Local

స్టీరింగ్ మీదే గుండెపోటు- 100 ప్రాణాలు కాపాడిన హీరో లక్ష్మణ్
Local· 29 Aug 2026

స్టీరింగ్ మీదే గుండెపోటు- 100 ప్రాణాలు కాపాడిన హీరో లక్ష్మణ్

జగిత్యాల జిల్లా మద్దూనూరు నుంచి వస్తున్న RTC బస్సు డ్రైవర్ లక్ష్మణ్‌కు ప్రయాణం మధ్యలో ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. తీవ్ర నొప్పితోనే.. ఆయన బస్సును సురక్షితంగా రోడ్డు పక్కకు నిలిపి స్టీరింగ్‌పైనే పడిపోయారు. దీంతో ఆ టైంలో అందులో ప్రయాణిస్తున్న 100 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడబడ్డాయి.సమయానికి 108 రాకపోవడంతో ఆటోలో ఆయనను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. ట్విస్ట్ ఏంటంటే Mondayతో రిటైర్ అవ్వాల్సిన లక్ష్మణ్ అనారోగ్యంలో ఉన్నా డిపో అధికారులు బలవంతంగా డ్యూటీ వేశారు.

ఎమ్మెల్యే రాజేష్ రెడ్డికి విద్యార్థినుల రాఖీలు!
Local· 29 Aug 2026

ఎమ్మెల్యే రాజేష్ రెడ్డికి విద్యార్థినుల రాఖీలు!

రాఖీ పౌర్ణమి సందర్భంగా నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డికి విద్యార్థినులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సరస్వతి శిశుమందిర్ పాఠశాల విద్యార్థినులు ఎమ్మెల్యేను ఆత్మీయంగా కలిసి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ – విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలు సాధించాలని, సోదర–సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలు ఎల్లప్పుడూ కొనసాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జక్కా రాజ్‌కుమార్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు వినోద్ పాల్గొన్నారు.