Latest

యాప్‌లోనూ కనిపించని యూరియా.. రైతుల ఆందోళన
నర్సంపేట డివిజన్‌లో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పది రోజులుగా యూరియా కోసం దుకాణాల చుట్టూ తిరుగుతున్నా సరిపడా నిల్వలు అందుబాటులో లేవని అంటున్నారు. మరోవైపు యాప్‌లో యూరియా బస్తాలను బుక్ చేసుకునేందుకు ప్రయత్నించినా నర్సంపేట, ఖానాపురం ప్రాంతాల్లో యూరియా అందుబాటులో ఉన్నట్లు కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు. గతేడాది ఎదుర్కొన్న యూరియా కొరత పరిస్థితి ఈ ఏడాది కూడా ఎదురుకావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

‘మిష్మీ కొండలు’ - అనువాద నవల
మన దేశంలో సూర్యుడు మొదట ఉదయించే అరుణాచల్ ప్రదేశ్‌లో మిష్మీ కొండలున్నాయి. ఆ ప్రాంతానికి చెందిన రచయిత్రి మమాంగ్ డాయ్ ‘The Black Hill’ అనే పేరుతో ఇంగ్లీష్‌లో నవల రాశారు. దాన్ని మూర్తి కె.వి.వి.ఎస్ ‘మిష్మీ కొండలు’ పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ నవల చదువుతుంటే టిబెట్‌కు, హిమాలయాలకు దగ్గరగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌లోని మిష్మీ కొండల సౌందర్యం కళ్ల ముందు కదులుతుంది. 1826లో తెగల మధ్య పోరాటాలు, బ్రిటిష్ వారి రాక, వారితో జరుగుతున్న సంఘర్షణల నేపథ్యంలో ఈ నవల ఉంటుంది. నవల ధర రూ.230. కొనే <a href="https://www.telugubooks.in/products/mishmi-kondalu?srsltid=AfmBOoqwChgwaLg0aTqLUPVuUd4RCjYactzre0WHLuk9U6D1c7j8AOAJ">లింక్</a> ఇది.

గవర్నమెంట్ స్కూల్లో రాజకీయ నాయకుల పుట్టినరోజా?
AP: పల్నాడు జిల్లా కారంపూడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఇటీవల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు, వైఎస్ఆర్‌సీపీ నేత పిన్నెల్లి వెంకటరామిరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించినట్టు సమాచారం. కొంతమంది టీచర్ల సహకారంతోనే ఈ వేడుకలు జరిగాయని, వాళ్ల మీద ఎంఈవో చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. రూల్స్‌కి వ్యతిరేకంగా గవర్నమెంట్ స్కూల్లో రాజకీయ నాయకుడి పుట్టినరోజు జరపడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. స్కూళ్లను రాజకీయ నేతల ప్రచార వేదికలుగా మార్చడం ఏమిటని జనం మండిపడుతున్నారు.

నిత్యావసరాల ధరలు తగ్గించాలి
నిత్యావసరాల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ గోకవరం మండలం రంప యర్రంపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ కూలి పనులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు. రైతులకు సకాలంలో నీరు అందక పంటలు దెబ్బతింటున్నాయని అన్నారు. ధరలు తగ్గించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

మోదీ నా జీవితాన్ని నరకం చేశారు: రుచికాసింగ్
‘మోదీజీ.. నా జీవితాన్ని నరకం చేశారు’ అంటూ రుచిక సింగ్ లేటెస్ట్‌గా వీడియో రిలీజ్ చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ సీజేపీ నిరసనలో మోదీ మీద కామెంట్స్ చేసి, ఆపై సారీ చెప్పిన ఆమె ఆ తర్వాత తను పడుతున్న కష్టాల గురించి ఈ వీడియోలో మాట్లాడారు. 15 ఏళ్ల పిల్లను ప్రతిచోటా ఇలా టార్చర్ పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. తను భయంతో బతుకుతున్నానని, తన పర్సనల్ లైఫ్ చాలా ఎఫెక్ట్ అయిందని వివరించారు. ముఖం దాచుకొని బతకాల్సి వస్తోందని అన్నారు. అయినా తను వెనక్కి తగ్గనని వివరించారు.

ఇది RSS పాత ట్రిక్: అసదుద్దీన్ ఒవైసీ
“భారత్‌లో ముస్లింలు ఉండకూడదని ఏ హిందువు అనుకుంటే అతను హిందువు కాదు” అని RSS చీఫ్ మోహన్ భగవత్ కామెంట్స్‌పై AIMIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రియాక్ట్ అయ్యారు. ఇది RSS పాత ట్రిక్ అని, ప్రపంచానికి ఒకటి, తమ సభ్యులకు మరొకటి చెప్పే పద్ధతి అని విమర్శించారు. RSS తన ముఖ్య ఆలోచనాపరులను ఎప్పుడూ తిరస్కరించలేదని అన్నారు. ముస్లింలు, మైనారిటీల గురించి ఏం రాశారో ప్రజలు నిజాలు తెలుసుకోవాలని ఆయన తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
అంధత్వ నివారణపై స్కూల్ పిల్లలకు అవగాహన
రాజాం మండలం రాజాం సన్ స్కూల్ ఆవరణలో అంధత్వ నివారణ కార్యక్రమాల్లో భాగంగా పిల్లలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్నియా సేకరణ, కంటి చూపు మందగించే వారికి చికిత్సలు చేసి అంధత్వాన్ని నివారించడానికి కార్యక్రమాలు చేస్తున్నామని రాజాం రెడ్‌క్రాస్ అధ్యక్షుడు కొత్తా సాయిప్రశాంత్ కుమార్ అన్నారు. రాజాం రెడ్‌క్రాస్ ప్రతినిధి చైతన్య కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 650 మంది ఇప్పటివరకూ నేత్రదానం చేస్తే రాజాం నుండే 150 మంది నేత్రదానం చేశారని తెలిపారు.

స్టూడెంట్స్‌కు బుక్స్ పంపిణీ
మంచిర్యాలలోని మందమర్రి కళ్యాణి కని స్కూల్ స్టూడెంట్స్‌కు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కూల్ హెడ్‌మాస్టర్ శ్రీలత, ఇంచార్జ్ రజిత సమక్షంలో వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ అజీమోద్దీన్ పిల్లలకు బుక్స్ ఇచ్చారు. పరీక్షల్లో మంచి రిజల్ట్స్ సాధించేందుకు స్టూడెంట్స్‌ను ప్రోత్సహించాలని బుక్స్ పంపిణీ అందించనట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నందిపేట రాజ్ కుమార్, కార్యదర్శి గాండ్ల సంజీవ్, జావిద్ పాల్గొన్నారు

పోచమ్మ ఆలయ పునః ప్రతిష్ట కార్యక్రమం
ఫరూక్‌నగర్ మండలం వెలిజర్లలో పోచమ్మ ఆలయ విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరై పూజలు చేశారు. గ్రామీణ ఆలయాల ప్రగతి కోసం కృషి చేస్తానని, యువతలో ఆధ్యాత్మిక చింతన పెరగాలని ఆయన పేర్కొన్నారు. సర్పంచ్ బాబు నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులకు అన్నదానం చేశారు.

కోట మైసమ్మ ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు
షాద్‌నగర్ పట్టణంలోని రైతు కాలనీలో కోట మైసమ్మ ఆలయంలో మూడో వార్షికోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు. భారీ ఎత్తున ఊరేగింపుతోపాటు విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం చేపట్టారు. భక్తులకు అన్న వితరణ నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, శుక్రవర్ధన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఎండి ఖాజా పాషా తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి NIELIT క్యాంపస్ తరలింపు సరికాదు
తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం(SVU) ప్రాంగణంలో టెంపరరీగా ప్రారంభించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(NIELIT) శాశ్వత క్యాంపస్‌ను రాజధాని మంగళగిరికి తరలించాలనే ప్రభుత్వం నిర్ణయాన్ని ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా కార్యదర్శి అక్బర్, డివైఎఫ్ఐ తిరుపతి జిల్లా కన్వీనర్ వీరేష్ ఖండించారు. 1,200 మందికి పైగా విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొందుతున్నారని, ఇలాంటి కీలక సంస్థను వేరే ప్రాంతానికి మళ్లించడం సీమ యువత భవిష్యత్తుపై గొడ్డలిపెట్టు అని ఆందోళన వ్యక్తం చేశారు.

కళ్లముందే వరద.. పిల్లల్ని కాపాడిన అమ్మ ధైర్యం!
నేపాల్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్న వేళ.. ఓ తల్లి తన పిల్లలను కాపాడిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక్కసారిగా వరద వేగం పెరిగినా.. పిల్లల చేతులను వదలకుండా జస్ట్ సెకండ్స్‌లోనే వారిని సేఫ్‌గా ఒడ్డుకు చేర్చింది. కిందపడినా వెంటనే లేచి, పిల్లలను తీసుకుని కొండ ప్రాంతం వైపు పరుగులు తీసింది. రెండు సెకన్లు లేట్ అయినా సిట్యువేషన్ ఎలా ఉండేదో ఊహించలేం. భయానికి లొంగకుండా వెంటనే రియాక్ట్ అయ్యి పిల్లలను కాపాడిన ఆ తల్లి ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
హైవేనా...గుంతల దారా?
మంచిర్యాల జిల్లాలోని హైవే 63 భీమారం జోడువాగుల వద్ద రోడ్డు ఇరుగ్గా ఉన్నాయి. చుట్టూ గుంతలు ఉండటంవల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు అంటున్నారు. బైకర్స్ రాత్రుళ్లు రోడ్డు దాటడం భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా గుంతలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

నాగులేరుకు కుడికాలువ నీరు విడుదల చేయాలి
తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నాగులేరుకు కుడికాలువ నీటిని విడుదల చేసి దాచేపల్లి నగర పంచాయతీతో పాటు నాగులేరు పరివాహక ప్రాంత గ్రామాల తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఏడాది వర్షాలు లేక వాగులు, వంకలు, బావులు, చెరువులు, కుంటలు నీరు లేక ఎండిపోయి ఎడారిని తలపిస్తున్నాయని పేర్కొన్నారు. పల్నాటి చరిత్రలో భాగమైన నాగులేరు సైతం చుక్కనీరు లేక ఎండిపోవడంతో దాని పరివాహక ప్రాంతంలోని భూగర్భజలాలు అడుగంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆయిల్‌ఫెడ్ భూములపై హరీశ్‌రావు ఫైర్.. CMకు లేఖ!
TG: హైదరాబాద్‌లోని RTC క్రాస్‌రోడ్స్, అజామాబాద్‌లో తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌కు చెందిన Govt. ల్యాండ్స్‌పై మాజీ మంత్రి, MLA హరీశ్‌రావు కీలక ఆరోపణలు చేశారు. రూ. 500 కోట్ల విలువైన భూములను రూ. 87 కోట్లకే ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి కాంగ్రెస్ Govt ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ అంశంపై CM రేవంత్‌రెడ్డికి ఓపెన్ లెటర్ రాశారు. నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఉద్యమం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అయితే, ఇవి హరీశ్‌రావు చేసిన ఆరోపణలేనని, ప్రభుత్వం వైపు నుంచి ఆఫిషియల్‌గా క్లారిటీ రావాల్సి ఉంది.

నీట్ పీజీ ఎగ్జామ్ సెంటర్ పరిశీలన
నర్సంపేటలోని బిట్స్ కాలేజీలో నిర్వహిస్తున్న నీట్ పీజీ–2026 ఎగ్జామ్ సెంటర్‌ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు కల్పించిన వసతులు, భద్రతా ఏర్పాట్లు, పరీక్ష నిర్వహణకు సంబంధించిన నిబంధనలను పరిశీలించారు. పరీక్ష ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

తెలంగాణ SIRపై రేవంత్‌రెడ్డి అలర్ట్.. ECIకి కీలక లేఖ
TG: రాష్ట్రంలో SIR ఓటర్ల లిస్ట్ రీ-విజన్‌పై CM రేవంత్‌రెడ్డి ECIకి లెటర్ రాశారు. అర్హులైన ఒక్క ఓటర్ పేరు కూడా డిలీట్ కాకూడదని, అనర్హులు లిస్ట్‌లోకి రాకూడదని స్పష్టం చేశారు. జూన్ 10 నాటికి 3.38 కోట్ల ఓటర్లలో 73.39 లక్షల మందిని ASDD కేటగిరీలో గుర్తించినట్లు తెలిపారు. డిజిటలైజ్ చేసిన 2.65 కోట్ల Formsలో 92.86 లక్షల కేసుల్లో లోపాలు లేదా లింక్ సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆబ్జెక్షన్స్ గడువును మరో 4 వీక్స్ ఎక్స్‌టెండ్ చేయాలని, ఓటర్లకు హెల్ప్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు.

ప్రైవేట్ ల్యాబ్‌లపై ఆరోపణలు
నర్సంపేట పట్టణంలోని కొన్ని ప్రైవేట్ ల్యాబ్‌లలో నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు టెక్నీషియన్లు పరీక్షల ఫలితాలను మాన్యువల్‌గా తమకు నచ్చినట్లు నమోదు చేస్తున్నారనే విమర్శలున్నాయి. అర్హత లేని వారు టెక్నీషియన్లుగా కొనసాగుతున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో చికిత్స పొందిన ఓ రోగికి జాండీస్ పరీక్షల్లో హెచ్చుతగ్గులతో రిపోర్టులు రావడం చర్చనీయాంశమైంది. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ల్యాబ్‌లను తనిఖీ చేసి వాస్తవాలను నిగ్గుతేల్చాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రజా సమస్యల నుంచి డైవర్ట్ చేసేందుకే: సజ్జల
AP: YSRCPపై వస్తున్న విమర్శలపై సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీకి లాంగ్‌టైమ్ లీడ్ చేసే సత్తా జగన్‌కు ఉందని అన్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో పేదల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొచ్చారని చెప్పారు. YSRCPని విమర్శించే విషయంలో వ్యక్తులు మాత్రమే మారుతున్నారని, పొలిటికల్ అటాక్ మాత్రం కంటిన్యూ అవుతోందన్నారు. ప్రజల అసలు సమస్యల నుంచి అటెన్షన్ డైవర్ట్ చేసేందుకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. పబ్లిసిటీ కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను జగన్‌కు ఆపాదిస్తున్నారని సజ్జల విమర్శించారు.

సరైన చికిత్స అందక.. గురుకుల విద్యార్థిని మృతి!
పోలవరం జిల్లా కూనవరం కోతుల గుట్ట గురుకుల పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థిని తెల్లం జాహ్నవి (పల్లూరు గ్రామం) ఆదివారం మృతి చెందింది. శనివారం రాత్రి అనారోగ్యానికి గురైన ఆమెను కోతులగుట్ట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తిరిగి హాస్టల్కు తీసుకురాగా తెల్లవారుజామున ఆరోగ్యం మరింత క్షీణించడంతో భద్రాచలం, ఆ తర్వాత ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే ప్రాణాలు కోల్పోయింది. సకాలంలో సరైన చికిత్స అందకపోవడంతోనే మృతి చెందిందని, పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు.

SBIలో 9,124 ఉద్యోగాలకు రేపే లాస్ట్ డేట్.. అప్లై చేసుకోండి!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) పోస్టులకు <a href="https://sbi.bank.in/webfiles/uploads/files_2627/08/JA_2026_Detailed_Advt_Eng.pdf">నోటిఫికేషన్</a> విడుదలైంది. మొత్తం 9,124 పోస్టులు ఉండగా, 7,680 రెగ్యులర్ వేకెన్సీస్, 1,444 బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఈనెల 31తో అప్లికేషన్స్ ముగుస్తాయి. ఏదైనా గ్రాడ్యుయేషన్ (డిగ్రీ) పూర్తిచేసిన వారు అర్హులు. 20 నుంచి 28 ఏళ్ల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. జనరల్, OBC, EWS కాండిడేట్స్‌కు ఫీజు రూ.750 ఉంటుంది. SC/ST/PwBD వారికి ఎటువంటి ఫీజు లేదు. అప్లికేషన్ కోసం ఇక్కడ <a href="https://ibpsreg.ibps.in/sbijajul26/">Click </a>చేయండి.