Local

క్లోరినేషన్ తర్వాతే నీటి సరఫరా.. కమిషనర్ స్పష్టం
Local· 26 Aug 2026

క్లోరినేషన్ తర్వాతే నీటి సరఫరా.. కమిషనర్ స్పష్టం

AP: గుంటూరు జిల్లా మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో తాగునీటి రంగులో స్వల్ప మార్పు కనిపించడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. గోదావరి జలాలు కృష్ణానదిలో కలవడం వల్ల నీటిరంగులో మార్పు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నీటిని క్లోరినేషన్ చేసి, శుద్ధిచేసిన అనంతరమే ప్రజలకు సరఫరా చేస్తున్నామని కమిషనర్ స్పష్టంచేశారు. మరోవైపు పలు ప్రాంతాల్లో పైపులైన్ లీకేజీలు కూడా నీటి నాణ్యతపై ప్రభావం చూపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజలు ముందుజాగ్రత్తగా నీటిని కాచి, చల్లార్చుకున్న తర్వాతే తాగాలని సూచించారు.

ఇన్‌సర్వీస్‌ టీచర్లకు టెట్‌ మినహాయింపు ఇవ్వాలి
Local· 26 Aug 2026

ఇన్‌సర్వీస్‌ టీచర్లకు టెట్‌ మినహాయింపు ఇవ్వాలి

AP: ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్‌ విశాఖపట్నం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల సేవా అనుభవాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. టెట్‌ నిర్వహణ తప్పనిసరి చేస్తే అన్ని కేటగిరీలకు 40 శాతం మార్కులను ఉత్తీర్ణత ప్రమాణంగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. అలాగే పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో కాకుండా ఆఫ్‌లైన్‌ (ఓఎంఆర్‌) పద్ధతిలో నిర్వహించాలని కోరారు.