Latest

ఆదివాసీలకు 100% రిజర్వేషన్‌పై అసెంబ్లీలో బిల్లు పెట్టాలి
AP: ఆదివాసీలకు నూరు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రత్యామ్నాయ జీవో జారీ చేసి, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలని అల్లూరి సీతారామరాజు జిల్లా ఆదివాసీ గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు. డంబ్రిగుడ మండల కేంద్రంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టి.సూర్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశం నిర్వహించారు. బాలదేవ్ మాట్లాడుతూ ఆదివాసీ హక్కులు, చట్టాల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే మహోద్యమం చేపడతామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు.

సినిమా ఇండస్ట్రీకి AI వరమా? శాపమా?
హాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో పెద్ద సెట్స్ వేసే రోజులు మారిపోతున్నాయి. 'ప్రామిస్' అనే కొత్త స్టూడియోలో యాక్టర్ టోరీ థామస్ వైట్ షీట్స్ ముందు నటిస్తుంటే, చైనీస్ AI మోడల్ 'Seedance 2.5' రియల్ టైమ్‌లోనే బ్యాక్‌గ్రౌండ్స్‌ని మ్యాజిక్‌లా మార్చేస్తోంది. తక్కువ ఖర్చుతోనే నెక్స్ట్ లెవెల్ విజువల్స్ వస్తుండడంతో ప్రోడుసర్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ AI ట్రెండ్ సినిమా పరిశ్రమకు కొత్త గోల్డెన్ ఏజ్ ఇస్తుందా లేక యాక్టర్స్, క్రియేటర్స్ ఉద్యోగాలకు ప్రాబ్లం అవుతుందా అని ఇండస్ట్రీలో హాట్ డిబేట్ నడుస్తోంది.

OTTలోకి విజయ్ సినిమా!
తమిళనాడు ముఖ్యమంత్రి, హీరో విజయ్ నటించిన చివరి సినిమా 'జన నాయకుడు' OTTలోకి వచ్చేస్తోంది. హెచ్. వినోద్ తీసిన ఈ యాక్షన్ సినిమా ఆగస్టు 21 నుంచి ZEE5 యాప్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి రాబోతోంది. పూజా హెగ్డే, మమిత బైజు, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్ నటించిన ఈ సినిమాకు అనిరుధ్ పాటలు అందించారు. థియేటర్లలో మిస్ అయిన విజయ్ అభిమానులు ఈ సినిమాను OTTలో చూడటానికి ఎదురుచూస్తున్నారు.

ఘాటెక్కుతున్న ఉల్లి ధరలు
AP: ఎలినినో ప్రభావంతో పంటల ఉత్పత్తి తగ్గిపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ఉల్లి ధరలు కూడా పెరగడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కిలో ఉల్లిపాయలు రూ.25 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.35కు చేరాయి. ధరలు ఒక్కసారిగా పెరగడంతో రోజువారీ కొనుగోళ్లపై అదనపు భారం పడుతోందని వినియోగదారులు వాపోతున్నారు.

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో వన్‌వేలు..వాహనదారులకు కష్టాలు
TG: హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో నేటి నుంచి అమల్లోకి వచ్చిన వన్‌వే నిబంధనలతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం వాహనదారులు, బస్సు ప్రయాణికులకు గందరగోళంగా మారింది. కొత్త మార్గాల్లో ప్రయాణించాల్సి రావడంతో ఉద్యోగులకు ఇబ్బందిగా మారింది. సాధారణంగా వెళ్లే దారులు మూసివేయడంతో గల్లీ రోడ్లలోకి వాహనాలు మళ్లుతున్నాయి. చిన్నచిన్న రహదారుల్లోనూ భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి.

గవర్నమెంట్ అధికారులకు సూటి ప్రశ్న- అభిజీత్ దిప్కే
విద్యాశాఖ మంత్రి నుంచి టీచర్ల వరకు ప్రతిఒక్కరూ తమ పిల్లలను గవర్నమెంట్ స్కూల్స్‌లోనే చదివించాలని సీజేపీ ఫౌండర్ <a href="https://x.com/abhijeet_dipke/status/2089576679304032644?s=20">అభిజీత్ దిప్కే</a> డిమాండ్ చేశారు. అధికారులు తమ సొంత వర్క్‌ను ఎందుకు ట్రస్ట్ చేయట్లేదని, పిల్లలను ప్రైవేట్ స్కూల్స్‌లో ఎందుకు చేర్పిస్తున్నారని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. విద్యాశాఖలోని వారంతా తమ పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించినప్పుడే, ఆ స్కూల్స్ రేంజ్ మ్యాజిక్‌లా మారిపోతుందని చెప్పారు.

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు
TG: రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ హాజరై పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి సౌజన్య, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, సీపీఓ శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో మొదలైన వానలు!
TG : తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. జగిత్యాలలోని మెట్‌పల్లి, కోరుట్లతో పాటు హైదరాబాద్‌లోని మియాపూర్, దిల్‌సుఖ్‌నగర్, హయత్‌నగర్, ఉప్పల్ ప్రాంతాల్లో వాన పడుతోంది. అలాగే యాదాద్రి, నారాయణపేట జిల్లాల్లోనూ వర్షం మొదలైంది. మరో కొన్ని గంటల్లో మంచిర్యాల, ఆదిలాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

GenZ ఎఫెక్ట్.. 1.95 లక్షల పోస్ట్‌లు బ్లాక్!
విద్యార్థుల నిరసనలు ఊపందుకోవడంతో ప్రభుత్వం సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపుతోంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ ప్రకారం, ప్రభుత్వం దాదాపు 1.95 లక్షల బ్లాకింగ్ ఆర్డర్లను జారీ చేయగా.. ఇందులో ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌లోనే అత్యధికంగా 1,00,000 పోస్ట్‌లపై చర్యలు తీసుకున్నారు. అలాగే ఫేస్‌బుక్‌లో 80,000, యూట్యూబ్‌లో 15,000 ఆర్డర్లు అమలయ్యాయి. హోం మంత్రిత్వ శాఖ 'సహయోగ్' పోర్టల్ ద్వారా హ్యూమన్ రివ్యూ లేకుండానే ఈ పోస్ట్‌లు ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యాయి.

భారత్‌ను ఉదాహరణగా చూపిన ట్రంప్!
అమెరికాలో ఓటింగ్ నిబంధనలను కఠినతరం చేసే 'SAVE America Act' బిల్లును సమర్థిస్తూ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ భారత్ ఎలక్షన్ సిస్టమ్‌ను ఉదాహరణగా చెప్పారు. చెల్లుబాటయ్యే ఫోటో ఐడీ కార్డ్ లేకుండా అమెరికాలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రశ్నించినట్లు తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. 64.6 కోట్ల మంది పాల్గొన్న భారత ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ ఐడీ వాడారని, 1% కంటే తక్కువ మందే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించారని ఆయన గుర్తుచేశారు.

కోతులను తప్పించబోయి కారు బోల్తా!
TG : భూదాన్ పోచంపల్లి సమీపంలో ఇవాళ ఒక కారు ప్రమాదానికి గురైంది. రేవనపల్లి గ్రామానికి చెందిన బస్వారెడ్డి హైదరాబాద్ వెళ్తుండగా, రోడ్డుపై ఉన్న కోతుల గుంపును తప్పించబోయి కారు ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి, పెద్ద ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిశీలించారు.
వన్‌వే ఎఫెక్ట్‌తో నగరవాసులకు ‘Traffic’ కష్టాలు!
TG: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో నేటి నుంచి వన్‌వే అమలు. దీంతో ట్రాఫిక్‌తో వాహనదారులు, బస్సు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెయిన్ రోడ్లతో పాటు గల్లీ రోడ్లలోనూ రద్దీ పెరిగింది. ట్రాఫిక్ జామ్‌ల కారణంగా ఉద్యోగులు ఆఫీసులకు, ఇళ్లకు గంట లేట్‌గా చేరుతున్నారు. వన్‌వేలతో ప్రయాణ దూరం పెరగడంతో పాటు పెట్రోల్, డీజిల్ ఖర్చు ఎక్కువ అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఏడాది, రెండేళ్లు కొనసాగుతుందని నగరవాసులు టెన్షన్‌లో ఉన్నారు.

కిడ్స్ రేవ్ పార్టీ!
ఆస్ట్రేలియన్ ఆర్టిస్ట్ లెన్ని పియర్స్ 'టాడ్లర్ టెక్నో' ఈవెంట్‌ను ఫస్ట్ టైమ్ ఈ నెల భారత్‌కు తీసుకొస్తున్నారు. మిల్లేనియల్ పేరెంట్స్ తమ కిడ్స్‌తో కలిసి ఎంజాయ్ చేసేలా డే టైమ్‌లో 2-3 గంటల పాటు ఈ రేవ్ పార్టీ ప్లాన్ చేశారు. ఇందులో నర్సరీ రైమ్స్‌కు ఈడిఎమ్ బీట్స్ జతచేసి ప్లే చేస్తారు. పిల్లల సెన్సిటివ్ చెవులకు ఇబ్బంది లేకుండా సౌండ్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. ఆల్కహాల్ లేకుండా, మెడికల్ టీమ్‌తో పిల్లలకు సేఫ్‌గా, ఫ్యామిలీ బాండింగ్ పెంచేలా ఈ పార్టీని ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో మరో Gen Alpha ఉద్యమం!
ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ జిల్లా స్మిత్ ఇంటర్ కాలేజీలో విద్యార్థులు నిరసనకు దిగారు. 'కెమిస్ట్రీ సార్ లేకపోతే మా భవిష్యత్తు ఆసిడ్‌లా మండిపోతుంది' అని రాసి ఉన్న ప్లకార్డులతో పాఠశాల ముందు ధర్నాకు కూర్చున్నారు. స్కూల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చాలని, పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
రీల్స్ కోసం రోడ్డుపై ఫైట్.. వీడియో వైరల్!
బెంగళూరులోని కబ్బన్ పార్క్ వద్ద ఇద్దరు యువతుల మధ్య జరిగిన ఘర్షణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రీల్స్ విషయంలో తీవ్ర ఘర్షణకు దారితీసినట్లు తెలుస్తోంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ జుట్టు పట్టుకున్నారు. చుట్టూ ఉన్నవారు చూస్తుండగానే ఫైట్ జరగడంతో కొందరు వీడియోలు తీశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే గొడవకు అసలు కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. చివరకు అక్కడున్నవారు ఆపడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
విద్యార్థినులను వేధిస్తున్న లెక్చరర్!
TG : నల్లగొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కొంతకాలంగా విద్యార్థినులను వేధిస్తున్నాడని లెక్చరర్ భాస్కర్‌ను ABVP (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్) కార్యకర్తలు కొట్టారు. ఈ విషయం తెలుసుకుని కాలేజీ ముందు ఆందోళన చేపట్టిన ABVP నాయకులు, ఆ లెక్చరర్‌కు బుద్ధి చెప్పారు. అతనిపై వెంటనే పోక్సో (POCSO) కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

రిషభ్ పంత్ హిస్టారిక్ రికార్డ్!
టీమిండియా బ్యాటర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్‌లో చారిత్రాత్మక రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో 100 సిక్సర్లు పూర్తి చేసిన తొలి భారత ప్లేయర్‌గా నిలిచాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో 66 రన్స్ చేసే క్రమంలో రెండు సిక్సర్లు కొట్టి ఈ ఘనత సాధించాడు. దీంతో సెహ్వాగ్ (90), రోహిత్ శర్మ (88)లను వెనక్కి నెట్టాడు. అత్యంత వేగంగా 51 టెస్టుల్లోనే ఈ మార్క్ చేరుకోగా, ప్రపంచ స్థాయిలో ఈ ఘనత సాధించిన నాల్గో ప్లేయర్‌గా నిలిచాడు.

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,482 (LBO) వేకెన్సీస్
బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) 2026లో 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టులకు <a href="https://bankofbaroda.bank.in/career/current-opportunities/recruitment-of-local-bank-officers-on-regular-basis-07-09">నోటిఫికేషన్</a> విడుదల చేసింది. ఇందులో 1,300 ఫ్రెషర్స్, 1,182 బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఏదైనా డిగ్రీ చేసి, 21–30 ఏళ్ల వయస్సు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఆగస్ట్ 18 నుంచి సెప్టెంబర్ 7, 2026 వరకు <a href="https://bankofbaroda.bank.in/career/current-opportunities">ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు</a> స్వీకరిస్తారు. ఎంపిక ఆన్‌లైన్ ఎగ్జామ్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. SC/STలకు రూ.175, OBC/EWS అభ్యర్థులకు రూ.850 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

బరువు తగ్గడం కాదు.. శక్తి పెరగడమే ముఖ్యం!
ఆడవాళ్లు ఇప్పుడు కేవలం బరువు తగ్గడం పైనే కాకుండా శరీరంలో శక్తి, బలాన్ని పెంచుకోవడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఫుడ్ తగ్గించి క్యాలరీలు తగ్గించుకోవడం వల్ల నీరసం, అలసట, హార్మోన్ల సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మంచి ప్రోటీన్లు ఉన్న ఆహారం తినడం, శరీరంలో విటమిన్లు తగ్గకుండా చూసుకోవడం, వర్కౌట్స్‌తో పాటు రెస్ట్ తీసుకోవడం చాలా ముఖ్యం. 'బరువు పెరిగారా లేదా అన్నది కాదు.. ఎంత ఉత్సాహంగా, బలంగా ఉన్నారనేదే అసలైన ఆరోగ్యం' అని అంటున్నారు.

పాలిటెక్నిక్‌లను అనుసంధానం చేయొద్దని MLAకు వినతి
TG: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తూ జారీ చేసిన జీవో నంబర్ 97ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎంఎస్‌ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆకాశ్ నాయక్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు తక్కువ ఖర్చుతో సాంకేతిక విద్య అందిస్తున్న ప్రభుత్వ పాలిటెక్నిక్ వ్యవస్థను పటిష్టం చేయాల్సింది పోయి పీపీపీ విధానం తీసుకురావడం ప్రైవేటీకరణకు దారితీసే ప్రమాదం ఉందన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఎం ఫైర్
TG: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు సీపీఎం మద్దతు తెలిపింది. హామీలు ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా ఖాళీ పోస్టులను భర్తీ చేసి యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేసింది. శంషాబాద్‌లో నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ఆందోళన కార్యక్రమానికి సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు బచ్చలకూర స్వామి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని, ఆ హామీ అమలు ఏమైందని ప్రశ్నించారు.