Technology· 6 Oct 2026
Meta Muse AI.. పనులు ఓకే, డేటా జాగ్రత్త!
Meta కొత్తగా Muse AIని తీసుకొచ్చింది. ఇది మన తరఫున వెబ్సైట్లు, Apps, ఫైల్స్లో పనులు చేయగలదు. Email, క్యాలెండర్ యాక్సెస్ ఇస్తే బిల్లులు గుర్తు చేయడం, వస్తువులు వెతకడం, బుకింగ్ చేయడం లాంటి పనులు కూడా చేస్తుంది. ఈ సమయంలో పర్సనల్ డాటా AIకి కనిపించే అవకాశం ఉంది. ఈ డేటాను AI మెరుగుపర్చేందుకు ఉపయోగించవచ్చని Meta చెబుతోంది. AI తప్పులు చేసే ఛాన్స్ ఉండటంతో డబ్బు, పాస్వర్డ్స్, అకౌంట్స్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.