Latest

గ్రావెల్ లారీలను అడ్డుకున్న గ్రామస్తులు
AP: ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం వెల్లటూరులో ఉద్రిక్తత నెలకొంది. భీమవరప్పాడు నుండి నిత్యం వందల సంఖ్యలో గ్రావెల్ లారీలు గ్రామం మీదుగా వెళ్తుండటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. లారీల రాకపోకలతో రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని, ఇళ్లపై దుమ్ము ధూళి పేరుకుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ ఏకమై వెల్లటూటరు ప్రధాన రహదారిపై గ్రావెల్ లారీలను అడ్డుకున్నారు. అధికారులు వెంటనే స్పందించి లారీలను అడ్డుకోవాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. *

దిమాగీ నక్సల్ పార్టీ..మరో కొత్త మూమెంట్
‘కాక్రోచ్ జనతా పార్టీ’ తరహాలో దేశంలో మరో కొత్త మూమెంట్ మొదలైంది. అదే ‘దిమాగీ నక్సల్ పార్టీ’. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పీఎం నరేంద్ర మోదీ ఇచ్చిన ప్రసంగంలో ‘దిమాగీ నక్సల్’(Intellectual Naxals) అనే పదాన్ని ఉపయోగించారు. సమాజంలో ‘నక్సల్ మెంటాలిటీ’ ఉన్నవారిని గుర్తించాలని, యువతను వాళ్లకు దూరంగా ఉంచాలని అన్నారు. దీనికి రియాక్షన్‌గా ఈ పార్టీ మొదలైంది. అప్పుడే ఈ పార్టీ ఇన్‌స్టా ఖాతాకు 47 వేల మందికి పైగా ఫాలోవర్స్ వచ్చారు. ఈ పార్టీకి Think, Research, Resist అనే సిద్ధాంతాలు ఉన్నట్టు ప్రకటించారు.

పవిత్ర సంగమంలో కారు చీకట్లు
AP: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రమైన పవిత్ర సంగమంలో రాత్రి వేళల్లో లైట్లు వెలగకపోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణా–గోదావరి నదుల పవిత్ర కలయిక వద్ద సౌకర్యాలు సరిగా లేకపోవడంతో పర్యాటకుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పవిత్ర సంగమానికి ప్రతిరోజూ వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు, భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లో వచ్చే వారికి లైట్లు వెలగకపోవడంతో చీకట్లోనే తిరగాల్సిన పరిస్థితి నెలకొంది.
'వారణాసి షర్టు’లో మహేష్..
ఫారిన్ ట్రిప్ పూర్తి చేసుకుని తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు తిరిగొచ్చిన హీరో మహేష్ బాబు ఎయిర్‌పోర్ట్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆయన వేసుకున్న షర్ట్‌పై 'వారణాసి' అని రాసి ఉండటంతో పాటు శివుడి త్రిశూలం, సినిమాలో ధరించిన లాకెట్ లోగోలు కనిపిస్తుండటం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇది చూసిన అభిమానులు అప్పుడే సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టేశారని అనుకుంటున్నారు.

జాతీయ గీతాన్ని మార్చాల్సిందే: ముఖేష్ ఖన్నా
దేశ జాతీయ గీతంగా ఉన్న 'జన గణ మన' స్థానంలో 'వందేమాతరం'ను తీసుకురావాలని ప్రముఖ నటుడు ముఖేష్ ఖన్నా అన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటీష్ రాణిని పొగుడుతూ 'జన గణ మన' రాశారని, అది మన జాతీయ గీతం కాకూడదని ఆయన తెలిపారు. పూర్తిగా మనదైన 'వందేమాతరం'పై తాను ఏడు నిమిషాల ఐకానిక్ పాటను రికార్డ్ చేశానని, అది ఆరు నెలల్లో విడుదలవుతుందని చెప్పారు.

ఏపీలో జూనియర్ డాక్టర్ల ఎమర్జెన్సీ సేవలు బంద్
AP: స్టైపెండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ కొన్ని రోజులుగా సాధారణ విధులను బహిష్కరిస్తున్న ఏపీ జూనియర్ డాక్టర్లు రేపటి నుంచి ఎమర్జెన్సీ సేవలను కూడా బంద్ చేయాలని నిర్ణయించారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎమర్జెన్సీ, క్యాజువాల్టీ, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లలో వైద్య సేవల కు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. వైద్య సిబ్బందికి మెడికల్ లీవులతోపాటు ఇతర అన్ని రకాల సెలవులను అధికారులు రద్దు చేశారు. అత్యవసర వైద్య సేవలు నిరంతరం కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

బాలీవుడ్ హీరోలకు షోకాజ్ నోటీసులు
బాలీవుడ్ హీరోలు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర FDA(Food and Drug Administration) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విమల్ పాన్ మసాలా కంపెనీకి చెందిన యాలకుల యాడ్‌లో యాక్ట్ చేసి, నిషేధిత పాన్ మసాలాను ప్రోత్సహించారని తెలిపింది. ఆ యాడ్స్ ప్రచారం వెంటనే ఆపాలని, సోషల్ మీడియా నుంచి కంటెంట్ తొలగించాలని ఆదేశించారు. అగ్రిమెంట్లు, పారితోషిక వివరాలు సబ్‌మిట్ చేయాలని కోరారు.

రాబోయే 22 గంటల్లో వాయుగుండం..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి 'స్పష్టమైన అల్పపీడనం'గా మారింది. ఇది రాబోయే 22 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, విశాఖ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయి. సముద్రం అలజడిగా ఉంటుంది కాబట్టి, మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు చెబుతున్నారు.

రౌడీ షీటర్లకు పల్నాడు పోలీసుల కౌన్సిలింగ్
AP: పల్నాడు జిల్లాలో నేరనియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రౌడీ షీటర్లు, నేరచరిత్ర కలిగినవారికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆదేశాల మేరకు అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఈ కార్యక్రమం చేపట్టారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలికి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

గౌతు లచ్చన్న సేవలు మరువలేనివి
AP: సర్దార్ గౌతు లచ్చన్న సేవలు మరువలేనివని మాజీ మంత్రి గౌతు శివాజీ అన్నారు. లచ్చన్న 117వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కిష్టపురం గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మందస మండలం మందస, బాలిగాం జంక్షన్ లలో మండల టిడిపి అధ్యక్షులు భావన దుర్యోధన ఆధ్వర్యంలో గౌతు లచ్చన్న జయంతి వేడుకలు నిర్వహించారు.

ఇండస్ట్రియల్ కెమికల్స్ దొంగల అరెస్ట్
TG: నల్గొండ జిల్లా చిట్యాల పరిధిలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వచ్చే కెమికల్స్‌ను అక్రమంగా దారి మళ్లిస్తూ అమ్ముతున్న ముఠాను చిట్యాల పోలీసులు అరెస్టు చేశారు. వెలిమేడు రాజస్థాన్ దాబా వెనక లారీలలో ట్యాంకర్లలో అక్రమంగా కెమికల్స్‌ను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారన్న సమాచారంతో దాడులు చేసి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పెళ్లి పీటలపై యువతి సంచలన నిర్ణయం.. వివాహం రద్దు
TG: పెళ్లి పీటలపైకి వచ్చిన యువతి పెళ్లి ఇష్టం లేదని చెప్పడంతో వివాహం రద్దయింది. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం క్యాంప్ రాయవరం గ్రామానికి చెందిన యువకుడికి, బిజినపల్లి మండలం సల్కర్‌పేట గ్రామానికి చెందిన యువతికి పెళ్లి కుదిర్చారు. పెళ్లి పీటలపైకి వచ్చిన యువతి తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పడంతో అక్కడి వాతావరణం మారిపోయింది. అనంతరం పోలీసులు, సఖి కేంద్రం సిబ్బంది అక్కడికి చేరుకుని వారి పెద్దలకు నచ్చజెప్పారు.

పరకాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన
హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సాగింది. నియోజకవర్గ స్వరూపాన్ని మార్చేలా రూ.484.42 కోట్ల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి పనులకు మంత్రులతో కలిసి ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 100 పడకల ఏరియా ఆసుపత్రి & డిగ్రీ కళాశాలను ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, లక్ష్మణ్ ,పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, వరంగల్ ఎంపీ కడియం కావ్య ,ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

AIతో మాట్లాడుతున్నారా? జాగ్రత్త!
మన ఫోన్‌లోని AIతో మాట్లాడటం ఇప్పుడు చాలా సహజంగా మారిపోయింది. ఏదైనా అడిగితే సమాధానం, రిమైండర్లు, మెసేజ్‌లు, స్మార్ట్ పరికరాల కంట్రోల్.. ఇలా చాలా పనులు వాయిస్‌తోనే జరిగిపోతున్నాయి. అయితే మనం మాట్లాడే మాటలు ఎక్కడ ప్రాసెస్ అవుతున్నాయి? ఎంతకాలం స్టోర్ అవుతున్నాయి? వాటిని ఎవరు యాక్సెస్ చేయగలరు? కొన్ని AI సర్వీసులు మెరుగైన సేవల కోసం వాయిస్ డేటాను ప్రాసెస్ లేదా స్టోర్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే AI సౌకర్యాన్ని ఉపయోగిస్తూనే, మన వాయిస్ డేటా ఎలా ఉపయోగించబడుతుందో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం.

జాబ్ పోతే PFలో ఎంత డబ్బు?
ఉద్యోగం పోయిన వారికి PF డబ్బులపై కొత్త నిబంధనలు వచ్చాయి. EPF స్కీమ్-2026 ప్రకారం, ఉద్యోగం పోయిన వెంటనే PFలోని 75శాతం వరకు డబ్బు తీసుకోవచ్చు. 12 నెలల్లోనూ కొత్త ఉద్యోగం రాకపోతే మిగిలిన 25శాతం డబ్బు తీసుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగం వస్తే 25శాతం తీసుకునే అవకాశం ఉండదు.

'ఆగస్టు' అని ఎలా పేరొచ్చింది!
క్యాలెండర్‌లో ఎనిమిదో నెల అయిన 'ఆగస్టు'కు ఆ పేరు రావడం వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. పూర్వం రోమన్ క్యాలెండర్‌లో ఇది ఆరో నెలగా ఉండేది, అందుకే లాటిన్ భాషలో దీనిని 'సెక్స్టిలిస్' (ఆరో నెల) అని పిలిచేవారు. అయితే, రోమన్ సామ్రాజ్యానికి మొదటి చక్రవర్తి అయిన 'అగస్టస్ సీజర్' యుద్ధాల్లో సాధించిన గొప్ప విజయాలకు గుర్తుగా, ఆయన గౌరవార్థం క్రీస్తు పూర్వం 8వ సంవత్సరంలో రోమన్ పాలకులు ఈ నెలకు 'ఆగస్టు' అని పేరు మార్చారు. అలా ఆరో నెల కాస్తా అగస్టస్ చక్రవర్తి పేరు మీద 'ఆగస్టు'గా మారిపోయింది.

ఆస్తులు ఉన్నా అంత్యక్రియలకు ఎవరూ రాలేదు!
ఆస్తులున్నా ఆత్మీయులు లేక ఓ కుబేరుడు అనాథగా కన్నుమూశాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కోటీశ్వరుడు రాజకుమార్ సక్సేనాకు ఆస్తులు, ముగ్గురు కొడుకులు, కూతురు, భార్య ఉన్నారు. ఆస్తులన్నీ రాయించుకున్నాక అతడిని ఇంట్లోంచి వెళ్లగొట్టారు. వృద్ధాశ్రమంలో ఉన్న ఆయన అనారోగ్యంతో ఈ నెల 11న ఆస్పత్రిలో మరణించారు. చనిపోయేముందు కుటుంబాన్ని చూడాలనుకున్నా ఆయన కోరిక తీరలేదు. డాక్టర్లు సమాచారమిచ్చినా తమకేం సంబంధం లేదని చెప్పారు. చివరికి పోలీసులే స్వచ్ఛంద సంస్థ సాయంతో అంత్యక్రియలు జరిపించారు.

ప్యాకేజ్డ్ కొబ్బరి నీళ్లు వద్దు!
కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, బాటిళ్లలో అమ్మే ప్యాకేజ్డ్ నీళ్ల కంటే తాజా నీళ్లు తాగడమే మంచిదని డాక్టర్లు అంటున్నారు. ఎందుకంటే ప్యాకేజ్డ్ నీళ్లలో ఖనిజాలు తగ్గి, పంచదార కలపవచ్చు. ఇక కిడ్నీ సమస్యలు ఉన్నవారు, రక్తంలో పొటాషియం ఎక్కువ ఉన్నవారు డాక్టర్ సలహా లేకుండా వీటిని ఎక్కువగా తాగకూడదు. విరోచనాలు, వాంతులై బాడీలో నీటిశాతం తగ్గినప్పుడు కొబ్బరి నీళ్లు ORS కి ఆల్టర్నేటివ్ కావు. ఆ టైమ్‌లో ORS వాడటమే మేలని డాక్టర్లు చెబుతున్నారు.

‘సామాజిక న్యాయానికి విలువ లేకుండా పోయింది’
TG: రాజ్యాంగంలో పొందుపర్చిన సామాజిక న్యాయానికి విలువ లేకుండా పోయిందని, భారత పార్లమెంట్‌లోనే సాటి సభ్యులను ‘లుంగీ వాలా’ అని పిలవడం దారుణమని జస్టిస్ సుదర్శనరెడ్డి అన్నారు. జాతీయ పార్టీకి చెందిన దళిత నాయకుడు ప్రసంగించిన వేదికను శుద్ధి చేయడం సామజిక అన్యాయనికి దర్పణం పడుతున్నాయని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో HYDలోని JNTU ఆడిటోరియంలో జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఆర్థిక అంతరాలు తగ్గించకపోతే దేశంలో అశాంతి పెరుగుతుందని హెచ్చరించారు.

కాచిగూడ..ఆ పేరెలా వచ్చిందో తెలుసా?
హైదరాబాద్ నగరంలోని కాచిగూడ..అక్కడుంటే రైల్వే స్టేషన్ చాలా ఫేమస్. ఆ పేరెలా వచ్చిందో మీకు తెలుసా? కాచి/కాచ్హి కులస్థులు ఉత్తర భారతదేశంలోని బుందేల్‌ఖండ్ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చారు. వీరు వ్యవసాయం, తోటపని, కూరగాయలు, పండ్లు పండించేవాళ్లు. నది ఒడ్డున నివసించడం వీళ్లకు అలవాటు. ఏడవ నిజాం కాచిగూడ రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టినప్పుడు 300 కాచి కుటుంబాలు ఆ పనుల్లో పాల్గొన్నాయి. నిజాం మూసీ నది తీరంలో భూములను వాళ్లకి బహుమతిగా ఇచ్చారు. అలా ఆ ప్రాంతానికి ‘కాచిగూడ’ పేరు పెట్టినట్లు చారిత్రక కథనాలున్నాయి.

Monsoon Special: బొంత కాకరకాయ
వర్షాకాలం రాగానే మార్కెట్‌లో బొంత కాకరకాయల (బోడ కాకర) గిరాకీ ఒక్కసారిగా పెరిగింది. సాధారణ కాకరకాయలా చేదుగా ఉండకపోవడం, అడవుల్లో సహజంగా పండే ఈ కూరగాయలో విటమిన్-సి, ఫైబర్, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ కాయలు ఇమ్యూనిటీని పెంచి, షుగర్, బీపీని కంట్రోల్ లో ఉంచుతాయి. అడవుల్లో సహజంగా పండే ఈ కూరగాయకు ఈ సీజన్‌లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కిలో ధర రూ.300 వరకు ఉంది. కొంచెం ధర ఎక్కువైనా ఆరోగ్యానికి మంచిదని అందరూ ఇష్టంగా కొంటున్నారు.