Latest

గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై ఘోర విషాదం
Local· 27 Aug 2026

గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై ఘోర విషాదం

TG: గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కేఎం బంజర్‌ సమీపంలో రహదారిపై నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి వచ్చిన డీసీఎం వాహనం బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు డీసీఎం క్యాబిన్‌ పూర్తిగా దెబ్బతినడంతో డ్రైవర్‌ అందులోనే చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పెనుబల్లి పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌ను బయటకు తీశారు. మృతుడిని మహారాష్ట్రకు చెందిన నవనీత్‌ గా గుర్తించారు.

చేయూత పెన్షన్‌కు 31 చివరి గడువు: MPDO
Local· 27 Aug 2026

చేయూత పెన్షన్‌కు 31 చివరి గడువు: MPDO

TG: చేయూత పెన్షన్‌కు అర్హులైన వారు ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల ఎంపీడీవో అబ్దుల్ సయీద్‌ ఖాన్‌ సూచించారు. గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులను స్వీకరించే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేయూత పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్‌ అందించేందుకు ప్రక్రియ కొనసాగుతోంది. పాత ఫైళ్లను పంచాయతీల సమన్వయంతో అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ సుమారు 80 శాతం పూర్తయిందని ఎంపీడీవో తెలిపారు.

నేపాల్‌లో వరదలు.. ఏపీ సర్కార్ అలర్ట్!
AP· 27 Aug 2026

నేపాల్‌లో వరదలు.. ఏపీ సర్కార్ అలర్ట్!

AP: నేపాల్‌లో భారీ వరదలతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. అక్కడ ఏపీకి చెందిన వారు ఎవరైనా చిక్కుకున్నారా? అనే దానిపై అధికారులు అప్‌డేట్‌ తీసుకుంటున్నారు. బాధితులను గుర్తించి సేఫ్ ప్లేస్‌కు తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని CM చంద్రబాబు ఆదేశించారు. కేంద్రంతో కోఆర్డినేట్ చేస్తూ సాయం అందించాలని సూచించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG) ద్వారా పరిస్థితిని మానిటర్ చేయాలని చెప్పారు. దిల్లీలోని ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. హెల్ప్‌లైన్: 011-23384016, 011-23387089, వాట్సాప్: 9059824101

నవజాత శిశువు మృతి..  ఆస్పత్రి వద్ద ఆందోళన
Local· 27 Aug 2026

నవజాత శిశువు మృతి.. ఆస్పత్రి వద్ద ఆందోళన

TG: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం మాతా శిశు కేంద్రంలో నవజాత శిశువు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ములకలపల్లికి చెందిన విజయలక్ష్మికి పాప జన్మించగా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో కుటుంబసభ్యులు చికిత్స కోసం శిశువును మాతా శిశు కేంద్రానికి తీసుకొచ్చారు. అయితే వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే పాప మృతి చెందిందని కుటుంబసభ్యులు ఆరోపించారు. తమ పాప మృతికి బాధ్యులైన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మదర్‌ థెరిసా సేవలు అందరికీ స్ఫూర్తిదాయకం
Local· 27 Aug 2026

మదర్‌ థెరిసా సేవలు అందరికీ స్ఫూర్తిదాయకం

AP: సేవా మార్గంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మదర్‌ థెరిసా జయంతి వేడుకలను గుత్తి పెన్షనర్స్‌ భవనంలో ఘనంగా నిర్వహించారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని పెన్షనర్స్‌ భవనంలో అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ స్వర్ణాంబ, కోశాధికారి జెన్నే కుల్లాయిబాబు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. తొలుత మదర్‌ థెరిసా చిత్రపటానికి కోశాధికారి జెన్నే కుల్లాయిబాబు, సెక్రటరీ రామ్‌మోహన్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలు, ఆకలితో అలమటించే వారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మదర్‌ థెరిసా అందించిన సేవలను గుర్తుచేశారు.

పులివెందులలో దొంగల ముఠా అరెస్ట్
Local· 27 Aug 2026

పులివెందులలో దొంగల ముఠా అరెస్ట్

AP: కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఏడు బైక్‌లతో పాటు ఆలయం వద్ద నిల్వ ఉంచిన ఇనుప సామగ్రి చోరీకి గురైనట్లు ఫిర్యాదులు అందాయని తెలిపారు. కేసులపై దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ.7 లక్షల విలువైన బైకులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే చోరీ చేసిన ఇనుప సామగ్రిని విక్రయించగా వచ్చిన రూ.1 లక్ష నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ శ్రీరామ్‌ తెలిపారు.

గోల్డ్, సిల్వర్ రేట్‌లో నో చేంజ్.. ఇవాళ ధరలు ఇవే!
Infotainment· 27 Aug 2026

గోల్డ్, సిల్వర్ రేట్‌లో నో చేంజ్.. ఇవాళ ధరలు ఇవే!

వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు స్టేబుల్‌గా ఉన్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, గురువారం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.1,63,740 కాగా, 22 క్యారెట్ల 10 గ్రా. ఆర్నమెంటల్ గోల్డ్ రేట్ రూ.1,50,090గా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.2,64,900గా నమోదైంది. అయితే గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి కొనే ముందు మార్కెట్‌లో ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్.

B-Pharmacy, Pharma-D కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ రిలీజ్
Education· 27 Aug 2026

B-Pharmacy, Pharma-D కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ రిలీజ్

TG: రాష్ట్రంలో ఎప్‌సెట్-ఎంపీసీ స్ట్రీమ్‌ అభ్యర్థులకు B-Pharmacy, Pharma-D కౌన్సెలింగ్‌కు షెడ్యూల్ డేట్స్ రిలీజ్ అయ్యాయి. సెప్టెంబరు 3, 4 తేదీల్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. సెప్టెంబరు 6లోపు సీట్ల అలాట్‌మెంట్ ఉంటుంది. సీటు వచ్చినవాళ్లు సెప్టెంబరు 7లోపు ఆన్‌లైన్‌లో ఫీజు పే చేసి, సెప్టెంబరు 8లోపు అలాట్ చేసిన కాలేజీలో రిపోర్ట్ చేయాలి. ఇప్పటికే ఇంజినీరింగ్ కాలేజీలో జాయిన్ అయిన వారు ఈ కౌన్సెలింగ్‌కు అనర్హులని తెలిపారు.

పాడేరు ITDA గేటు వద్దే విద్యార్థుల నిద్ర, నిరసన
Local· 27 Aug 2026

పాడేరు ITDA గేటు వద్దే విద్యార్థుల నిద్ర, నిరసన

AP: పాఠశాల నుంచి తమను బలవంతంగా పంపించడాన్ని నిరసిస్తూ గిరిజన విద్యార్థులు, తల్లిదండ్రులు పాడేరు ITDA గేటు వద్ద నిద్రిస్తూ ఆందోళన చేపట్టారు. విశాఖపట్నంలోని మారికవలస గురుకులం స్కూల్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీలో 5, 6, 7, 8 తరగతులు చదువుతున్న 480 మంది గిరిజన విద్యార్థులను పాఠశాల నుంచి పంపించారని తల్లిదండ్రులు ఆరోపించారు. సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ ప్రారంభిస్తామంటూ విద్యార్థులు, తల్లిదండ్రులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా పోలీసుల సమక్షంలో విద్యార్థులను బయటకు పంపించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయవాడకు చేరుకున్న ఐషీ ఘోష్‌
AP· 27 Aug 2026

విజయవాడకు చేరుకున్న ఐషీ ఘోష్‌

AP: ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద జరిగిన ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న JNUSU మాజీ అధ్యక్షురాలు ఐషీ ఘోష్‌ విజయవాడకు చేరుకున్నారు. SFI రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గురువారం విజయవాడ గవర్నర్‌పేటలోని MBVK ఆడిటోరియంలో ‘జెన్‌ జీ.. ఇకపై నిశ్శబ్దం ఉండదు’ అనే అంశంపై సెమినార్‌ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఐషీ ఘోష్‌ పాల్గొని ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద జరిగిన పోరాటాల్లో తన ప్రత్యక్ష అనుభవాలను విద్యార్థులతో పంచుకోనున్నారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఐషీ ఘోష్‌కు SFI నాయకులు స్వాగతం పలికారు.

వరల్డ్‌వైడ్‌గా అమెరికా వీసా Appointments నిలిపివేత
Politics· 27 Aug 2026

వరల్డ్‌వైడ్‌గా అమెరికా వీసా Appointments నిలిపివేత

వరల్డ్‌వైడ్‌గా అమెరికా వీసా ఇంటర్వ్యూ అప్పాయింట్‌మెంట్స్‌ను టెంపరరీగా నిలిపివేశారు. ‘పబ్లిక్‌ చార్జ్‌’ రూల్ కింద అప్లికెంట్స్‌పై మరింత స్ట్రిక్ట్‌గా స్క్రీనింగ్ చేసేందుకు కాన్సులర్‌ అధికారులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే షెడ్యూల్‌ చేసిన ఇంటర్వ్యూలను రీషెడ్యూల్‌ చేస్తున్నారు. అప్లికెంట్స్‌కు 'మీ అప్పాయింట్‌మెంట్‌ డేట్, టైమ్ మరలా మీకు తెలియచేస్తాం’ అంటూ మెయిల్స్‌ వెళ్లినట్లు తెలుస్తోంది. H-1B వీసాపై భారీ ఫీజు ప్రపోజల్ వచ్చిన నెక్స్ట్ డే ఈ నిర్ణయం తీసుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది.

మహిళా ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు కావాలి
Local· 27 Aug 2026

మహిళా ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు కావాలి

AP: మహిళా ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, సబ్సిడీ రుణాలతో ఆటోలు అందించాలని తిరుపతి జిల్లా సీఐటీయూ ఆటో యూనియన్‌ నూతన జిల్లా సహాయ కార్యదర్శి పి. దీప డిమాండ్‌ చేశారు. పుత్తూరులో జరిగిన ఆటో యూనియన్‌ సమావేశంలో నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. రేణిగుంట మండలానికి చెందిన పి. దీపను జిల్లా సహాయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా అనేక మంది మహిళలు ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు.

నిరుపేదలకు అండగా వెల్‌ విషర్‌ ట్రస్ట్‌
Local· 27 Aug 2026

నిరుపేదలకు అండగా వెల్‌ విషర్‌ ట్రస్ట్‌

AP: మదర్‌ థెరిసా స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు అండగా నిలవడం అభినందనీయమని మంగళగిరి మున్సిపల్‌ కమిషనర్‌ అలీమ్‌ బాషా అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి బాప్టిస్ట్‌పేటలో వెల్‌ విషర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రథమ వార్షికోత్సవాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు, నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. షైన్‌ ఆశ్రమానికి రూ.10 వేల ఆర్థికసాయం అందించారు. వికలాంగుల విద్యకోసం మరో రూ.8వేల సహాయాన్ని అందజేశారు.

Fanta నుంచి Maggi వరకు.. దేశానికో ఫార్ములా!
International· 27 Aug 2026

Fanta నుంచి Maggi వరకు.. దేశానికో ఫార్ములా!

ఒకే బ్రాండ్.. కానీ దేశం మారితే రుచి, పదార్థాలు కూడా ఎందుకు మారిపోతాయి? లండన్‌లో దొరికే Fantaతో పోలిస్తే భారత్‌లో అమ్మే Fantaలో చక్కెర దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉందని తాజా రిపోర్ట్ చెబుతోంది. భారత్‌లో సాధారణ KitKatలో కోకో 4.5% ఉండగా, ఆస్ట్రేలియా వెర్షన్‌లో కనీసం 22% ఉంది. అలాగే భారత్‌లోని Maggiలో పామ్ ఆయిల్ వాడుతుండగా, బ్రిటన్‌లోని కొన్ని వెర్షన్లలో సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారు. రుచి, ధర, స్థానిక రూల్స్, అక్కడి మార్కెట్‌కు తగ్గట్టుగా కంపెనీలు ఫార్ములాను మార్చడం వల్లే ఈ తేడాలు వస్తున్నాయి.

బర్త్‌డే పార్టీ నుంచి వస్తుండగా ఘోర ప్రమాదం
AP· 27 Aug 2026

బర్త్‌డే పార్టీ నుంచి వస్తుండగా ఘోర ప్రమాదం

AP: పల్నాడు జిల్లాలో ఈరోజు ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్‌ వద్ద ఆటోను ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఏడుగురు స్పాట్‌లో మరణించారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో గుంటూరు GGHకు తీసుకెళ్లారు. మృతులంతా వేలూరు గ్రామస్థులుగా పోలీసులు గుర్తించారు. ప్రకాశం జిల్లా కొండమంజులూరులో జరిగిన బర్త్‌డే పార్టీకి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు బుక్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

బావిలో పడిన యువతి.. కాపాడిన కానిస్టేబుల్
Local· 27 Aug 2026

బావిలో పడిన యువతి.. కాపాడిన కానిస్టేబుల్

TG: ప్రమాదంలో చిక్కుకున్న ఓ దివ్యాంగ యువతికి కానిస్టేబుల్ దిలీప్ ఆపద్బాంధవుడిగా నిలిచారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఎపూర్ గ్రామంలో ఓ దివ్యాంగ యువతి ప్రమాదవశాత్తు చేతిబావిలో పడిపోయింది. విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ దిలీప్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా బావిలోకి దిగారు. లోతులో ఉన్న యువతి వద్దకు చేరుకుని, తాళ్ల సహాయంతో ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సమయస్ఫూర్తితో స్పందించి సాహసోపేతంగా వ్యవహరించడంతో యువతి ప్రాణాలు దక్కాయి.

ల్యాబ్‌లో పెంచిన మెదడు కణాలు
Technology· 27 Aug 2026

ల్యాబ్‌లో పెంచిన మెదడు కణాలు

మనిషి మెదడును ల్యాబ్‌లో ఏళ్ల తరబడి పెంచగలరా? సైంటిస్టులు మనిషి స్టెమ్ సెల్స్‌తో తయారు చేసిన చిన్న మెదడు కణాల సమూహాలను దాదాపు 7 ఏళ్ల పాటు ల్యాబ్‌లో పెంచారు. ఇవి పూర్తి మనిషి మెదడు కాదు.. కానీ మెదడులోని కణాలు కాలంతో ఎలా మారుతాయో తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఏళ్లు గడిచేకొద్దీ ఈ కణాల్లో సహజమైన మెదడు ఎదుగుదలను పోలిన మార్పులు కనిపించాయి. దీంతో మెదడు ఎలా అభివృద్ధి చెందుతుంది, కొన్ని వ్యాధులు ఎలా మొదలవుతాయో అర్థం చేసుకోవడానికి కొత్త దారి కనిపించొచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు.

బౌద్ధం, కళలతో శతాబ్దాల బంధం: మంత్రి జూపల్లి
International· 27 Aug 2026

బౌద్ధం, కళలతో శతాబ్దాల బంధం: మంత్రి జూపల్లి

తెలంగాణ–శ్రీలంక మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు సాంస్కృతిక మార్పిడిని విస్తరించాల్సిన అవసరం ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బౌద్ధం, సంస్కృతి, కళలు ఇరు ప్రాంతాల మధ్య శతాబ్దాల అనుబంధానికి ప్రతీకలని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన నృత్యాంగణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన శ్రీలంక కళాకారుల బృందం సచివాలయంలో మంత్రిని కలిసింది. ఈ సందర్భంగా కళాకారులను మంత్రి సన్మానించారు. శ్రీలంక సంప్రదాయ నృత్యాలను తెలంగాణలో ప్రదర్శించడం అభినందనీయమని అన్నారు.

ఘోర ప్రమాదం.. ఆరుగురు Spot Dead
AP· 27 Aug 2026

ఘోర ప్రమాదం.. ఆరుగురు Spot Dead

AP: విజయవాడ నుంచి తిరుపతి వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, చిలకలూరిపేట దగ్గర్లో ఓ ఆటోను బలంగా ఢీకొట్టింది. ఆటో డ్రైవర్ సడెన్‌గా టర్న్ తీసుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జవడంతో అందులో ఉన్న ఆటో డ్రైవర్ బాబు, మణెమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మీ గంగమ్మ, మరియమ్మ, సువార్తమ్మ మరణించారు. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్లని హాస్పిటల్‌కి తరలించారు.

CM స్పందించకుంటే సెక్రటేరియట్‌ను ముట్టడిస్తాం: హరీశ్‌రావు
TG· 27 Aug 2026

CM స్పందించకుంటే సెక్రటేరియట్‌ను ముట్టడిస్తాం: హరీశ్‌రావు

TG: పదేళ్ల KCR పాలన ప్రజలే కేంద్రంగా సాగితే.. ప్రస్తుత రేవంత్‌ పాలన మాత్రం భూములే కేంద్రంగా సాగుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. హైదరాబాద్‌ KPHBలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రజల ఆస్తులను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫైరయ్యారు. 22ఏ జాబితా నుంచి భూములను తొలగించకపోతే వచ్చే అసెంబ్లీ సమావేశాలను స్తంభింపజేస్తామని, CM స్పందించకుంటే సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. రేవంత్ ప్రభుత్వం రూ.30వేల కోట్ల విలువైన భూములు విక్రయించిందని ఆరోపించారు.

సీనియర్ నటుడు నారాయణరావు కన్నుమూత
Entertainment· 27 Aug 2026

సీనియర్ నటుడు నారాయణరావు కన్నుమూత

సీనియర్ నటుడు, నిర్మాత నారాయణరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న అర్ధరాత్రి హైదరాబాద్‌లో మరణించారు. చెన్నై ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో రజినీకాంత్‌తో కలిసి చదువుకున్న నారాయణరావు 'అంతులేని కథ', 'నాలాగా ఎందరో', 'ఒక ఊరి కథ', 'గణేష్' లాంటి అనేక సినిమాల్లో యాక్ట్ చేశారు. చిరంజీవి హీరోగా 'దేవాంతకుడు', 'యముడికి మొగుడు' సినిమాలను ప్రొడ్యూస్ చేశారు.