← Back to news

రౌడీషీటర్ మిస్సింగ్ కేసులో సీఐపై వేటు

By DeeKee· 16 Jun 2026· Dishadaily· విజయవాడ
రౌడీషీటర్ మిస్సింగ్ కేసులో సీఐపై వేటు

AP: విజయవాడలో రౌడీషీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. తన కొడుకు ఎక్కడున్నాడో చెప్పాలని పోలీసులను ఎంత వేడుకున్నా స్పందించడం లేదని సాయికృష్ణ తల్లి మీడియా ఎదుట విలపించింది. తన ఫోన్ లాక్కొని కొడుకు ఫొటోలు డిలీట్ చేశారని ఆమె ఆరోపించారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నగర CP రాజశేఖర్ బాబు స్పందించి, ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక CI నాగరాజును వీఆర్‌కు పంపించారు. మరోవైపు ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ నెల 29న సాయికృష్ణను కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది.

More in Politics