Latest
వర్షం గుంతలో ఇద్దరు చిన్నారులు.. అసలు ఏమైంది?
గుజరాత్‌లోని సూరత్‌లో భారీ వర్షాల వల్ల ఒక సాడ్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఓపెన్ ఏరియాలో వర్షం నీళ్లు భారీగా నిలిచిపోగా.. అక్కడ ఆడుకుంటూ వెళ్లిన ఇద్దరు ఎనిమిదేళ్ల పిల్లలు ఆ గుంతలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వాళ్ల కోసం నీటిలో గాలిస్తున్నారు. ఈ ఇన్సిడెంట్‌తో స్థానికులు షాక్‌లో ఉన్నారు. అడ్మినిస్ట్రేషన్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ జనాలు ఫుల్ సీరియస్ అవుతున్నారు.
PM మోదీ నియోజకవర్గంలో దారుణం?
PM నరేంద్ర మోదీ నియోజకవర్గమైన వారణాసి రైల్వే స్టేషన్ దారుణమైన పరిస్థితిపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. "వరల్డ్ క్లాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్" అంటూ ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారాల్లో నిజం ఎంత ఉందో ఈ స్టేషన్ దుస్థితే చెబుతోందని నెటిజన్లు నిలదీస్తున్నారు. డెవలప్‌మెంట్ పేరుతో ఖర్చు చేసిన వేల కోట్ల రూపాయలు అసలు ఎక్కడికి పోయాయని, అవినీతి వల్లే పనులు ఇలా ఉన్నాయా అని సోషల్ మీడియాలో పబ్లిక్ ప్రశ్నిస్తున్నారు.

CM విజయ్ సడన్ సర్ప్రైజ్ విజిట్!
తమిళనాడు CM విజయ్ ఎగ్మోర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్‌లో సడన్‌గా సర్ప్రైజ్ ఇన్‌స్పెక్షన్ చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా హాస్పిటల్‌కు వెళ్లిన CM, అక్కడ పేషెంట్లకు అందుతున్న సర్వీసెస్ క్వాలిటీని, మెడికల్ ఫెసిలిటీస్‌ను స్వయంగా పరిశీలించారు. పేషెంట్లతో మాట్లాడి వాళ్లకు ట్రీట్‌మెంట్ కరెక్ట్‌గా అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు.

ఒక్క రూపాయి కట్నం తీసుకుని పెళ్లి చేసుకున్న కొడుకు!
రాజస్థాన్‌లో ఒక ఫ్యామిలీ అందరికీ ఆదర్శంగా నిలిచింది. అర్జున్‌రామ్ అనే వ్యక్తి తన కొడుకు సుభాష్ పెళ్లిని సరోజ్ అనే అమ్మాయితో ఫిక్స్ చేశాడు. అయితే ఈ పెళ్లిలో ఎలాంటి కట్నం తీసుకోకూడదని ముందే డెసిషన్ తీసుకున్నారు. అనుకున్నట్లే పెళ్లి టైమ్‌లో పెళ్ళికొడుకు కేవలం ఒక్క రూపాయి, కొబ్బరికాయ మాత్రమే తీసుకుని పెళ్లి చేసుకున్నాడు. కట్నం తీసుకోకూడదనే తన తండ్రి డెసిషన్‌పై కొడుకు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు.

హార్ముజ్ దగ్గర హై టెన్షన్.. చిక్కుకుపోయిన 9 భారత నౌకలు!
అమెరికా, ఇరాన్ గొడవల వల్ల హార్ముజ్ దగ్గర సిట్యుయేషన్ చాలా సీరియస్‌గా మారింది. ఒమన్ కారిడార్ గుండా వెళ్తున్న ఒక భారత ఆయిల్ ట్యాంకర్‌ను ఇరాన్ ఆర్మీ వెనక్కి పంపించేసింది. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్‌లో 9 భారత నౌకలు చిక్కుకుపోగా, వాటిలో 198 మంది ఇండియన్స్ ఉన్నారు. ఆ నౌకల్లో ఫుల్లుగా ఇంధనం, గ్యాస్ లోడ్ అయి ఉంది. ఈ మ్యాటర్‌ని క్లోజ్‌గా గమనిస్తున్న భారత ప్రభుత్వం.. మన నౌకలను సేఫ్‌గా బయటకు తీసుకురావడానికి ఇరాన్‌తో మాట్లాడే ఛాన్స్ ఉంది.

గవర్నమెంట్ జాబ్ కోసం కన్నతల్లినే చంపేసిన కూతురు!
రాజస్థాన్ జైపూర్‌లోని ప్రతాప్‌నగర్‌లో దారుణం జరిగింది. తండ్రి చనిపోయాక వచ్చిన గవర్నమెంట్ జాబ్ (LDC), ఆస్తి మొత్తం తనకే కావాలని ఆయుషి అనే యువతి కన్నతల్లి నీరజ్ శర్మ (45)ను చంపడానికి ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా ఈ నెల 23న తల్లిని కార్‌తో గుద్దించి, అది రోడ్ యాక్సిడెంట్‌గా నమ్మించాలని చూసింది. కానీ, ప్రమాదంపై అనుమానం వచ్చి నీరజ్ శర్మ తమ్ముడు రాకేష్ పోలీసులకి కంప్లైంట్ చేశాడు. ఇన్వెస్టిగేషన్‌లో కూతురు తన చుట్టాలు ఆరుగురితో కలిసి ఈ మర్డర్ ప్లాన్ చేసినట్లు తేలింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

తిరుమల భక్తులకు బిగ్ షాక్.. ఆ రోజుల్లో దర్శనాలు రద్దు!
తిరుమల వెళ్లే భక్తులకు ఇంపార్టెంట్ నోట్. జులై నుంచి సెప్టెంబర్ మధ్య (జులై 14,17,19,29, ఆగస్టు 22, 24, సెప్టెంబర్ 8, 14, 15) ఉన్న ఈ డేట్స్‌లో VIP దర్శనాలను TTD రద్దు చేసింది. ఆలయంలో జరిగే పండుగలు, ఉత్సవాల వల్లే ఈ డెసిషన్ తీసుకున్నారు. ఈ డేట్స్‌కి ముందురోజు తిరుమలలో ప్రొటోకాల్ VIPలకి తప్ప, నార్మల్ రికమండేషన్ లెటర్స్ ఏవీ తీసుకోరని TTD చెప్పింది. సో, మీ ట్రిప్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ డేట్స్ చెక్ చేసుకోండి.

యూట్యూబ్ చూసి ఇంట్లోనే వైన్ తయారీ!
మల్కాజ్‌గిరిలో యూట్యూబ్ చూసి ఇంట్లోనే వైన్ తయారు చేస్తూ, ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతున్న ఒక వృద్ధుడిని DTF అధికారులు అరెస్ట్ చేశారు. ఎలాంటి పర్మిషన్లు లేకుండా అక్రమంగా వైన్ విక్రయాలు జరుపుతున్నట్లు అధికారులకు పక్కా సమాచారం అందింది. దాంతో అలర్ట్ అయిన అధికారులు సడన్‌గా దాడి చేసి, వైన్ బాటిల్స్‌ను సీజ్ చేసి అతని గుట్టురట్టు చేశారు. నిబంధనలు మీరితే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.

భార్య ముందే గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి భర్త సూసైడ్ అటెంప్ట్!
శ్రీకాకుళం చప్పర గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ శిరీష్ కుమార్‌కి(34) భార్య సులోచన, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా అతను ఊరిలోనే ఉండే మరో మహిళతో రిలేషన్ పెట్టుకుని కోయంబత్తూర్ పారిపోయాడు. విషయం తెలిసి భార్య చుట్టాల సాయంతో వాళ్ళిద్దరినీ శబరి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో హైదరాబాద్ తీసుకొస్తుండగా.. చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరకు రాగానే, శిరీష్ అతని గర్ల్‌ఫ్రెండ్ బాత్‌రూమ్‌లో పురుగుల మందు తాగి స్పృహ తప్పడంతో రైల్వే సిబ్బంది గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం వారి కండిషన్ సీరియస్‌గా ఉన్నట్లు డాక్టర్స్ తెలిపారు.
ప్రిన్సిపాల్‌పై దాడి చేసిన స్టూడెంట్!
నిర్మల్ జిల్లా భైంసాలోని గోపాలరావు పాటిల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఒక షాకింగ్ ఘటన జరిగింది. కాలేజీలో సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతుండగా, ఒక స్టూడెంట్ ఓపెన్‌గా చీటింగ్ చేస్తూ దొరికిపోయాడు. అది గమనించిన కాలేజీ ప్రిన్సిపాల్ వెంటనే అక్కడికి వచ్చి, ఆ స్టూడెంట్‌ని పట్టుకుని ఎగ్జామ్ రాయకుండా అడ్డుకున్నారు. దీంతో తీవ్ర కోపానికి గురైన ఆ స్టూడెంట్ అందరి ముందే ప్రిన్సిపాల్‌పై ఒక్కసారిగా దాడికి దిగాడు. ఈ ఇన్సిడెంట్‌పై ప్రిన్సిపాల్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు ఆ స్టూడెంట్‌పై కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.

SC హాస్టల్‌లో స్టూడెంట్ సూసైడ్!
కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్‌లో ఒక స్టూడెంట్ సూసైడ్ చేసుకుంది. లక్ష్మాపూర్ విలేజ్ కి చెందిన అమృత అనే అమ్మాయి, ఇంటర్మీడియట్ BiPC ఫస్ట్ ఇయర్ చదువుతూ ఈ హాస్టల్‌లోనే ఉంటోంది. ఈరోజు మార్నింగ్ తనకు ఫీవర్ గా ఉందని చెప్పి కాలేజీకి వెళ్లకుండా హాస్టల్ రూమ్‌లోనే ఉండిపోయింది. ఆ తర్వాత రూమ్‌లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయింది. ఈ విషయం తెలిసి అమృత ఫ్యామిలీ మెంబర్స్ హాస్టల్ ముందు ఆందోళనకు దిగారు, దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

అధికారుల ఒత్తిడితో ఆత్మహత్యాయత్నం
TG: గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం శాసనూలు గ్రామంలో అంగన్వాడీ టీచర్ షాహిదాబేగం BLOగా విధులు నిర్వహిస్తున్నారు. 'SIR', ఆన్‌లైన్ అప్డెట్స్, ఫారాల పరిశీలన, ఇంటింటి సర్వేలు, డేటా నమోదు వంటి పనులు వెంటనే పూర్తి చేయాలని ఉన్నతాధికారులు తీవ్ర ఒత్తిడి పెట్టారు. దీంతో పెబ్బేరులోని ఆమె ఇంట్లో పురుగులమందు తాగింది. కుటుంబసభ్యులు ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల బరువు, ఎత్తు, గుడ్లు, తదితర వాటి వివరాలు యాప్‌లో సమాచారం నమోదు చేయడంతోపాటు ఎన్నికల విధులు నిర్వహించడం కష్టంగా మారిందని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రియురాలి పెళ్లి.. పోస్టర్లతో షాక్ ఇచ్చిన ప్రేమికుడు
TG: రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో ప్రేమ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ యువకుడు, ఓ యువతి గత ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. యువతి కుటుంబసభ్యులు ఆమెకు తంగళ్లపల్లికి చెందిన మరో యువకుడితో వివాహం నిశ్చయించారని, తమ ప్రేమను అంగీకరించకుండా బలవంతంగా ఈ పెళ్లి చేస్తున్నారని ప్రియుడు ఆరోపించాడు. అర్ధరాత్రి కారులో తంగళ్లపల్లికి చేరుకున్న యువకుడు, తాను యువతితో దిగిన ఫొటోతో పాటు పెళ్లి చేసుకోబోతున్న వరుడి ఫొటోను కలిపి ముద్రించిన వాల్ పోస్టర్లను గ్రామంలోని ప్రధాన కూడళ్లు, గోడలపై అతికించాడు.
నిరంజన్ పేరెంట్స్‌కి సోనూసూద్ ఫోన్ కాల్!
పవన్ కల్యాణ్ వీరాభిమాని, హనుమకొండకు చెందిన పొనుగంటి నిరంజన్ (17) చనిపోయాడు. కొంతకాలంగా జెనెటిక్ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్న నిరంజన్ హెల్త్ కండిషన్ సీరియస్ అవ్వడంతో పేరెంట్స్ హైదరాబాద్ తీసుకొచ్చారు. హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ మంగళవారం రాత్రి అతను కన్నుమూశాడు. ఈ విషయం తెలిసి యాక్టర్ సోనూసూద్ నిరంజన్ పేరెంట్స్‌కి వీడియో కాల్ చేసి మాట్లాడి తన సానుభూతి తెలిపారు.

రెండేళ్ల నుంచి అక్కడ ఆఫీసే స్కూల్
TG: నారాయణపేట జిల్లా కృష్ణ మండల కేంద్రంలోని కన్నడ మీడియం ప్రాథమిక పాఠశాల భవనం రెండేళ్ల క్రితం పూర్తిగా కూలిపోయింది. దీంతో పాఠశాలను ఎత్తేయకుండా తాత్కాలికంగా స్థానిక MPDO ఆఫీసులోకి మార్చారు. కార్యాలయంలో ఉన్న నాలుగు గదుల్లో చెరి రెండు గదులను కేటాయించి 45మంది విద్యార్థులతో తరగతులు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి రూ.60 లక్షల నిధులు మంజూరై ఏడాది గడుస్తున్నా, అధికారుల నిర్లక్ష్యంతో నేటికీ కొత్త భవన నిర్మాణ పనులు ప్రారంభించలేదు. నిధులు ఉండి కూడా అధికారుల నిర్లక్ష్యం వల్లే పనులు ప్రారంభం కావడంలేదని స్థానికులు ఫైరవుతున్నారు.
సమోసాల కోసం ట్రైన్ ఆపేశాడు!
సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సమోసాల కోసం ఒక లోకో పైలట్ ఏకంగా ట్రైన్‌నే ఆపేశాడు. రైలు ఆపి, పక్కనే ఉన్న షాప్‌కి వెళ్లి సమోసాలు కొనుక్కుని మళ్లీ ఎక్కి వెళ్లిపోయాడు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో ప్యాసింజర్స్ సేఫ్టీ గురించి కేర్ తీసుకోకుండా ఇలా కేర్‌లెస్‌గా ఉండటంపై నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. ఈ మ్యాటర్ రైల్వే అధికారుల దృష్టికి వెళ్లడంతో లోకో పైలట్‌పై విచారణకు ఆర్డర్ ఇచ్చినట్లు ఆఫీసర్ ముఖేష్ చెప్పారు.

వెజ్ లవర్స్‌కి గుడ్‌న్యూస్!
ప్రొటీన్ అంటే చికెన్, మటన్ మాత్రమే కాదు, వెజ్ లోనూ బోలెడు ఆప్షన్స్ ఉన్నాయి. బాడీ బిల్డింగ్‌కి, ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి ప్రొటీన్ చాలా ముఖ్యం. దీనికోసం డైలీ డైట్‌లో పనీర్, మీల్ మేకర్, పప్పులు, శనగలు, బీన్స్, మొలకెత్తిన గింజలు చేర్చుకుంటే చాలు. వీటిలో ప్రొటీన్‌తో పాటు ఫైబర్, కాల్షియం కూడా లభిస్తాయి. జిమ్‌కి వెళ్లేవారికి, బరువు తగ్గాలనుకునేవారికి ఇవి బెస్ట్ ఛాయిస్. హెల్తీగా, ఫిట్‌గా ఉండటానికి వీటిని అస్సలు మిస్ చేయకండి.

బరుయిపూర్ అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు ఎన్‌కౌంటర్‌లో హతం
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బరుయిపూర్ అత్యాచారం హత్య కేసు తీవ్ర సంచలనం రేపింది. ఈ దారుణమైన నేరానికి ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాస్ మండల్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. పోలీసులు నిర్వహించిన ఎన్‌కౌంటర్‌లో అతడు మృతి చెందాడు.

బతకాలి అన్న ఆశే నన్ను కాపాడింది
AP: సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఉదంతం తీవ్ర విషాదాన్ని నింపింది. తప్పిపోయిన ఆరుగురు జాలర్ల ఆచూకీ ఇంకా దొరకలేదు. కారె చిన్న ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఆయన విశాఖపట్నంలోని కిమ్స్ ఐకాన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆరోజు భారీ అల మా బోటును ఒక్కసారిగా తాకడంతో బోటు తిరగబడింది. సముద్రంలో చుట్టూ చీకటి, ప్రకృతి వాయుగుండంగా మారడంతో భయమేసిందన్నారు. అయిన వాళ్లు ఒక్కొక్కరుగా కళ్లముందే దూరమైపోతున్నా, బతకాలి అన్న ఆశతో శక్తినంతా పోగుచేసుకుని 9గంటలు ఈదగా ఓ నౌక సిబ్బంది తనను కాపాడారని తెలిపాడు.

టోల్‌ప్లాజా వద్ద టాస్క్‌ఫోర్స్ దాడి
సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండల పరిధిలోని 161 జాతీయ రహదారిపై తాడ్‌ధాన్‌పల్లి టోల్‌ప్లాజా వద్ద టాస్క్‌ఫోర్స్ దాడి చేసింది. గుజరాత్‌కు అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనలో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

జైలుకు వెళ్లొచ్చినా తీరు మారలేదు
TG: నల్గొండ జిల్లా నకిరేకల్ టౌన్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. శివాజీనగర్‌లోని ఓ ఇంట్లో ఈ అక్రమ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అందిన పక్కా సమాచారంతో నకిరేకల్ పోలీసులు దాడి చేశారు. నిందితులు బట్కా యాదగిరి, టేకుమట్ల జానయ్యలను అరెస్ట్ చేశారు. కేసారం, కట్టంగూరు ప్రాంతాలకు చెందిన కొందరు RMPల సహకారంతో ఈ ముఠా దందా సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలోనూ నిందితులు ఇద్దరూ చివ్వెంల మండలంలో జరిగిన ఓ గర్భిణి మరణం కేసులో జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలిపారు.