Latest

జాబ్ రావడంతో మారిన భర్త.. భార్యకు చిత్రహింసలు
Crime· 20 Jul 2026

జాబ్ రావడంతో మారిన భర్త.. భార్యకు చిత్రహింసలు

TG: ఖమ్మం జిల్లా శంభునిగూడెంకు చెందిన సుమ(25)కు లక్ష్మీదేవిపల్లి మండలానికి చెందిన వజ్జా వెంకటేశ్వర్లుతో మ్యారేజ్ అయింది. వివాహం అనంతరం కొద్దిరోజులపాటు హైదరాబాద్‌లో ఉన్నారు. భర్తకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది. భార్యను అనుమానించడం, వరకట్నం తీసుకురావాలని వేధించి ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. భర్త, ఆడపడుచుల వేధింపులు తాళలేక ఆమె గడ్డిమందు తాగింది. కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు వెంకటేశ్వర్లు, ఆడబిడ్డలు విజయ, రజిత, సుజాతలపై కేసు నమోదు చేశారు.

బ్యారికేడ్లు ఎక్కి నిరసనలు కొనసాగించిన AAP నేతలు
News· 20 Jul 2026

బ్యారికేడ్లు ఎక్కి నిరసనలు కొనసాగించిన AAP నేతలు

కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన 'ఛలో సంసద్' ర్యాలీకి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మద్దతిచ్చారు. AAP నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, అతిషి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను ఎక్కి ఆందోళనకారులను కలిశారు. నీట్ 2026 ప్రశ్నాపత్రం లీక్‌కు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సిసోడియా డిమాండ్ చేశారు. యువత పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని నిరసనలు చేస్తున్నారని అన్నారు.

సీజేపీ నిరసనకారులకు మద్దతుగా వాలంటీర్స్
News· 20 Jul 2026

సీజేపీ నిరసనకారులకు మద్దతుగా వాలంటీర్స్

దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యావ్యవస్థలో పేపర్ లీకేజీలపై జరుగుతున్న నిరసనల్లో వేలాది మంది నిరసనకారులు పాల్గొన్నారు. ఉక్కపోతను తట్టుకునేందుకు సీజేపీ వాలంటీర్స్ నిరసనకారులకు విసనకర్రలతో గాలి ఊపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మద్దతుదారులకు వైద్య సేవలు, తాగునీరు అందిస్తూ వాలంటీర్లు మద్దతుగా నిలుస్తున్నారు.

భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య
Crime· 20 Jul 2026

భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య

TG: భార్య వేధింపులు తట్టుకోలేక పెళ్లయిన మూడు నెలలకే భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రాంక్యాతండాకు చెందిన సదర్ లాల్(27) తండ్రితో కలిసి మేకల వ్యాపారం చేస్తున్నాడు. మేలో హర్యాతండాకు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. మగతనం లేదని అతని భార్య వేధిస్తోంది. ఇటీవల అత్తగారింటికి వెళ్లగా కుటుంబ సభ్యులతో కలిసి సదర్ లాల్‌ను అవమానించింది. తీవ్ర మనస్తాపంతో కలుపు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

CJPతో కేంద్ర ప్రభుత్వం చర్చలు
India· 20 Jul 2026

CJPతో కేంద్ర ప్రభుత్వం చర్చలు

సీజేపీ తరఫున అషుతోష్ రాన్కా, తను కలిసి కేంద్ర మంత్రి జే.పీ.నడ్డాను కలిసేందుకు వెళ్లినట్టు సామాజిక కార్యకర్త సౌరవ్ దాస్ తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు ప్రభుత్వం దిగివచ్చిందని, త్వరలో తమకు విజయం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. ఒకవైపు పార్లమెంట్ ఎదుట సీజేపీ ఆందోళన ఉధృతంగా సాగుతున్న టైంలో కేంద్రం నుంచి ఆహ్వానం రావడంపై ఉత్కంఠ నెలకొంది.

బాలికను అడ్డగించిన కానిస్టేబుల్ అరెస్ట్
Crime· 20 Jul 2026

బాలికను అడ్డగించిన కానిస్టేబుల్ అరెస్ట్

TG: నల్గొండ టౌన్‌లో బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో ఓ పోలీస్ కానిస్టేబుల్‌పై పోక్సో కేసు నమోదైంది. గుర్రంపోడ్ PSలో విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ అనే కానిస్టేబుల్, సైకిల్‌పై వెళ్తున్న బాలికను అడ్డగించి, అనుచితంగా తాకినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇంటికి వెళ్లిన బాలిక విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. CCTV ఫుటేజ్ ఆధారంగా నిందితుడు మాస్క్ ధరించి తిరిగినట్లు గుర్తించారు. ఆరోపణలు విచారణలో నిజం కావడంతో ఆయనను అరెస్టు చేశారు. అతడిపై గతంలో కూడా పోక్సో కేసులు నమోదైనట్లు సమాచారం.

జంతర్ మంతర్ వద్ద రాళ్ళతో ఆగి వున్న ట్రక్
Politics· 20 Jul 2026

జంతర్ మంతర్ వద్ద రాళ్ళతో ఆగి వున్న ట్రక్

దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద CJP పిలుపునిచ్చిన ‘చలో సంసద్’ మార్చ్ వద్ద రాళ్లతో పార్క్ చేసిన ఒక ట్రక్కును స్థానికులు గుర్తించారు. పార్లమెంట్ నిరసనకు ఎలాంటి అనుమతి లేకపోవడంతో తమ శాంతియుత నిరసనను భగ్నం చేయడానికి చూస్తున్నారని CJP ఆరోపించింది

బాలుడి ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే!
News· 20 Jul 2026

బాలుడి ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే!

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం లఖీంపూర్ ఖేరీలో 'సంపూర్ణ సమాధాన్ దివస్' కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మేజిస్ట్రేట్, జిల్లా పోలీసులు, ఉన్నదాధికారులు పాల్గొన్నారు. ఇంతలో అక్కడికి 13ఏళ్ల బాలుడు అమితాబ్ గుప్తా వచ్చి తన ఇంటిని బంధువులు ఆక్రమించారని నేరుగా కలెక్టర్‌కు ఫిర్యాదిచ్చాడు. "కమీషన్ ఇస్తేనే పని అవుతుందా?" అంటూ పోలీసును ప్రశ్నించాడు. ఆ బాలుడి ధైర్యాన్ని చుసిన అక్కడివారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రవితేజ ‘ఇరుముడి’ టైటిల్ సాంగ్ వైరల్
Cinema· 20 Jul 2026

రవితేజ ‘ఇరుముడి’ టైటిల్ సాంగ్ వైరల్

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రం నుంచి విడుదలైన ‘ఇరుముడి కట్టు’ టైటిల్ సాంగ్‌కు ఆడియెన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. జి.వి.ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు. తాజాగా రవితేజ అయ్యప్ప మాలలో ఉంటూ తన సినిమాలోని ఈ పాటను చూస్తూ మురిసిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రియుడి ఫ్రెండ్స్  ప్రెజర్‌తో యువతి ఆత్మహత్య
AP· 20 Jul 2026

ప్రియుడి ఫ్రెండ్స్ ప్రెజర్‌తో యువతి ఆత్మహత్య

AP: కాకినాడ జిల్లా తుని పట్టణానికి చెందిన రజిని, రాజేంద్ర నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల రజినికి కుటుంబసభ్యులు పెళ్లి నిశ్చయించారు. దీంతో మనస్తాపానికి గురైన రాజేంద్ర ఆత్మహత్యాయత్నం చేశాడు. అతని స్నేహితులు రజినిపై పెళ్లి రద్దు చేసి రాజేంద్రను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశారు. ఇంటి వారిని బాధపెట్టలేక, ప్రియుడిని వదులుకోలేక రజిని తీవ్ర మనస్థాపానికి గురై సూసైడ్ చేసుకుంది. సూసైడ్ నోట్‌లో “చనిపోవాలని లేదు.. ఏం చేయాలో తెలియడం లేదు” అని రాసింది. యువతి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

రైలు నుంచి దొంగను తోసేసిన ప్రయాణికుడు
Crime· 20 Jul 2026

రైలు నుంచి దొంగను తోసేసిన ప్రయాణికుడు

రాయ్‌పూర్ జిల్లా మాంధర్-ఉర్కురా మధ్య ఆజాద్ హింద్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ దొంగ ప్రయాణికుడి పర్సు కొట్టేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కోచ్ అటెండెంట్లు అతడిని పట్టుకునే క్రమంలో దొంగ రైలు తలుపు మెట్లు పట్టుకుని వేలాడాడు. ఆ టైంలో రూర్కెలాకు చెందిన ప్రయాణికుడు కె.ఆర్.సురేష్ కుమార్ అతన్ని కాలితో తన్నడంతో ఆ యువకుడు కింద పడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో GRP పోలీసులు సురేష్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరైన ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. పడిపోయిన దొంగ కోసం పోలీసులు వెతుకుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్ల నిరసన
News· 20 Jul 2026

రాష్ట్రవ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్ల నిరసన

AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన వివాదాస్పద జీవో 369ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డాక్యుమెంట్ రైటర్స్ పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంఘ పెనుమాక సుబ్బారావు పిలుపు మేరకు సమ్మెకు సిద్ధమయ్యారు. ఈరోజు నుంచి జులై 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక పెన్‌డౌన్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ అకస్మాత్తు నిర్ణయాలతో తమ వృత్తికి భవిష్యత్తులో ఆటంకం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

వాష్‌రూమ్ గ్రిల్స్ పగులగొట్టి.. లాకర్ ఖాళీ చేసి
Crime· 20 Jul 2026

వాష్‌రూమ్ గ్రిల్స్ పగులగొట్టి.. లాకర్ ఖాళీ చేసి

TG: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని గురుకృప ఎక్స్‌పోర్ట్స్ ఆఫీస్‌లో జరిగిన భారీ దోపిడీ కలకలం రేపింది. రాత్రి దుండగులు వాష్‌రూమ్ గ్రిల్స్ పగులగొట్టి లోపలికి ప్రవేశించి, లాకర్‌లో భద్రపరిచిన కిలోకు పైగా బంగారు ఆభరణాలను అపహరించారు. సూరత్‌కు చెందిన ఓ జ్యువెలరీ వ్యాపారి బంజారాహిల్స్‌లోని ఈ ఎక్స్‌పోర్టు కార్యాలయ నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నారు. డైమండ్ ఫిక్సింగ్ కోసం సిద్ధంగా ఉంచిన 7 నెక్లెస్‌లు, 7జతల విలువైన చెవిపోగులను దొంగిలించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సితార ఘట్టమనేని 14వ పుట్టినరోజు
Cinema· 20 Jul 2026

సితార ఘట్టమనేని 14వ పుట్టినరోజు

కూతురు సితార ఘట్టమనేని 14వ పుట్టినరోజు సందర్భంగా సూపర్‌స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సితారను ముద్దాడుతున్న క్యూట్ ఫోటోను షేర్ చేస్తూ ‘నువ్వు ఎంత పెద్దదానివైనా ఎప్పటికీ నా చిన్న నక్షత్రానివే. హ్యాపీ 14 సితార. వచ్చే ఏడాదంతా నీకు అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నాను. లవ్ యు ఆల్వేస్’ అని రాశారు. అభిమానులు, సినీ ప్రముఖులు సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు.

రౌడీషీటర్ దాడిలో ఇంటర్ విద్యార్థి హతం
Crime· 20 Jul 2026

రౌడీషీటర్ దాడిలో ఇంటర్ విద్యార్థి హతం

TG: హైదరాబాద్ నగరం కాలాపత్తర్‌ పరిధిలో ఓ ఇంటర్ విద్యార్థి దారుణహత్యకు గురయ్యాడు. శాలిబండలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ఫైజాన్(18) ఆదివారం తెల్లవారుజామున మిత్రులతో కలిసి బిర్యానీషాటెక్రీ కొండ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడకు వచ్చిన బాలాపూర్ రౌడీషీటర్ అబ్రార్‌, అతని స్నేహితులను తమ బస్తీకి ఎందుకు వచ్చారని ఫైజాన్ అడిగాడు. కోపానికి గురైన గ్యాంగ్ కత్తులతో ఫైజాన్ తల, కడుపులో దారుణంగా పొడిచారు. తీవ్ర గాయాలైన ఫైజాన్ ప్రాణాలు కోల్పోయాడు. పాత కక్షలతోనే ఈ దాడి జరిగిందని కుటుంబసభ్యులు ఆరోపించగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డిపై సస్పెన్షన్ వేటు
TG· 20 Jul 2026

ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డిపై సస్పెన్షన్ వేటు

TG: హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీ ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డిపై కీలక చర్యలు తీసుకుంది. మహిళా ట్రైనీ ఐపీఎస్ చేసిన ఫిర్యాదు, CCTV ఆధారాలు, ఇతర సాక్ష్యాలను పరిశీలించిన ప్రివిలేజ్ కమిటీ ఆరోపణలు నిజమని నిర్ధారించింది. దీంతో ఆయనను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ NPA నుంచి పంపించేశారు. ఈ నిర్ణయం ప్రివిలేజ్ కమిటీ సిఫార్సుల మేరకు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సర్వీస్‌లో తిరిగి జాయినింగ్‌కు సంబంధించిన తుది నిర్ణయం DOPT తీసుకుంటుందని పోలీస్ అకాడమీ అధికారులు వెల్లడించారు.

ఉద్యోగం రాలేదని గోల్డ్ మెడల్ విద్యార్థి ఆత్మహత్య
Crime· 20 Jul 2026

ఉద్యోగం రాలేదని గోల్డ్ మెడల్ విద్యార్థి ఆత్మహత్య

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం కాన్పూర్‌లో బీటెక్(ఎలక్ట్రికల్)లో గోల్డ్ మెడల్ సాధించి, రాష్ట్రంలో మూడో ర్యాంక్ సాధించిన ఆనంద్(23) ఆత్మహత్య చేసుకున్నాడు. పవర్‌గ్రిడ్‌లో అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసి, ప్రభుత్వ ఉద్యోగం కోసం రైల్వేస్, బ్యాంకులు, SSC రిక్రూట్‌మెంట్ పరీక్షలు రాశాడు. అయినా ఉద్యోగం రాలేదు. దీంతో మనస్తాపం చెందాడు. "సారీ నాన్నా..ప్రభుత్వ ఉద్యోగం కోసం 50 సార్లు ప్రయత్నించినా సాధించలేకపోయాను. నన్ను క్షమించండి" అని సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరేసుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం
TG· 20 Jul 2026

ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం

TG: హైదరాబాద్‌లోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనీ IPSపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ప్రస్తుతం అతడు SR నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తోటి మహిళా ట్రైనీపై అతడు అసభ్యకరమైన మెసెజెస్ పంపడం, బెదిరింపులకు పాల్పడడం, వ్యక్తిగత వీడియోలను రికార్డు చేసి బ్లాక్‌మెయిల్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు BNS పలు సెక్షన్లు, ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వంపై సీనియర్ నటుడు నరేష్ కీలక వ్యాఖ్యలు
India· 20 Jul 2026

కేంద్ర ప్రభుత్వంపై సీనియర్ నటుడు నరేష్ కీలక వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ వాహనదారులకు గుండెపోటు తెప్పిస్తోందని నటుడు నరేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సానుభూతిపరుడైన తన మిత్రుడు కొత్తగా కొనుగోలు చేసిన టయోటా క్యామ్రీకి ఇథనాల్ పెట్రోల్ వాడటంతో ఇంజిన్ వాల్వ్స్ దెబ్బతిన్నాయన్నారు. అందుకే తనూ లీటరుకు రూ.165 ఖర్చుతో హై ఆక్టేన్ 100 పెట్రోల్‌కు మారాల్సి వచ్చిందని చెప్పారు. సాధారణ వాహనదారుల పరిస్థితి ఏంటని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.

అంబటి రాంబాబుపై పరువు నష్టం దావా వేస్తా: గళ్లా మాధవి
AP· 20 Jul 2026

అంబటి రాంబాబుపై పరువు నష్టం దావా వేస్తా: గళ్లా మాధవి

AP: మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని టీడీపీ నేత, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి డిమాండ్ చేశారు. ప్రూఫ్స్ చూపకపోతే ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. గుంటూరు జిల్లాలో మాధవి పర్యటించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ గుంటూరులో మహిళపై జరిగిన ఘటనను రాజకీయాల కోసం వాడుకోవడం దుర్మార్గమన్నారు. ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

సీజేపీ నిరసన.. AAP లీడర్ రాయ్ పిలుపు
Politics· 20 Jul 2026

సీజేపీ నిరసన.. AAP లీడర్ రాయ్ పిలుపు

దిల్లీలో సీజేపీ ర్యాలీ ముందు AAP లీడర్ గోపాల్ రాయ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విద్యార్థి, యువజన సంఘాలు జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నాయన్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ వల్ల దేశంలోని కోట్లాది మంది విద్యార్థులు, యువత భవిష్యత్తు అంధకారంలో పడుతోందని, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయాలని పిలుపునిచ్చారు. సోనమ్ వాంగ్చుక్‌ హంగర్ స్ట్రైక్‌ను ప్రభుత్వం బలవంతంగా నిలిపేసిందని ఆరోపించారు.