Latest

పోచమ్మ ఆలయ పునః ప్రతిష్ట కార్యక్రమం
Local· 6d ago

పోచమ్మ ఆలయ పునః ప్రతిష్ట కార్యక్రమం

ఫరూక్‌నగర్ మండలం వెలిజర్లలో పోచమ్మ ఆలయ విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరై పూజలు చేశారు. గ్రామీణ ఆలయాల ప్రగతి కోసం కృషి చేస్తానని, యువతలో ఆధ్యాత్మిక చింతన పెరగాలని ఆయన పేర్కొన్నారు. సర్పంచ్ బాబు నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులకు అన్నదానం చేశారు.

కోట మైసమ్మ ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు
Local· 6d ago

కోట మైసమ్మ ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు

షాద్‌నగర్ పట్టణంలోని రైతు కాలనీలో కోట మైసమ్మ ఆలయంలో మూడో వార్షికోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు. భారీ ఎత్తున ఊరేగింపుతోపాటు విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం చేపట్టారు. భక్తులకు అన్న వితరణ నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, శుక్రవర్ధన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఎండి ఖాజా పాషా తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి NIELIT క్యాంపస్ తరలింపు సరికాదు
Local· 6d ago

తిరుపతి NIELIT క్యాంపస్ తరలింపు సరికాదు

తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం(SVU) ప్రాంగణంలో టెంపరరీగా ప్రారంభించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(NIELIT) శాశ్వత క్యాంపస్‌ను రాజధాని మంగళగిరికి తరలించాలనే ప్రభుత్వం నిర్ణయాన్ని ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా కార్యదర్శి అక్బర్, డివైఎఫ్ఐ తిరుపతి జిల్లా కన్వీనర్ వీరేష్ ఖండించారు. 1,200 మందికి పైగా విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొందుతున్నారని, ఇలాంటి కీలక సంస్థను వేరే ప్రాంతానికి మళ్లించడం సీమ యువత భవిష్యత్తుపై గొడ్డలిపెట్టు అని ఆందోళన వ్యక్తం చేశారు.

కళ్లముందే వరద.. పిల్లల్ని కాపాడిన అమ్మ ధైర్యం!
Viral· 6d ago

కళ్లముందే వరద.. పిల్లల్ని కాపాడిన అమ్మ ధైర్యం!

నేపాల్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్న వేళ.. ఓ తల్లి తన పిల్లలను కాపాడిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక్కసారిగా వరద వేగం పెరిగినా.. పిల్లల చేతులను వదలకుండా జస్ట్ సెకండ్స్‌లోనే వారిని సేఫ్‌గా ఒడ్డుకు చేర్చింది. కిందపడినా వెంటనే లేచి, పిల్లలను తీసుకుని కొండ ప్రాంతం వైపు పరుగులు తీసింది. రెండు సెకన్లు లేట్ అయినా సిట్యువేషన్ ఎలా ఉండేదో ఊహించలేం. భయానికి లొంగకుండా వెంటనే రియాక్ట్ అయ్యి పిల్లలను కాపాడిన ఆ తల్లి ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

హైవేనా...గుంతల దారా?
Local· 6d ago

హైవేనా...గుంతల దారా?

మంచిర్యాల జిల్లాలోని హైవే 63 భీమారం జోడువాగుల వద్ద రోడ్డు ఇరుగ్గా ఉన్నాయి. చుట్టూ గుంతలు ఉండటంవల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు అంటున్నారు. బైకర్స్ రాత్రుళ్లు రోడ్డు దాటడం భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా గుంతలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

నాగులేరుకు కుడికాలువ నీరు విడుదల చేయాలి
Local· 6d ago

నాగులేరుకు కుడికాలువ నీరు విడుదల చేయాలి

తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నాగులేరుకు కుడికాలువ నీటిని విడుదల చేసి దాచేపల్లి నగర పంచాయతీతో పాటు నాగులేరు పరివాహక ప్రాంత గ్రామాల తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఏడాది వర్షాలు లేక వాగులు, వంకలు, బావులు, చెరువులు, కుంటలు నీరు లేక ఎండిపోయి ఎడారిని తలపిస్తున్నాయని పేర్కొన్నారు. పల్నాటి చరిత్రలో భాగమైన నాగులేరు సైతం చుక్కనీరు లేక ఎండిపోవడంతో దాని పరివాహక ప్రాంతంలోని భూగర్భజలాలు అడుగంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆయిల్‌ఫెడ్ భూములపై హరీశ్‌రావు ఫైర్.. CMకు లేఖ!
TG· 6d ago

ఆయిల్‌ఫెడ్ భూములపై హరీశ్‌రావు ఫైర్.. CMకు లేఖ!

TG: హైదరాబాద్‌లోని RTC క్రాస్‌రోడ్స్, అజామాబాద్‌లో తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌కు చెందిన Govt. ల్యాండ్స్‌పై మాజీ మంత్రి, MLA హరీశ్‌రావు కీలక ఆరోపణలు చేశారు. రూ. 500 కోట్ల విలువైన భూములను రూ. 87 కోట్లకే ప్రైవేట్‌ వ్యక్తులకు ఇవ్వడానికి కాంగ్రెస్ Govt ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ అంశంపై CM రేవంత్‌రెడ్డికి ఓపెన్ లెటర్ రాశారు. నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఉద్యమం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అయితే, ఇవి హరీశ్‌రావు చేసిన ఆరోపణలేనని, ప్రభుత్వం వైపు నుంచి ఆఫిషియల్‌గా క్లారిటీ రావాల్సి ఉంది.

నీట్‌ పీజీ ఎగ్జామ్ సెంటర్ పరిశీలన
Local· 30 Aug 2026

నీట్‌ పీజీ ఎగ్జామ్ సెంటర్ పరిశీలన

నర్సంపేటలోని బిట్స్‌ కాలేజీలో నిర్వహిస్తున్న నీట్‌ పీజీ–2026 ఎగ్జామ్ సెంటర్‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు కల్పించిన వసతులు, భద్రతా ఏర్పాట్లు, పరీక్ష నిర్వహణకు సంబంధించిన నిబంధనలను పరిశీలించారు. పరీక్ష ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

తెలంగాణ SIRపై రేవంత్‌రెడ్డి అలర్ట్.. ECIకి కీలక లేఖ
TG· 30 Aug 2026

తెలంగాణ SIRపై రేవంత్‌రెడ్డి అలర్ట్.. ECIకి కీలక లేఖ

TG: రాష్ట్రంలో SIR ఓటర్ల లిస్ట్ రీ-విజన్‌పై CM రేవంత్‌రెడ్డి ECIకి లెటర్ రాశారు. అర్హులైన ఒక్క ఓటర్ పేరు కూడా డిలీట్ కాకూడదని, అనర్హులు లిస్ట్‌లోకి రాకూడదని స్పష్టం చేశారు. జూన్ 10 నాటికి 3.38 కోట్ల ఓటర్లలో 73.39 లక్షల మందిని ASDD కేటగిరీలో గుర్తించినట్లు తెలిపారు. డిజిటలైజ్ చేసిన 2.65 కోట్ల Formsలో 92.86 లక్షల కేసుల్లో లోపాలు లేదా లింక్ సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆబ్జెక్షన్స్ గడువును మరో 4 వీక్స్ ఎక్స్‌టెండ్ చేయాలని, ఓటర్లకు హెల్ప్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు.

ప్రైవేట్‌ ల్యాబ్‌లపై ఆరోపణలు
Local· 30 Aug 2026

ప్రైవేట్‌ ల్యాబ్‌లపై ఆరోపణలు

నర్సంపేట పట్టణంలోని కొన్ని ప్రైవేట్‌ ల్యాబ్‌లలో నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు టెక్నీషియన్లు పరీక్షల ఫలితాలను మాన్యువల్‌గా తమకు నచ్చినట్లు నమోదు చేస్తున్నారనే విమర్శలున్నాయి. అర్హత లేని వారు టెక్నీషియన్లుగా కొనసాగుతున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో చికిత్స పొందిన ఓ రోగికి జాండీస్‌ పరీక్షల్లో హెచ్చుతగ్గులతో రిపోర్టులు రావడం చర్చనీయాంశమైంది. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ల్యాబ్‌లను తనిఖీ చేసి వాస్తవాలను నిగ్గుతేల్చాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రజా సమస్యల నుంచి డైవర్ట్ చేసేందుకే: సజ్జల
AP· 30 Aug 2026

ప్రజా సమస్యల నుంచి డైవర్ట్ చేసేందుకే: సజ్జల

AP: YSRCPపై వస్తున్న విమర్శలపై సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీకి లాంగ్‌టైమ్‌ లీడ్ చేసే సత్తా జగన్‌కు ఉందని అన్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో పేదల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొచ్చారని చెప్పారు. YSRCPని విమర్శించే విషయంలో వ్యక్తులు మాత్రమే మారుతున్నారని, పొలిటికల్ అటాక్ మాత్రం కంటిన్యూ అవుతోందన్నారు. ప్రజల అసలు సమస్యల నుంచి అటెన్షన్ డైవర్ట్ చేసేందుకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. పబ్లిసిటీ కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను జగన్‌కు ఆపాదిస్తున్నారని సజ్జల విమర్శించారు.

సరైన చికిత్స అందక.. గురుకుల విద్యార్థిని మృతి!
Local· 30 Aug 2026

సరైన చికిత్స అందక.. గురుకుల విద్యార్థిని మృతి!

పోలవరం జిల్లా కూనవరం కోతుల గుట్ట గురుకుల పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థిని తెల్లం జాహ్నవి (పల్లూరు గ్రామం) ఆదివారం మృతి చెందింది. శనివారం రాత్రి అనారోగ్యానికి గురైన ఆమెను కోతులగుట్ట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తిరిగి హాస్టల్కు తీసుకురాగా తెల్లవారుజామున ఆరోగ్యం మరింత క్షీణించడంతో భద్రాచలం, ఆ తర్వాత ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే ప్రాణాలు కోల్పోయింది. సకాలంలో సరైన చికిత్స అందకపోవడంతోనే మృతి చెందిందని, పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు.

SBIలో 9,124 ఉద్యోగాలకు రేపే లాస్ట్ డేట్.. అప్లై చేసుకోండి!
Jobs· 30 Aug 2026

SBIలో 9,124 ఉద్యోగాలకు రేపే లాస్ట్ డేట్.. అప్లై చేసుకోండి!

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI)లో జూనియర్‌ అసోసియేట్‌ (కస్టమర్ సపోర్ట్ &amp; సేల్స్) పోస్టులకు <a href="https://sbi.bank.in/webfiles/uploads/files_2627/08/JA_2026_Detailed_Advt_Eng.pdf">నోటిఫికేషన్‌</a> విడుదలైంది. మొత్తం 9,124 పోస్టులు ఉండగా, 7,680 రెగ్యులర్ వేకెన్సీస్, 1,444 బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఈనెల 31తో అప్లికేషన్స్ ముగుస్తాయి. ఏదైనా గ్రాడ్యుయేషన్‌ (డిగ్రీ) పూర్తిచేసిన వారు అర్హులు. 20 నుంచి 28 ఏళ్ల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. జనరల్‌, OBC, EWS కాండిడేట్స్‌కు ఫీజు రూ.750 ఉంటుంది. SC/ST/PwBD వారికి ఎటువంటి ఫీజు లేదు. అప్లికేషన్ కోసం ఇక్కడ <a href="https://ibpsreg.ibps.in/sbijajul26/">Click </a>చేయండి.

విజయసాయిరెడ్డి ఆరోపణలకు సజ్జల కౌంటర్.. ‘అటెన్షన్ కోసమే’
AP· 30 Aug 2026

విజయసాయిరెడ్డి ఆరోపణలకు సజ్జల కౌంటర్.. ‘అటెన్షన్ కోసమే’

AP: మాజీ MP విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలపై YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో స్పందించారు. విజయసాయి తన సొంత కారణాలతోనే YCPని వీడారని అన్నారు. పార్టీ నుంచి వెళ్లిపోయినవారిపై జగన్ ఎప్పుడూ నెగటివ్‌గా మాట్లాడలేదన్నారు. జగన్ మతమార్పిడులను ప్రోత్సహించారని విజయసాయి చేసిన కామెంట్స్ దారుణమన్నారు. 'నిజంగా జగన్ ఆలా చేసి ఉంటే.. విజయసాయినే మార్చేవాళ్లు కదా' అని కౌంటర్ ఇచ్చారు. అటెన్షన్ కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ తనకు నెం.1 స్థానం ఇచ్చారని విజయసాయి చెప్పడం కూడా సరికాదన్నారు.

మైదుకూరులో గిడుగు, ధ్యాన్‌చంద్‌కు నివాళి..
Local· 30 Aug 2026

మైదుకూరులో గిడుగు, ధ్యాన్‌చంద్‌కు నివాళి..

మైదుకూరు ZPHS (boys) లో శనివారం తెలుగు భాషా, క్రీడా దినోత్సవం ఘనంగా జరిగింది. తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు 163వ జయంతి సందర్భంగా స్కూలు ప్రిన్సిపాల్ గోశెట్టి రామ్మోహన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ – "తెలుగు భాషలో ప్రావీణ్యం సాధించినప్పుడే ఇతర భాషల్లో కూడా పట్టు సాధించగలర''ని అన్నారు. ఉపాధ్యాయులు, సిబ్బంది తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి, గిడుగు రామ్మూర్తి పంతులుకు ఘనంగా నివాళి అర్పించారు.

ట్రోల్స్ వస్తున్నా తగ్గేదేలే
Entertainment· 30 Aug 2026

ట్రోల్స్ వస్తున్నా తగ్గేదేలే

హీరో యష్ , గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో వచ్చిన ‘టాక్సిక్’ సినిమా థియేటర్లలో భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాలో వయొలెన్స్, రొమాంటిక్ సీన్స్, మహిళల క్యారెక్టరైజేషన్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్, విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ ప్రభావం ఏమాత్రం వసూళ్లపై పడలేదు. రిలీజ్ అయిన 4 రోజుల్లోనే వరల్డ్‌వైడ్‌గా రూ. 254.75 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

దేవుడికి వెండి ప్లేటు.. ఇలాంటి దాతృత్వం మరెక్కడైనా?
Local· 30 Aug 2026

దేవుడికి వెండి ప్లేటు.. ఇలాంటి దాతృత్వం మరెక్కడైనా?

పల్నాడు దాచేపల్లి బట్రుపాలెంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు రూ.2.50 లక్షల విలువైన 1 కిలో వెండి ప్లేటుని విరాళంగా అందజేశారు. కోలా కుమారస్వామి రెడ్డి, నారాయణమ్మ దంపతులు, వారి కుమారుడు వెంకట నరసింహారెడ్డి, తులసి దంపతులు స్వామివారికి నైవేద్యం కోసం ఈ ప్లేటును సమర్పించారు. అయితే, భక్తి, సంప్రదాయాలను గౌరవిస్తూనే – ఇలాంటి దాతృత్వం "మొదట సమాజం, తర్వాత ఆలయం" అనే ధోరణిని ప్రోత్సహిస్తే, ప్రభుత్వ స్కూళ్లు,, ఆసుపత్రులు, తాగునీటి కేంద్రాలు బాగుపడతాయని, ఇలా కూడా ఆలోచన చేయాలని పరిశీలకులు అంటున్నారు.

ఫీజుల పెంపును వెంటనే వెనక్కి తీసుకోండి: PAAP డిమాండ్
Local· 30 Aug 2026

ఫీజుల పెంపును వెంటనే వెనక్కి తీసుకోండి: PAAP డిమాండ్

APలోని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో MBBS, BDS ఫీజులను 10%, PG ఫీజులను 15% పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జివోను విత్‌డ్రా చేసుకోవాలని పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PAAP) డిమాండ్ చేసింది. ఇప్పటికే ఉన్న ఫీజులతోనే మిడిల్ క్లాస్, పూర్ ఫ్యామిలీస్ తిప్పలు పడుతున్నాయని, ఈ పెంపుతో మరింత బర్డెన్ పడుతుందని తెలిపింది. పేరెంట్స్, స్టూడెంట్స్ తో మాట్లాడి ఫీజులు డిసైడ్ చేయాలని, లేకపోతే స్టేట్ వైడ్‌గా ప్రొటెస్ట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.

పెద్దపల్లిలో నీట్-పీజీ పరీక్షా కేంద్రాల తనిఖీ
Local· 30 Aug 2026

పెద్దపల్లిలో నీట్-పీజీ పరీక్షా కేంద్రాల తనిఖీ

నీట్-పీజీ 2026 పరీక్షల సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని ట్రినిటీ ఇంజినీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సందర్శించారు. పోలీసు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. జోన్ పరిధిలోని మూడు కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

దూడల్ని బలి తీసుకున్న కుక్కలు.. లైట్లు లేవు!
Local· 30 Aug 2026

దూడల్ని బలి తీసుకున్న కుక్కలు.. లైట్లు లేవు!

పల్నాడు నకరికల్లు గుండ్లపల్లిలో వీధి కుక్కల బెడద తారాస్థాయికి చేరింది. కుమ్మరి బజార్లో కుక్కలు దూడలపై దాడి చేయడంతో 2 దూడలు మృతి చెందాయి. గత నెల రోజులుగా వీధి లైట్లు పనిచేయకపోవడంతో రాత్రివేళల్లో శునకాల సంచారం పెరిగిందని, ప్రజలు, పశువులు ప్రమాదంలో పడుతున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుండ్లపల్లి మాత్రమే కాదు మొత్తం ఏపీలోలోనే కుక్క కాటు కేసులు భయంకరంగా పెరుగుతున్నాయి. 2024లో రాష్ట్ర వ్యాప్తంగా 2,44,914 కేసులు నమోదైతే, గుంటూరులో 18,040, బాపట్లలో 8,742, పల్నాడులో 4,186 నమోదయ్యాయి.

గుంతలతో పల్నాడు రోడ్డు
Local· 30 Aug 2026

గుంతలతో పల్నాడు రోడ్డు

పల్నాడు జిల్లా దాచేపల్లి నుంచి తంగేడు వెళ్లే 17 కిలోమీటర్ల మెయిన్ రోడ్డు భారీ గుంతలతో ఉందని ప్రజలు తెలిపారు. తెలంగాణ వైపు వెళ్లే ఈ రూట్‌లో గుంతల వల్ల బైక్‌లు, కార్లు వెళ్లడం ఇబ్బందిగా ఉందంటున్నారు. రోజూ ట్రావెల్ చేసే వాళ్లు యాక్సిడెంట్స్ అవుతాయేమోనని భయపడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా రెస్పాండ్ అయ్యి ఆ రోడ్డు రిపేర్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.