ఫోర్జరీ లెటర్ వివాదం, దినకరన్ నోరు మూయించిన TVK
తమిళనాడు పాలిటిక్స్‌లో ఇప్పుడు ఫోర్జరీ లెటర్ వివాదం హాట్ టాపిక్ గా మారింది. AMMK చీఫ్ TTV దినకరన్.. విజయ్ పార్టీ TVKపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఎమ్మెల్యే కామరాజ్ మద్దతు ఇచ్చినట్టు నకిలీ లేఖ తయారు చేసి గవర్నర్‌కు చూపించారంటూ ఆరోపించారు. అయితే TVK దినకరన్ ఆరోపణలకి గట్టి షాక్ ఇచ్చింది. AMMK ఎమ్మెల్యే కామరాజ్ స్వయంగా మద్దతు లేఖపై సంతకం చేస్తున్న వీడియోను విడుదల చేసి దినకరన్ నోరు మూయించింది. మేము ఎవరితోనూ బేరసారాలు ఆడాల్సిన అవసరంలేదంటూ విజయ్ టీమ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.



