'మెహందీ' కోసం భారీ క్యూ.. గణేష్ ఆలయానికి భక్తులు
రాజస్తాన్ రాష్ట్రం జైపూర్‌లోని మోతీ డూంగ్రీ గణేశ్ ఆలయంలో ‘మెహందీ ఉత్సవ్’కు వైరల్ రీల్స్ భారీ క్రేజ్ తెచ్చాయి. సింజారా మెహందీ పెట్టుకుంటే త్వరగా పెళ్లి అవుతుందన్న ప్రచారంతో దేశవ్యాప్తంగా ఆలయానికి భక్తులు వచ్చారు. ఒక్కరోజే రికార్డు స్థాయిలో 18 లక్షల మంది వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 3వేల 5 వందల కిలోల మెహందీని సిద్ధం చేయగా.. మూడు గంటల్లోనే మొత్తం స్టాక్ అయిపోయింది. భక్తులు 6 నుంచి 7 గంటలు క్యూలో వేచి ఉండటంతో అక్కడ ట్రాఫిక్ భారీగా పెరిగింది.
