Latest

దాచేపల్లిలో డిప్యూటీ సీఎం పుట్టినరోజు వేడుకలు
AP: పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు. తొలుత స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన మ్యాజిక్ డ్రైనేజీని ప్రారంభించారు. ఆ తర్వాత స్థానిక జనసేన పార్టీ కార్యాలయం ఎదుట కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. నేటి తరం యువతకు పవన్ కళ్యాణ్ ఆదర్శంగా నిలిచారని అన్నారు. ప్రజల కోసం ఆయన చేస్తున్న మంచి పనులను వివరించారు.

మమతా బెనర్జీ మేనకోడలు ఆత్మహత్య!
Ex CM మమతా బెనర్జీ మేనకోడలు (కజిన్ బ్రదర్ నిహార్ ముఖర్జీ కూతురు) బృష్టి ముఖర్జీ(28) ఆత్మహత్య చేసుకున్నారు. రాంపూర్ హాట్‌లోని నివాసంలో మంగళవారం మధ్యాహ్నం ఆమె ఉరి వేసుకోగా, హాస్పిటల్‌కి తీసుకెళ్ళేసరికే చనిపోయినట్లు డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. మమతా హయాంలో జరిగిన టీచర్ నియామకాలను కోర్టు రద్దు చేయడంతో ఉద్యోగం పోవడం, మరోవైపు భర్తతో డివోర్స్ కేసు నడుస్తుండటంతో ఆమె డిప్రెషన్‌లో ఉన్నట్లు ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు. బాడీని పోస్ట్‌మార్టమ్‌కి పంపిన పోలీసులు కేస్ ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.

రేవంత్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జిషీట్
TG: రేవంత్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జిషీట్ విడుదల చేసింది. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ పాలనలో ఏ వర్గమూ సుఖంగా లేదని అన్నారు. ఇది వెయ్యి రోజుల పాలన కాదని, ప్రజాపీడన అని విమర్శించారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేతలు అరాచకాలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నేతలు దందాలకు పాల్పడుతూ రాజధానిని ఏటీఎంగా మార్చుకున్నారని ఆరోపించారు. నగరంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరదల్లోనూ కూలని ఇల్లు..కారణం ఏంటి?
నేపాల్‌లోని నువాకోట్ జిల్లా వరదల్లో చాలా ఇళ్లు కొట్టుకుపోయాయి. 40 ఏళ్ల నాటి మింట్-గ్రీన్ రంగు ఇల్లు చెక్కుచెదకుండా ఉంది. ఇంటి లోపల ఆరుగురు పైఅంతస్తులోకి ప్రాణాలు దక్కించుకున్నారు. వారిలో ఒకరైన లక్ష్మీపాండే మీడియాతో మాట్లాడుతూ తను రోజూ హనుమాన్ చాలీసా చదువుతానని, వరద సమయంలో “ఓం నమః శివాయ” జపం చేస్తూ ఉన్నానని చెప్పారు. అదే తమను కాపాడిందని భావిస్తున్నామన్నారు. అయితే బలమైన పునాది ఉండటం, ఫౌండేషన్‌ను బలపరిచారని నిపుణులు అంటున్నారు. Reinforced కాంక్రీట్ ఫ్రేమ్ వల్లే ఇల్లు సురక్షితంగా ఉందని అంటున్నారు.

డీజే సౌండ్‌కి 16 ఏళ్ల బాలుడు బలి
నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డిపల్లిలో తీవ్ర విషాదం జరిగింది. ఆదివారం రోజు గొల్ల మల్లప్ప కూతురి వివాహం జరగ్గా, సోమవారం రాత్రి డీజే బ్యాండ్ నిర్వహించారు. ఈ వేడుకలో డ్యాన్స్ చేస్తూ రవితేజ (16) అనే బాలుడు డీజే సౌండ్ తట్టుకోలేక గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని కోస్గి హాస్పిటల్‌కి తరలించగా, అప్పటికే బాలుడు చనిపోయాడని డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. ఈ ఇన్సిడెంట్ పై ఇప్పటివరకు ఎలాంటి కంప్లైంట్ అందలేదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు.

సాంస్కృతిక సారథి AOగా విజయలక్ష్మి
TG: తెలంగాణ సాంస్కృతిక సారథి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన విజయ్ కుమార్ గత కొంతకాలంగా తెలంగాణ సాంస్కృతిక సారథిలో విధులు నిర్వహించగా, ఆయన భాషా సాంస్కృతిక శాఖకు బదిలీ అయ్యారు. దీంతో ఆయన స్థానంలో విజయలక్ష్మిని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా నియమించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ డాక్టర్ జీ.వీ. వెన్నెల గద్దర్ పూల బొకేతో విజయలక్ష్మికి స్వాగతం పలికారు.
రాజాంలో పవన్ కళ్యాణ్ బర్త్‌డే సెలబ్రేషన్స్
AP: విజయనగరం జిల్లా రాజాంలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా GMR కేర్ సెంటర్ నుంచి చీపురుపల్లి రోడ్డు వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఓ కళ్యాణ మండపంలో కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం LED స్క్రీన్‌పై పవన్ కళ్యాణ్ సందేశాన్ని వీక్షించారు. అభిమానులు, జనసేన శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
నేపాల్ వరద బాధితులకు సోనూసూద్ సాయం
నేపాల్ వరద బాధితులకు సాయం చేసేందుకు నటుడు సోనూసూద్ తన టీంతో కలిసి కాఠ్మాండుకు చేరుకున్నారు. బాధితులకు నిత్యావసర వస్తువులు అందించేందుకు వచ్చినట్లు తెలిపారు. భారత్ నుంచి నేపాల్‌కు సహాయం పంపడం రిస్క్‌తో కూడుకున్నప్పటికీ, బాధితుల అవసరాలను తెలుసుకుని సాయం అందిస్తామని చెప్పారు. వారి జీవితాలను తిరిగి నిర్మించుకునేందుకు హెల్ప్ చేయడం మనందరి బాధ్యత అని వివరించారు.

అజయ్ కుమార్‌కు కీలక బాధ్యతలు
AP: విజయనగరం జిల్లా రాజాం ప్రాంతానికి చెందిన పి. అజయ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రిఫరీ బోర్డు చీఫ్ రిఫరీగా నియమితులయ్యారు. బొద్దాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ నిర్దేశకుడిగా పనిచేస్తున్న అజయ్ కుమార్‌ను చీఫ్ రిఫరీగా నియమిస్తూ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. 1990లో రాష్ట్రస్థాయి, 1993లో జాతీయస్థాయి రిఫరీగా ఎంపికైన ఆయన 33 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. ఇప్పటివరకు 55 జాతీయస్థాయి పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.

భారీగా తగ్గిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. Goodreturns వెబ్‌సైట్ అప్‌డేట్ ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ₹2,070 తగ్గి ₹1,52,020 వద్ద ట్రేడ్ అవుతోంది. అలానే 22 క్యారెట్లపై ₹1,900 తగ్గి ₹1,39,350 వద్ద, 18 క్యారెట్లపై ₹1,550 తగ్గి ₹1,14,020 దగ్గర ఉంది. మార్కెట్లో బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి షాపింగ్ ప్లాన్ చేసేముందు లైవ్ ప్రైసెస్ చెక్ చేసుకోండి

సైబర్ మోసాలపై అవగాహన
TG: ఆన్‌లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బజార్‌హత్నూర్ పోలీసులు సూచించారు. ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలంలో పోలీసులు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మొబైల్ ద్వారా జరిగే సైబర్ మోసాలపై ప్రజలకు వివరించారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపించే ఓటీపీలు, మెసేజ్‌లు, అనుమానాస్పద లింకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బ్యాంకు, వ్యక్తిగత వివరాలతో కూడిన ఓటీపీలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు చెప్పకూడదని తెలిపారు. గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయవద్దని సూచించారు.

ఊరు ఒక్కటే.. మండలాలు మాత్రం మూడు
TG: హనుమకొండ జిల్లా వెంకటేశ్వర్లపల్లి గ్రామస్థులు మూడు మండలాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాల పునర్విభజనకు ముందు వరంగల్ జిల్లా పరకాల మండలంలో ఉన్న ఈ గ్రామాన్ని అనంతరం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో చేర్చారు. కొత్తగా నడికుడ మండలం ఏర్పడిన తర్వాత గ్రామాన్ని ఆ మండలంలో విలీనం చేశారు. దీంతో రెవెన్యూ పనులకు నడికుడ, పరిపాలనా అవసరాలకు కమలాపూర్, శాంతిభద్రతల వ్యవహారాలకు పరకాల మండలాలను ఆశ్రయించాల్సి వస్తోంది. దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో సమయం, డబ్బు వృథా అవుతున్నాయని అన్నారు.

వైఎస్సాఆర్‌కు ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఘన నివాళి
TG: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను నాయకులు గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోపాల్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ మినాజ్, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని వైఎస్సార్‌కు ఘన నివాళులు అర్పించారు.

TTD ఆఫీసర్ ఇంట్లో సడన్ రైడ్స్!
తిరుమల తిరుపతి దేవస్థానం Deputy EO మొండు లోకనాథం ఇంట్లో ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో ACB ఆఫీసర్స్ సడన్ రైడ్స్ చేశారు. బుధవారం 6AM నుంచి తిరుపతి పెదకాపు లేఅవుట్‌లోని ఆయన ఇల్లు, బంధువుల ఇళ్లు, తిరుమలలోని గెస్ట్‌హౌస్‌లో ACB DSP శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 7 స్పెషల్ టీమ్స్ ఒకేసారి సెర్చ్ ఆపరేషన్ చేసింది. తిరుపతి SBI బ్రాంచ్ లాకర్లను కూడా ఆఫీసర్స్ వెరిఫై చేస్తున్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత TTD హిస్టరీలో ఒక Deputy EO స్థాయిలో ఉన్న ఆఫీసర్ ఇంట్లో ACB ఆఫీసర్స్ రైడ్స్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్.

పోస్టుమాస్టర్ నిర్లక్ష్యం.. బాధితుడికి ఆర్థిక నష్టం
AP: రికరింగ్ డిపాజిట్ (RD) వ్యవహారంలో పోస్టుమాస్టర్ నిర్లక్ష్యంతో ఆర్థికంగా, మానసికంగా నష్టపోయానని అంబేడ్కర్ కోనసీమ జిల్లా లక్కవరం గ్రామానికి చెందిన జిల్లెల్ల శ్రీనివాస్ ఆరోపించారు. సమస్య పరిష్కారం కోసం గతంలో పోస్టుమాస్టర్ సుబ్రహ్మణ్యాన్ని సంప్రదించినా ఫలితం లేకపోవడంతో వినియోగదారుల సంక్షేమ సంఘాన్ని ఆశ్రయించారు. తనకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరుతూ పోస్టుమాస్టర్‌కు సంఘం ఆధ్వర్యంలో రిజిస్టర్డ్ లేఖ పంపించారు. లేఖ అందిన 15 రోజుల్లోగా బాధితుడికి నష్టపరిహారం అందించాలని వారు సూచించారు.

Today Political Updates..
1. ICUలో అన్నా హజారే 2. పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేళ జనసేన యువజన విభాగం ఏర్పాటు. 3. ఢిల్లీ YSR అవార్డుల ఈవెంట్‌కు CM రేవంత్ హాజరు. 4. మంత్రివర్గ విస్తరణ చర్చల కోసం ఢిల్లీకి TPCC చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ CM భట్టి. 5. YS జగన్ పులివెందుల టూర్ కొనసాగింపు. 6. KCR రాజీనామా డిమాండ్‌తో కాంగ్రెస్ బైక్ ర్యాలీలు. 7. రేవంత్ 1000 రోజుల పాలనపై చార్జ్ షీట్ రిలీజ్ చేస్తూ BRS నిరసనలు. 8. పాయకరావుపేటలో గోదావరి జలాలకు CM చంద్రబాబు జల హారతి.

పెంకుటింటికి లక్షల్లో కరెంట్ బిల్లు
TG: ములుగు జిల్లా ప్రేమ్‌నగర్‌లో ఓ పెంకుటింటికి ఏకంగా రూ.1.43 లక్షల విద్యుత్ బిల్లు రావడం కలకలం రేపింది. కొమ్మినేని ప్రసాద్ దంపతులు తమ ఇంటికి ఇంత భారీ బిల్లు రావడంతో ఆందోళన వ్యక్తం చేశారు. 2024 నుంచి గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు వినియోగానికి జీరో బిల్లులు వచ్చేవని తెలిపారు. కొంతకాలంగా బిల్లులు ఇవ్వలేదని, తాజాగా ఆగస్టు నెలకు రూ.1,43,136 బిల్లు ఇచ్చారని చెప్పారు. బిల్లు చెల్లించలేదని విద్యుత్ అధికారులు ఇంటి కరెంట్ కనెక్షన్ తొలగించారని ఆరోపించారు. అధికారులు పరిశీలించి న్యాయం చేయాలని కోరారు.

ఇరాన్ వార్ ఎఫెక్ట్.. ట్రంప్ కెరీర్‌లోనే రికార్డ్!
ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ రికార్డు స్థాయిలో పడిపోయింది. రాయిటర్స్-ఇప్సోస్ సర్వే ప్రకారం కేవలం 33% అమెరికన్లు మాత్రమే ఆయనను సపోర్ట్ చేస్తుండగా, 64% మంది వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ కెరీర్‌లోనే ఇది అతి తక్కువ రేటింగ్. ఇరాన్ వార్, పెరిగిన లివింగ్ కాస్ట్ వల్ల ప్రజల్లో అసంతృప్తి బాగా పెరిగిందని సర్వే తెలిపింది. కేవలం 31% మాత్రమే మిలిటరీ యాక్షన్‌కు మద్దతు ఇచ్చారు. ఈ ప్రభావం నవంబర్‌లో జరిగే అమెరికా మిడ్‌టర్మ్ ఎలక్షన్స్‌పై గట్టిగా పడే ఛాన్స్ ఉంది.

నేషనల్ హైవే అయినా.. ప్రయాణం నరకం
TG: పేరుకే నేషనల్ హైవే, గుంతలతో ప్రయాణికులకు నరకయాతన తప్పడం లేదు. నిర్మల్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుష్టి నుంచి ఆదిలాబాద్ జిల్లా కేంద్రం వరకు రహదారి అధ్వానంగా మారడంతో ప్రయాణ సమయం భారీగా పెరిగింది. గతంలో గంట పది నిమిషాల్లో చేరే మార్గంలో ప్రస్తుతం రెండుగంటల వరకు పడుతోంది. నేరడిగొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్ నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుష్టి గ్రామం వద్ద వంతెనపై భారీ గుంత ఏర్పడటంతో ఒకవైపు మాత్రమే వాహనాలు సాగుతున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్య పెరిగింది.

స్కూల్‌లో టాబ్లెట్స్ వేసుకొని 54 మందికి అస్వస్థత!
అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక స్కూల్‌లో మలేరియా టాబ్లెట్స్ (క్లోరోక్విన్) వికటించి 54 మంది స్టూడెంట్స్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హాస్పిటల్లో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ మడివి జమున అనే 7 ఏళ్ల పాప చనిపోయింది. మిగతా స్టూడెంట్స్‌ని భద్రాచలం హాస్పిటల్‌కి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం అందరి హెల్త్ కండిషన్ సేఫ్‌గానే ఉందని కలెక్టర్ చెప్పారు. ఈ ఇన్సిడెంట్‌పై సీఎం చంద్రబాబు స్పందిస్తూ ఎంక్వైరీకి ఆర్డర్ వేశారు.

40 ఏళ్ల నుంచే ఈ చేంజెస్ మస్ట్!
70 ఏళ్ల వయసులో జ్ఞాపకశక్తి చెడిపోకుండా డిమెన్షియా నుండి కాపాడుకోవాలంటే 40 ఏళ్ల నుంచే బ్రెయిన్ హెల్త్ జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెప్తున్నారు. 40s మరియు 50s లో ఉండే బిపి, కొలెస్ట్రాల్, షుగర్, ఒబెసిటీ, డిప్రెషన్ వల్ల మెదడు కణాలు దెబ్బతింటాయి. వీటిని అదుపు చేయడానికి వారానికి కనీసం 150 నిమిషాల ఫిజికల్ ఎక్సర్‌సైజ్ చేయాలి. హెల్తీ ఫుడ్ తినడం, మంచి నిద్ర, స్మోకింగ్ మానడం, రీడింగ్ లేదా పజిల్స్ ద్వారా కొత్త స్కిల్స్ నేర్చుకోవడం వల్ల బ్రెయిన్ ఫంక్షన్ activeగా ఉండి జ్ఞాపకశక్తి సరిగ్గా ఉంటుంది.