Latest
చనిపోయే ముందు క్రాంతి కుమార్ కన్నీటి సెల్ఫీ వీడియో!
కృష్ణలంక సీఐ నాగరాజుపై మరో షాకింగ్ ఆరోపణ వెలుగులోకి వచ్చింది. గత నెల 21న ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్ అనే యువకుడి సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో.. "నేను మాదిగ పుట్టుక పుట్టడం తప్పా?" అంటూ క్రాంతి కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. సీఐ నాగరాజు తనను వెంటాడి కొడుతున్నాడని, తన ఆత్మహత్యకు ఆయనే కారణమంటూ చనిపోయే ముందు కన్నీళ్లు పెట్టుకున్న ఈ వీడియో ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతోంది.

మినిస్టర్ ముందే సూసైడ్ అటెంప్ట్!
వైఎస్సార్ కడప జిల్లాలో మంత్రి సావిత్రి ఆధ్వర్యంలో జరిగిన కూటమి రివ్యూ మీటింగ్‌లో ఒక ఘోరమైన ఘటన జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు న్యాయం జరగడం లేదంటూ. తీవ్ర మనస్తాపంతో ఒక TDP కార్యకర్త మీటింగ్‌లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే, ఆ కార్యకర్త అంత పెద్ద ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా మంత్రి సావిత్రి మాత్రం దాన్ని పట్టించుకోకుండా తన స్పీచ్‌ను కంటిన్యూ చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

గాదె సాయికృష్ణ డెత్ మిస్టరీ.. పోలీసులపై కేశినేని నాని సంచలన ఆరోపణలు!
గాదె సాయికృష్ణ మరణంపై EX MP కేశినేని నాని పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. సాయికృష్ణ ఒంటిపై ఉన్న థర్డ్ డిగ్రీ గాయాలు బయటపడకుండా ఉండేందుకే, పోలీసులు రహస్యంగా దహనం చేశారని ఆరోపించారు. ఫోరెన్సిక్, DNA లాంటి ఎలాంటి ఎవిడెన్స్ దొరక్కుండా ఉండేందుకే అస్థికలను కృష్ణానదిలో కలిపేశారని నాని అన్నారు. ఈ విషయంలో 'కమాండ్ రెస్పాన్సిబిలిటీ' కింద NTR జిల్లా పోలీస్ కమిషనర్ S.V రాజశేఖర బాబును వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అయోధ్య రామాలయంలో బిగ్ బ్రేకింగ్.. CCTV కెమెరా మాయం చేసిన నిందితులు!
అయోధ్య రామాలయంలో విరాళాల డబ్బుల మాయం కేసులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఎలాంటి ఎవిడెన్స్ దొరక్కుండా ఉండేందుకు నిందితులు అక్కడి CCTV కెమెరాలను ట్యాంపరింగ్ (మార్చడం) చేసినట్లు SIT అధికారులు గుర్తించారు. ఈ కేసులో మొత్తం 200 మంది అనుమానితుల లిస్ట్ ఉండగా, ఇప్పటికే 125 మందిని విచారించారు. ముఖ్యంగా ఈ కేసులో మెయిన్ సస్పెక్ట్ అయిన తిను యాదవ్‌ను అధికారులు గంటల తరబడి ప్రశ్నించి కీలక వివరాలు రాబడుతున్నారు.

10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో కలెక్టర్ కొడుకు!
ఈ రోజుల్లో అప్పు చేసైనా సరే పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్‌లో చదివిస్తున్నారు. కానీ పార్వతీపురం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి మాత్రం తన కొడుకును అక్కడి మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్‌లో 10వ తరగతిలో చేర్పించారు. ఈయన గతంలో నెల్లూరు, విజయవాడలలో పని చేసినప్పుడు కూడా తన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్ లోనే చదివించారు. అంత పెద్ద ఆఫీసర్ అయ్యి ఉండి కూడా కొడుకును సర్కారు బడికి పంపించడంతో.. అందరూ ‘మీరు గ్రేట్ సార్’ అంటూ ఆయనను ప్రశంసిస్తున్నారు.

దయ్యాల పేరుతో కోట్లు నొక్కేసిన ట్రాన్స్ ఉమెన్!
అన్నమయ్య జిల్లాకు చెందిన మోహన్ కృష్ణ అనే అబ్బాయి, కొన్నేళ్ల క్రితం ఇల్లు వదిలి వెళ్లి అమ్మాయిగా మారాడు. తిరిగి వచ్చాక తన పేరును మధుశ్రీగా మార్చుకుని. అందంగా రెడీ అవుతూ రాంగ్ రూట్‌లో మనీ సంపాదించడం స్టార్ట్ చేశాడు. భూమిలో పాతకాలపు నిధులు ఉన్నాయని, ఇంట్లో దయ్యాలు ఉన్నాయని నమ్మిస్తూ.. పూజల పేరుతో చాలామందిని మోసం చేసి కోట్ల రూపాయలు నొక్కేసాడు. అంతేకాదు, ఒక గ్యాంగ్‌ని ఫామ్ చేసి మ్యారేజెస్ దగ్గర బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడు. రీసెంట్‌గా బాధితులు మీడియా ముందుకు రావడంతో, దాదాపు 13 ఫ్యామిలీస్‌ని ముంచేసి కోట్లు నొక్కేసిన ఇతని గుట్టు రట్టయింది.

అపోలో హాస్పిటల్ కి ED షాక్.. కోట్లల్లో ఫైన్ వేసిన RBI!
ఫెమా (FEMA) నిబంధనల ఉల్లంఘనల కేసులో అపోలో హాస్పిటల్స్‌పై RBI సీరియస్ యాక్షన్ తీసుకుంది. దాదాపు ₹2400 కోట్లకు పైగా ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్స్ లావాదేవీల్లో రూల్స్ బ్రేక్ అయినట్లు ED గుర్తించింది. దీంతో వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద అపోలో హాస్పిటల్స్ ₹17.76 కోట్లు చెల్లించాలని RBI ఆదేశించింది. వీటితో పాటు నిబంధనలు ఉల్లంఘించినందుకు సంస్థ డైరెక్టర్లు ప్రీతా రెడ్డి, సునీతా రెడ్డి సహా ఐదుగురికి ఒక్కొక్కరికి ₹18 లక్షల చొప్పున పర్సనల్ జరిమానా విధించింది. RBI అనుమతులు లేకుండా రిటైల్ బిజినెస్‌లో విదేశీ పెట్టుబడులు స్వీకరించడం వల్లే ఈ చర్యలు తీసుకున్నారు.

గీతం యూనివర్సిటీలో కొత్తగా BED కోర్సులు
TG: సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్ యూనివర్సిటీలో కొత్తగా నాలుగేండ్ల BED కోర్సులు రెండు ప్రవేశపెట్టినట్టు అదనపు VC ప్రొఫెసర్ DS రావు వెల్లడించారు. తమ వర్సిటీలో BA BED, BSC BED కోర్సులు ప్రవేశపెట్టామని తెలిపారు. ఈ కోర్సుల నిర్వహణకు వర్సిటీలో కొత్తగా స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌ను స్థాపించామని పేర్కొన్నారు. గీతం అడ్మిషన్ టెస్ట్(GAT) 2026 పరీక్షను ఈ నెల 28న ఆన్‌లైన్‌లో జాతీయంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు 26లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఇటలీ PM కూతురి వైరల్ వీడియో!
ఇటలీ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోని కూతురి క్యూట్ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. జనరల్‌గా లీడర్స్ ఫ్యామిలీస్ కనిపిస్తే మీడియా కెమెరాలు చుట్టుముడతాయి. కానీ మెలోని కూతురు మాత్రం కెమెరా కంటికి చిక్కకుండా ఉండడానికి స్మార్ట్‌గా తన అమ్మ వెనుకాలే దాక్కుంటూ ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేసింది. పీఎం కూతురైనా మీడియా హడావిడి నచ్చక ఆమె చేసిన ఈ క్యూట్ యాక్ట్‌ను అక్కడున్న వాళ్ళు రికార్డ్ చేయడంతో, ఈ ఫన్నీ మూమెంట్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

TDP కార్యకర్తపై కర్రలు, రాళ్లతో దాడి
AP: కర్నూల్ జిల్లాలో TDP కార్యకర్త తైజుమ్ బాషా అనే యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు కర్రలు, రాళ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన తైజుమ్ స్పాట్‌లోనే స్పృహ కోల్పోయాడు. గమనించిన కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. తన ఇంటి నుంచి కిరాణాషాపుకు వెళ్లి తిరిగి వస్తుండగా దుండగులు కాపుకాసి హత్యాయత్నం చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. దాడిచేసిన వారిలో జలీల్, ఫైజల్, ఆరిఫ్ మరికొందరు ఉన్నట్లు, వీరంతా YCP కార్యకర్తలుగా చెబుతున్నారు.

ఉక్రెయిన్ ప్రెసిడెంట్‌తో మోదీ!
G7 సమ్మిట్ వేదికగా PM మోదీ, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ ఒకరినొకరు కలుసుకున్నారు. ఈ ఇంటర్నేషనల్ మీటింగ్‌లో ఇద్దరు లీడర్స్ మధ్య చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ వార్ కంటే ముందు తమ మధ్య ఉన్న పాత బిజినెస్, ట్రేడ్ లెవెల్స్‌ని మళ్ళీ స్టార్ట్ చేయాలని ఇద్దరూ డిసైడ్ అయ్యారు. అంతేకాదు, ప్రపంచంలో శాంతి, స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్ అని, దానికి తాము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని మోదీ, జెలెన్‌స్కీ హింట్ ఇచ్చారు. ప్రజెంట్ వీళ్ళ మీటింగ్ పిక్స్ నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి.

తమిళనాడు అసెంబ్లీలో 'వందేమాతరం' కట్: CM విజయ్
తమిళనాడు అసెంబ్లీ సెషన్స్‌లో విజయ్ పార్టీ 'TVK' గవర్నమెంట్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు పాడే 'వందేమాతరం' గీతాన్ని పూర్తిగా తీసేసింది. దీనికి బదులుగా స్టేట్ ఆంథమ్ అయిన 'తమిళ్ తాయి వాజ్తు', అలాగే నేషనల్ ఆంథమ్ 'జనగణమన' పాటలతోనే సెషన్స్ స్టార్ట్ చేయాలని డిసైడ్ చేసింది. ఈ మార్పు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో కూడా దీనిపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. మరి ఈ డెసిషన్‌పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చెయ్యండి!

కోనసీమ జిల్లాలో ఆక్వా రైతు దారుణ హత్య
AP: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం మురమళ్ల గ్రామానికి చెందిన ఆక్వా రైతు దాట్ల కృష్ణంరాజు దారుణ హత్యకు గురయ్యాడు. నిన్నటి నుంచి కృష్ణంరాజు కనపడకుండా పోవడంతో కుటుంబసభ్యులు స్థానిక చెరువు వద్ద వెతకగా డెడ్‌బాడీని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్‌బాడీని పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను హత్య చేసి, మృతదేహానికి రాళ్లు కట్టి రొయ్యల చెరువులో పడేసి పరారయ్యారైనట్లు తెలిపారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

విజయ్ దేవరకొండకు లీగల్ నోటీసులు!
ఈ నెల 21 నుంచి స్టార్ట్ కాబోతున్న 'టీజీ టీ20' లీగ్‌కు షాకింగ్ ట్విస్ట్ ఎదురైంది. ఈ టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) లీగల్ నోటీసులు ఇచ్చింది. బీసీసీఐ నుండి ఎలాంటి అఫీషియల్ పర్మిషన్ లేకుండానే ఈ మ్యాచ్‌లు ఆడిస్తున్నారని టీసీఏ అంటోంది. విజయ్‌తో పాటు క్రికెటర్లు తిలక్ వర్మ, సిరాజ్, అంబటి రాయుడు లాంటి మరో ఎనిమిది మంది సెలబ్రిటీలకు కూడా నోటీసులు పంపబోతున్నారు. ఈ లీగ్ వెనుక రూ. 100 కోట్ల పొలిటికల్, రియల్ ఎస్టేట్ లాభాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ప్రజెంట్ ఈ మ్యాటర్ క్రికెట్, సినీ ఇండస్ట్రీలో ఫుల్ హాట్ టాపిక్‌గా మారింది.

మెరైన్ పోలీసుల దాడులు.. రెండు బోట్లు సీజ్
AP: నెల్లూరు జిల్లాలోని సముద్ర జలాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన మెకనైజ్డ్ పెద్ద బోట్లతో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ చేపల వేట కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వారిని గుర్తించి, అరికట్టేందుకు మత్స్యశాఖ, మెరైన్ పోలీస్, అటవీశాఖల ఆధ్వర్యంలో రెండు మెకనైజ్డ్ బోట్లతో నిరంతర సముద్ర గస్తీ నిర్వహిస్తున్నారు. ఇందుకూరుపేట మండల తీరానికి సుమారు 15కిలోమీటర్ల దూరంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన రెండు మెకనైజ్డ్ బోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించి చేపలవేట నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే ఆ రెండు బోట్లను పట్టుకుని సీజ్ చేశారు.

ఏనుగుల బీభత్సం.. పంటలు, తోటలు ధ్వంసం
AP: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. ఏనుగులు మామిడితోటలపై దాడి చేశాయి. రాత్రి వేళల్లో పంటలు, మామిడి తోటలలోకి వచ్చి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామకుప్పం మండలంలో, అదేవిధంగా ననియాల, ఎస్ గొల్లపల్లి ప్రాంతాల్లోకి ఏనుగులు చొరబడి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా.. అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ఏనుగుల కదలికలపై అధికారులు నిఘా పెంచారు.

ఎండ తట్టుకోలేక షూటింగ్ ఆపేసిన మహేష్ బాబు.. రూ. 2 కోట్ల సెట్ వేస్ట్!
రాజమౌళి-మహేష్ బాబు కాంబోలో వస్తున్న మూవీ షూటింగ్‌లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. రామోజీ ఫిల్మ్ సిటీలో రూ. 2 కోట్లతో వేసిన ఓపెన్ ఎయిర్ సెట్‌లో షూటింగ్ స్టార్ట్ అయిన అరగంటకే మహేష్ బాబు అక్కడ ఉన్న ఎండను తట్టుకోలేక 'నా వల్ల కాదు' అని వెళ్ళిపోయారట. దీంతో ఆ షెడ్యూల్ క్యాన్సిల్ అయి భారీగా నష్టం వచ్చింది. గతంలో 'బ్రహ్మోత్సవం' టైమ్‌లో కూడా ఎండ వల్ల అవుట్‌డోర్ సాంగ్ షూటింగ్‌ను ఇలాగే ఇన్‌డోర్‌కి షిఫ్ట్ చేయించారు. ప్రస్తుతం మూవీ టీమ్ సౌత్ ఆఫ్రికా షెడ్యూల్‌లో ప్రియాంక చోప్రాతో కలిసి బిజీగా ఉంది. నవంబర్‌లో ఈ సినిమా ప్రీలుక్ రిలీజ్ కానుంది.

రౌడీషీటర్ సాయికృష్ణ బతికిలేడు: అంబటి
AP: విజయవాడ కృష్ణలంక సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సన్సెషనల్ కామెంట్ చేశారు. సాయికృష్ణను వెతుకుతున్నామని పోలీసులు చెబుతున్నారు, కానీ అతడు బతికిలేడని అన్నారు. ఈ ఘటనపై తాము రాజకీయాలు చేయడంలేదని ఒక తల్లి ఆవేదనను మాత్రమే వ్యక్తం చేస్తున్నామని అంబటి చెప్పారు. హత్య చేయడం మొదటి నేరమైతే, డెడ్‌బాడీని మాయం చేయడం రెండో నేరం అని అన్నారు. ఘటనపై CBI విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని, బాధ్యులందరికీ కఠినంగా శిక్షించాలన్నారు.

సమంత ప్రెగ్నెంటా? వైరల్ వార్తలపై అసలు నిజం ఇదీ!
స్టార్ హీరోయిన్ సమంత నెక్స్ట్ మూవీ 'మా ఇంటి బంగారం' జూన్ 19న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. 3 ఇయర్స్ గ్యాప్ తర్వాత సామ్ రీ-ఎంట్రీ ఇస్తుండడంతో భారీ అంచనాలున్నాయి. అయితే, సమంత ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై సామ్ సన్నిహితులు స్పందిస్తూ. ఈ ప్రెగ్నెన్సీ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, తను ప్రస్తుతం కేవలం కెరీర్‌పైనే పూర్తి ఫోకస్ పెట్టిందని క్లారిటీ ఇచ్చారు. సమంత ప్రెగ్నెన్సీ వార్తల పై త్వరలో మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.

జర్నలిస్ట్ ఫోటో మార్ఫింగ్ చేసిన వారిని శిక్షించాలి: DMJU
మహిళా జర్నలిస్టు ఫోటోను మార్ఫింగ్ చేసి, అసభ్యకరంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయాన్ని ఖండిస్తున్నట్లు డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్(DMJU) రాష్ట్ర అధ్యక్షులు కే.రాజేంద్రప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డు అశోక్ తెలిపారు. హైదరాబాద్‌లో CJP నిర్వహించిన సమావేశాన్ని వార్త కవరేజ్ చేయడానికి వెళ్లిన మహిళా జర్నలిస్టును లక్ష్యంగా చేసుకుని ఆమె ఫోటోలను మార్చి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం సరికాదన్నారు. ఫోటోను మార్ఫింగ్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇవాళ్టి గోల్డ్ రేట్స్.. పెరిగాయా? తగ్గాయా?
బంగారం కొనాలనుకునే వాళ్లకు గుడ్ న్యూస్. గత రెండు రోజులుగా గోల్డ్ రేట్స్ పెద్దగా మారకుండా స్టడీగా సాగుతున్నాయి. వెస్ట్ ఆసియాలో టెన్షన్స్ తగ్గడమే దీనికి మెయిన్ రీజన్. ఇవాళ (జూన్ 18) హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,090 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,38,490 గా ఉంది. రేట్లు ఎప్పుడైనా మారొచ్చు, సో షాపింగ్‌కి వెళ్లే ముందు ఒకసారి ప్రైస్ చెక్ చేసుకోండి.