Local· 10 Jun 2026
గుట్టుచప్పుడుగా 10వేల బోర్లు.. అయినా చర్యల్లేవు
AP: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని బంజరగూడెం, తొండిపాక, ఇబ్రహీంపేట, మిట్టగూడెం, గణపవరం, గుంపెనపల్లి, బోనగిరి, పలు గ్రామాల్లో అక్రమంగా బోర్లు తవ్వుతున్నారు. జామాయిల్, జామ క్లోన్ నర్సరీల వ్యాపారం కోసం కొందరు ఫారెస్ట్, గవర్నమెంట్ ల్యాండ్‌ను ఆక్రమించుకుంటున్నారు. ఒక్కో నర్సరీలో రెండు నుంచి మూడు బోర్లను అనుమతులు లేకుండానే తవ్వుతున్నారు. సుమారు 10వేలకు పైగా అక్రమ బోర్లు వెలిశాయి. అక్రమంగా బోర్లు తవ్వకాలు జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.