Latest

ధరల నియంత్రణకు ప్రభుత్వం బిగ్ స్టెప్
AP· 3 Aug 2026

ధరల నియంత్రణకు ప్రభుత్వం బిగ్ స్టెప్

AP: బియ్యం ధరల పెరుగుదలను నియంత్రించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడ ఆటోనగర్ APIIC రైతు బజార్‌లో మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 150 రైతు బజార్లు, 500 రైస్ మిల్ అవుట్‌లెట్లలో ఆదివారం నుంచి సబ్సిడీ ధరలకు నాణ్యమైన బియ్యం విక్రయాలు ప్రారంభించినట్లు వెల్లడించారు. BPT స్టీమ్ రైస్‌ను కిలో రూ.52కు, BPT పచ్చి బియ్యాన్ని రూ.50కు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. కందిపప్పు, పామాయిల్ ధరల నియంత్రణపైనా ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.

ప్రపంచానికి తెలంగాణ వైభవం చాటడమే లక్ష్యం
TG· 3 Aug 2026

ప్రపంచానికి తెలంగాణ వైభవం చాటడమే లక్ష్యం

తెలంగాణ పర్యాటక రంగానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అమెరికాలోని బాల్టిమోర్‌లో జరుగుతున్న తెలుగు అసోసియేషన్ మహాసభల్లో పాల్గొన్న ఆయన, NRI కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. తెలంగాణ పర్యాటకాభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహంలో ప్రవాస తెలుగువారు కీలక పాత్ర పోషించాలని కోరారు. NRIలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేందుకు కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

విద్యార్థులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి: KTR
Politics· 3 Aug 2026

విద్యార్థులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి: KTR

TG: ఇంజినీరింగ్ విద్యార్థులను "క్రిమినల్ వేస్ట్" అని CM రేవంత్ రెడ్డి అనడం సరికాదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తీవ్ర విమర్శలు చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాసిన ఆయన, CM వ్యాఖ్యలను ఖండించకుండా మౌనం పాటిస్తే వాటిని సమర్థించినట్టేనని పేర్కొన్నారు. యువత రేపటి భారత నిర్మాణంలో కీలకమని, విద్యార్థులను అవమానించే వ్యాఖ్యలు సరికావని అన్నారు. ఎన్నికల సమయంలో ఉద్యోగాల హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు యువత మనోభావాలను దెబ్బతీస్తోందని విమర్శించారు.

చిప్స్ ప్యాకెట్‌లోని బొమ్మతో బాలుడి మృతి..
News· 2 Aug 2026

చిప్స్ ప్యాకెట్‌లోని బొమ్మతో బాలుడి మృతి..

కర్ణాటకలోని మైసూరు జిల్లా గౌరిపుర గ్రామంలో ఐదేళ్ల ముకుంద్ మయూర్ అనే బాలుడు చిప్స్ (కుర్‌కురే) ప్యాకెట్‌లో వచ్చిన చిన్న ప్లాస్టిక్ బంతిని మింగాడు. ఆ బంతి గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక స్పృహ కోల్పోయాడు. తల్లిదండ్రులు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లిన బాలుడిని వైద్యులు కాపాడలేకపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈనెల 5న మహారాష్ట్రలో CJP కీలక సమావేశం
Politics· 2 Aug 2026

ఈనెల 5న మహారాష్ట్రలో CJP కీలక సమావేశం

CJP భవిష్యత్తు కార్యాచరణపై కీలక సభ్యులతో ఈనెల 5న మహారాష్ట్రలోని సంభాజీనగర్‌లో సమావేశముంటుందని ఆ పార్టీ తెలిపింది. ఈ సమావేశం CJP ఫౌండర్ అభిజీత్ దిప్కే ఇంట్లో జరుగుతుందని వారు తెలిపారు. గత నెల దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నీట్ (NEET) పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా పార్టీ నెల రోజుల పాటు నిరసనలు చేపట్టింది. ప్రొటెస్ట్లు ఆగడంతో సపోర్టర్లు, వాలంటీర్లు కొన్నిరోజులు తమ ఫ్యామిలీతో గడపాలని పార్టీ వారితో చెప్పినట్లు తెలుస్తోంది.

బాలుడు కారుతో ర్యాష్ డ్రైవింగ్.. వెహికల్స్ ధ్వంసం
Crime· 2 Aug 2026

బాలుడు కారుతో ర్యాష్ డ్రైవింగ్.. వెహికల్స్ ధ్వంసం

TG: హైదరాబాద్ కార్మిక్‌నగర్‌లో అద్దె కారుతో మైనర్ బాలుడి ర్యాష్ డ్రైవింగ్ కలకలం రేపింది. బాలుడు కారు డ్రైవ్ చేస్తూ అదుపుతప్పడంతో, చర్చికి బైక్ పై వెళ్తున్న ఇద్దరినీ ఆక్సిడెంట్ చేశాడు. ఈ ప్రమాదంలో వారికీ తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు పక్కన పార్క్ చేసిన వెహికల్స్ పైకి కారు దూసుకెళ్లడంతో పూర్తిగా దెబ్బతిన్నాయి. స్థానికులు వెంటనే గాయపడిన వారిని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కారు నడిపిన మైనర్ బాలుడిని పట్టుకుని స్థానికులు మధురానగర్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాలో రికార్డయ్యింది.

శ్రీలంక సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా దూరం
Sports· 2 Aug 2026

శ్రీలంక సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా దూరం

శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరం అయ్యాడు. మొదట BCCI ప్రకటించిన 15 మంది ఆటగాళ్ల టీమ్‌లో అతడి పేరు ఉన్నా, హెల్త్‌ను చూసి ఆడిస్తామని చెప్పారు. బుమ్రా ఫిట్‌నెస్ టెస్టు పాస్ అయ్యాడని మొన్న వార్తలు వచ్చాయి. కానీ, డాక్టర్లు చేసిన పరీక్షల్లో అతడి ఎడమ మోకాలిలో ఇంకా నొప్పి ఉన్నట్లు తేలింది. దీంతో రిస్క్ వద్దని, పూర్తిగా తగ్గేదాకా రెస్ట్ తీసుకోమని BCCI సూచించింది.

భుజంపై మొసలిని మోసుకొని పోలీస్ స్టేషన్‌కు.. ఆ తరువాత
Viral· 2 Aug 2026

భుజంపై మొసలిని మోసుకొని పోలీస్ స్టేషన్‌కు.. ఆ తరువాత

బీహార్ సుపౌల్ జిల్లాలోని 5 అడుగులున్న మొసలి వరి పొలంలోకి వచ్చింది. అక్కడే పొలంలో పని చేసుకుంటున్న రైతులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. రైతులందరు దైర్యం చేసి ఆ మొసలిని జాగ్రత్తగా తాళ్లతో కట్టేశారు. మొసలి ఎవరిపై దాడి చేయకుండా అమిత్ కుమార్(రైతు) దాన్ని నోరిని కూడా తాళ్లతో కట్టాడు. మొసలిని భుజంపై మోసుకుంటూ దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాడు. మొసలిని హ్యాండోవర్ చేసుకున్న ఫారెస్ట్ ఆఫీసర్స్ దగ్గర్లోని ఓ నదిలో వదిలేశారు. దింతో ఆ రైతు మోసుకొస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలయ్యింది.

లష్కర్ బోనాల జాతరలో CM రేవంత్ రెడ్డి
Politics· 2 Aug 2026

లష్కర్ బోనాల జాతరలో CM రేవంత్ రెడ్డి

TG: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు. సీఎంతో పాటు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ప్రజాప్రతినిధులు లష్కర్ బోనాల జాతరలో పాల్గొన్నారు. ఈ బోనాల జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు.

కాళ్లు, చేతులు కట్టేసి కత్తితో గొంతుకోసి..
Crime· 2 Aug 2026

కాళ్లు, చేతులు కట్టేసి కత్తితో గొంతుకోసి..

TG: జనగామ జిల్లాకు చెందిన రజిత, నర్సంపేట మండలానికి చెందిన అనిల్ ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఉపాధి కోసం నెలరోజుల క్రితం వరంగల్ నగరానికి వచ్చి కృష్ణాకాలనీలో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతుండగా, రాత్రి ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. ఆగ్రహానికి గురైన అనిల్.. భార్య రజిత చేతులు, కాళ్లు కట్టి కత్తితో మెడ కోసి హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

నేడు జాతీయ జెండా రూపకర్త 'పింగళి వెంకయ్య' జయంతి
India· 2 Aug 2026

నేడు జాతీయ జెండా రూపకర్త 'పింగళి వెంకయ్య' జయంతి

ఈరోజు ఇండియన్ ఫ్లాగ్‌ను డిజైన్ చేసిన పింగళి వెంకయ్య 150వ జయంతి. 1876 ఆగస్ట్ 2న కృష్ణా జిల్లా భట్లపెనుమర్రులో హనుమంత రాయుడు, వెంకటరత్నం దంపతులకు జన్మించారు. అయన ఒక వ్యవసాయ పరిశోధకుడు, విద్యావేత్త కూడా, మచిలీపట్నంలో ఒక విద్యాసంస్థను స్థాపించారు. దేశభక్తి, జాతీయ సమైక్యతకు ప్రతీకగా ఉన్న త్రివర్ణ పతాకం వెనుక ఆయన కృషి మరువలేనిది, తెలుగువారికీ గర్వకారణం. నేడు ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ ముఖ్యనేతలు, ప్రముఖులు స్మరించుకుంటున్నారు.

IPL ముంబయి టీమ్ లో హార్దిక్ పాండ్య ఉంటాడా?
Sports· 2 Aug 2026

IPL ముంబయి టీమ్ లో హార్దిక్ పాండ్య ఉంటాడా?

హార్దిక్ పాండ్య IPLలో ముంబయి ఇండియన్స్ నుంచి వేరే టీమ్‌కి వెళ్తాడని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కి వెళ్తాడని, శివమ్ దూబేని తీసుకుని పాండ్యను చెన్నైకి ఇచ్చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ దీనిపై ముంబయి టీమ్ ఒక క్లారిటీ ఇచ్చింది. "మేము ఇంకా ఈ సీజన్ ఎలా జరిగిందో రివ్యూ చేస్తున్నాం. ప్రస్తుతానికి ఏ ఆటగాడిని ట్రేడ్ చేసే ఆలోచన చేయలేదు. ఎవరితో చర్చలు కూడా జరపలేదు. మా రివ్యూ పూర్తయ్యాకే దీని గురించి ఆలోచిస్తాం అని వాళ్ళు అన్నారు.

దీప్కే తండ్రిపై ఇంక్వైరీ చేయాలి: RTI యాక్టివిస్ అమిత్ తివారీ
News· 2 Aug 2026

దీప్కే తండ్రిపై ఇంక్వైరీ చేయాలి: RTI యాక్టివిస్ అమిత్ తివారీ

CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే తండ్రిపై ఇంక్వైరీ చేయాలని RTI యాక్టివిస్ట్ అమిత్ తివారీ EC, ఇన్‌కమ్ ట్యాక్స్ అథారిటీస్‌కు లెటర్ రాశారు. రిటైర్డ్ ఉద్యోగి అయిన తన కొడుకు ఫారిన్ చదువులకు ఇంత డబ్బులు ఎక్కడిదని క్వశ్చన్ చేశారు. పోలీసు కేసులున్న CJP ప్రొటెస్టర్లకు సీనియర్ లాయర్, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ప్రకటించిన రూ.1 కోటిపై విచారణ జరపాలని కోరారు.

విషాదంగా మారిన  ఫ్రెండ్‌షిప్ డే సెలబ్రేషన్
Crime· 2 Aug 2026

విషాదంగా మారిన ఫ్రెండ్‌షిప్ డే సెలబ్రేషన్

AP: స్నేహితుల దినోత్సవం రోజున విశాఖపట్నం గాజువాక పాత గంగవరం బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఫ్రెండ్‌షిప్ డే వేడుకల కోసం వచ్చిన స్నేహితుల్లో నీతూ, రాము అనే యువతి, యువకుడు సముద్ర అలల్లో గల్లంతయ్యారు. ఫోటోలు తీస్తున్న సమయంలో నీతూ అలల్లో కొట్టుకుపోగా, ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన రాము కూడా గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న న్యూపోర్ట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. బీచ్‌ల వద్ద అలలు ఉధృతంగా ఉన్నందున సముద్ర తీరాలకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

భారీ మెజార్టీ ఇస్తేనే పోటీ.. లేదంటే నో: కోమటిరెడ్డి
Politics· 2 Aug 2026

భారీ మెజార్టీ ఇస్తేనే పోటీ.. లేదంటే నో: కోమటిరెడ్డి

TG: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు హామీ ఇస్తేనే తాను పోటీ చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ మండలం కంచనపల్లిలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అత్యధిక మెజార్టీ ఇవ్వలేకపోతే తాను ఎన్నికల బరిలో ఉండనని స్పష్టం చేశారు. తాను నియోజకవర్గానికి ప్రచారం కోసం రాకపోయినా, ఇప్పటివరకు చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని కోరారు.

స్వీట్ షాప్‌పై లీగల్ యాక్షన్
News· 2 Aug 2026

స్వీట్ షాప్‌పై లీగల్ యాక్షన్

TS: హైదరాబాద్‌లోని కిషన్‌బాగ్ ఎక్స్‌రోడ్‌ ట్వింకల్ స్టార్ స్వీట్ హౌస్‌లో ఫుడ్ సేఫ్టీ రెగ్యులేషన్స్ పాటించనట్లు గుర్తించారు. H-Fast పోలీస్ SI పి. కృష్ణయ్య, వారి టీమ్ అధికారులతో ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్షన్ నిర్వహించారు. ఇందులో స్వీట్స్ తయారు చేసేవారికి హెయిర్‌నెట్స్, గ్లౌజులు, ప్లేస్ క్లీన్‌గా లేకపోవడం వంటివి గుర్తించారు. పెస్ట్ కంట్రోల్స్ రికార్డ్స్, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్స్, FSSAI లైసెన్స్‌ను డిస్‌ప్లేలో లేకపోవడం గమనించారు. దీంతో లీగల్ యాక్షన్ కోసం ఈ కేసును ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్‌కు అప్పగించారు.

గోదావరి ఉధృతి.. లంక గ్రామాలు ఖాళీ
AP· 2 Aug 2026

గోదావరి ఉధృతి.. లంక గ్రామాలు ఖాళీ

AP: గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గురజాపులంక వద్ద పరిస్థితి ఆందోళనకరంగా మారింది. <a href="https://www.theclearcutnews.com/n/WGhyzXK">ధవళేశ్వరం</a> బ్యారేజీ నుంచి 16 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేయడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి ఉధృతికి ఇళ్లు, రోడ్లు తీవ్ర కోతకు గురవుతుండటంతో గురజాపులంకలోని ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. వరద ప్రభావంతో గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు.

కిరాణా షాపులో నాగుపాము
TG· 2 Aug 2026

కిరాణా షాపులో నాగుపాము

TG: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని తాండూరు–కోకట్ మధ్య ఉన్న ఓ కిరాణా షాపులోకి నాగుపాము చొరబడటంతో షాపు యజమాని భయాందోళనకు గురయ్యాడు. సమాచారం అందుకున్న మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ సాహసం చేసి నాగుపామును సురక్షితంగా పట్టి బయటకు తీశారు. దీంతో షాపు యజమానితో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా పాములు, ఇతర విష పురుగులు ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులు సూచించారు.

దేవాలయంలో రీల్స్.. వివాదంగా మారిన వీడియో
Crime· 2 Aug 2026

దేవాలయంలో రీల్స్.. వివాదంగా మారిన వీడియో

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఓ యువతి రీల్స్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఆలయ గోపురం ఎదుట పాటకు డ్యాన్స్ చేస్తూ వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. ఈ ఘటనపై భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో మొబైల్ ఫోన్లు, కెమెరాలు ఎలా అనుమతించారని, సెక్యూరిటీ సిబ్బంది ఏమి చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. రీల్స్ చిత్రీకరణకు కొంత సమయం పట్టిన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై ఆలయ అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది ఆరా తీస్తున్నారు.

GMRను ఎందుకు మాట్లాడించలేదు: గుడివాడ
Politics· 2 Aug 2026

GMRను ఎందుకు మాట్లాడించలేదు: గుడివాడ

AP: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కావడం సంతోషకరమని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. అయితే, విమానాశ్రయం నిర్మాణానికి అసలు క్రెడిట్ YS జగన్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. YSRCP హయాంలో భూసేకరణ పూర్తి చేసి, న్యాయ వివాదాలు పరిష్కరించి, నిర్మాణ పనులు వేగవంతం చేశామని చెప్పారు. కార్యక్రమంలో GMR సంస్థ ప్రతినిధులకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. GMR మాట్లాడితే విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించిన వాస్తవాలు ప్రజలకు తెలిసేవని అన్నారు.

ఫ్రెండ్స్‌తో విహారం.. అంతలోనే విషాదం
Crime· 2 Aug 2026

ఫ్రెండ్స్‌తో విహారం.. అంతలోనే విషాదం

AP: అస్సాంలోని గువాహటిలో చదువుతున్న కడప జిల్లా జమ్మలమడుగు తహసీల్దార్ కాచన సాయినాథ్ రెడ్డి ఏకైక కుమార్తె, IIT ద్వితీయ సంవత్సరం విద్యార్థిని చేతన(20) బ్రహ్మపుత్ర నదిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందింది. స్నేహితులతో కలిసి నది వద్దకు వెళ్లి జారిపడ్డట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం అధికారులు మృతదేహాన్ని గుర్తించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ కుటుంబసభ్యులతో కలిసి వెంటనే అస్సాంకు బయలుదేరారు. చేతన స్వగ్రామం కడప జిల్లా పెద్దముడియం మండలం ఎన్.కొట్టాలపల్లి గ్రామం.