Local

ఇన్‌సర్వీస్‌ టీచర్లకు టెట్‌ మినహాయింపు ఇవ్వాలి
Local· 26 Aug 2026

ఇన్‌సర్వీస్‌ టీచర్లకు టెట్‌ మినహాయింపు ఇవ్వాలి

AP: ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్‌ విశాఖపట్నం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల సేవా అనుభవాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. టెట్‌ నిర్వహణ తప్పనిసరి చేస్తే అన్ని కేటగిరీలకు 40 శాతం మార్కులను ఉత్తీర్ణత ప్రమాణంగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. అలాగే పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో కాకుండా ఆఫ్‌లైన్‌ (ఓఎంఆర్‌) పద్ధతిలో నిర్వహించాలని కోరారు.

వీల్‌చైర్ లేక రోగిని భుజాలపై మోసుకెళ్లాల్సిన దుస్థితి
Local· 26 Aug 2026

వీల్‌చైర్ లేక రోగిని భుజాలపై మోసుకెళ్లాల్సిన దుస్థితి

TG: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కనీస వసతులు లేక రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థోపెడిక్ సమస్యతో చికిత్స కోసం వచ్చిన ఓ రోగిని ఎక్స్‌రేకు తీసుకెళ్లేందుకు వీల్‌చైర్ అందుబాటులో లేకపోవడంతో బంధువులు అతడిని భుజాలపై మోసుకెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటనతో ఆస్పత్రిలో వసతుల పరిస్థితిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అవసరమైన సంఖ్యలో వీల్‌చైర్లు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో ప్రతిరోజూ రోగులు ఇబ్బందులు పడుతున్నారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.