిస్తున్నారని గుర్తించారు. స్పెషల్ సాఫ్ట్‌వేర్‌తో టెస్ట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

రీయంబర్స్‌మెంట్ రాలేదని సర్టిఫికెట్లు ఇవ్వని కళాశాల
Education· 11 Jun 2026

రీయంబర్స్‌మెంట్ రాలేదని సర్టిఫికెట్లు ఇవ్వని కళాశాల

TG: నాగర్‌కర్నూలు జిల్లా పదర మండలం ఊడిమిళ్ల విలేజ్‌కు చెందిన పాపమ్మ, బయన్న దంపతులు తన కుమార్తె ఎస్తేరమ్మ ఉన్నత విద్యను అభ్యసించేందుకు తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడ్డారు. ఐటీడీఏ నుంచి రూ.50వేల ఆర్థిక సహాయం అందడంతో మిర్యాలగూడలోని మీనా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ (సీఎస్ఈ) పూర్తిచేసింది. తదుపరి విద్యను కొనసాగించేందుకు ఒరిజినల్ సర్టిఫికెట్లు అవసరమవడంతో కళాశాల యాజమాన్యాన్ని సంప్రదించారు. ప్రభుత్వం నుంచి ఫీజు రీయంబర్స్‌మెంట్ రాలేదని, అది వచ్చిన తర్వాతే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పినట్లు ఎస్తేరమ్మ తెలిపింది.

OU పరీక్షల మూల్యాంకనంపై విద్యార్థులు ఫైర్
Education· 11 Jun 2026

OU పరీక్షల మూల్యాంకనంపై విద్యార్థులు ఫైర్

TG: : ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షల మూల్యాంకనంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన LLB సెమిస్టర్ ఫలితాల్లో పెద్దసంఖ్యలో విద్యార్థులు ఫెయిల్ కావడం, అనంతరం రీవాల్యుయేషన్‌లో వారిలో ఎక్కువమంది పాస్ కావడంతో పేపర్ ఎవల్యూషన్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల సమాచారం ప్రకారం LLB సెమిస్టర్ పరీక్షల్లో సుమారు 1,500 మంది ఫెయిలయ్యారు. వీరిలో గత సెమిస్టర్లలో మంచి మార్కులు సాధించిన వారు కూడా ఉండటంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. మొదట ఫెయిలైనవారికి రీవాల్యుయేషన్ అనంతరం ఫస్ట్ గ్రేడ్ మార్కులు వచ్చాయి.

HM కు మార్కాపురం MLA బంపర్ ఆఫర్
Education· 10 Jun 2026

HM కు మార్కాపురం MLA బంపర్ ఆఫర్

AP: ఉపాధ్యాయులు అంకితభావంతో విధులు నిర్వర్తించి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని మార్కాపురం MLA కందుల నారాయణరెడ్డి అన్నారు. మార్కాపురంలోని ZP బాలుర ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఒకటి, రెండోతరగతి విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. గొట్లగట్టు ZP హైస్కూల్ విద్యార్థి 592మార్కులు సాధించి గవర్నమెంట్ స్కూల్ సత్తా చాటాడని అన్నారు. ఆ పాఠశాల HMకు ఈ నెల 19న మెగా పేరెంట్స్ డే సందర్భంగా రూ.1 లక్ష ప్రోత్సాహక బహుమతి అందజేస్తానని ప్రకటించారు.

గుడ్‌న్యూస్..  ఫ్రీ స్కిల్ ట్రైనింగ్ కోర్సులు
Education· 8 Jun 2026

గుడ్‌న్యూస్.. ఫ్రీ స్కిల్ ట్రైనింగ్ కోర్సులు

TG: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం ఐటిడిఏ పరిధిలో ST యువతకు ఉచిత స్కిల్ ట్రైనింగ్, కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులకు ఈ నెల 10లోపు దరఖాస్తు చేసుకోవాలని ITDA అధికారులు తెలిపారు. కంప్యూటర్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్, సాఫ్ట్ స్కిల్స్, సోలార్ పంప్ టెక్నీషియన్, గెస్ట్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, గెస్ట్ సర్వీస్ అసోసియేట్ వంటి కోర్సులను అందించనున్నారు. మూడనెలల పాటు నిర్వహించే ఈ కోర్సులు పూర్తిగా ఉచితంగా ఉండటమే కాకుండా హాస్టల్, భోజన సౌకర్యాలు కల్పిస్తారు. పదోతరగతి, ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పూర్తిచేసిన ఎస్టీ అభ్యర్థులు అర్హులు.

NTA, IIT వెబ్‌సైట్ల లూప్‌హోల్స్ బయటపెట్టిన 16 ఏళ్ల  కుర్రోడు !
Education· 5 Jun 2026

NTA, IIT వెబ్‌సైట్ల లూప్‌హోల్స్ బయటపెట్టిన 16 ఏళ్ల కుర్రోడు !

సార్ధక్ సిస్టమ్‌లోని లూప్‌హోల్స్ వెలికితీస్తే.. దుబాయ్‌కి చెందిన రైలన్ అనిల్ అనే 16 ఏళ్ల ఇండియన్ టెక్‌-విజ్ (Cybersecurity Researcher), ఏకంగా NEET, JEE పరీక్షలు నిర్వహించే NTA, IIT రోర్కీల సెక్యూరిటీ లోపాలను బయటపెట్టి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు!నీట్ (NEET 2026) రీ-ఎగ్జామ్ టైమ్‌లో NTA పోర్టల్‌లో ‘సూపర్ అడ్మిన్ లాగిన్ బైపాస్’ ఉందంటూ స్క్రీన్‌షాట్స్‌తో ఎక్స్‌ (X) లో పోస్ట్ చేశాడు. దీనివల్ల వేలమంది ఎగ్జామ్ కోఆర్డినేటర్లు, సెంటర్స్ డేటా ఈజీగా లీక్ అయ్యే ఛాన్స్ ఉందని హెచ్చరించాడు. మన ఇండియన్ ఎగ్జామినేషన్స్ ఆన్‌లైన్ సెక్యూరిటీ ఎంత వీక్‌గా ఉందో ఈ టీనేజర్ సింగిల్ హ్యాండ్‌తో ప్రూవ్ చేశాడు!

 వాల్యుయేషన్ సిస్టమ్ ని షేక్ చేసిన ‘సార్ధక్ సిద్ధాంత్’!
Education· 5 Jun 2026

వాల్యుయేషన్ సిస్టమ్ ని షేక్ చేసిన ‘సార్ధక్ సిద్ధాంత్’!

దేశ వ్యాప్తంగా మారు మోగిన CBSE అవకతవకలు బయట పెట్టినది ఎవరో తెలుసా? జార్ఖండ్‌కు చెందిన 18 ఏళ్ల సార్ధక్ సిద్ధాంత్, CBSE డిజిటల్ ఎగ్జామ్ ఇవాల్యుయేషన్ (OSM) సిస్టమ్‌లోని లూప్‌హోల్స్‌ను బయటపెట్టి హీరో అయ్యాడు. తన రిజల్ట్స్ తక్కువ రావడంతో డౌట్ వచ్చి.. RTI (సమాచార హక్కు చట్టం) ద్వారా ఆన్సర్ షీట్స్ తెప్పించుకుని, ఏకంగా 576 ప్రభుత్వ టెండర్ డాక్యుమెంట్లను లైన్ టు లైన్ స్టడీ చేసి ఈ స్కామ్‌ను ఎండగట్టాడు.బ్లాక్ లిస్ట్ అయిన కంపెనీలకే మళ్లీ కాంట్రాక్ట్స్ ఇచ్చారని ఆధారాలతో నిరూపించిన ఈ కుర్రాడి ఇన్వెస్టిగేషన్ దెబ్బకి పార్లమెంట్ ప్యానెల్ కూడా స్పందించాల్సి వచ్చింది!