← Back to news

మరీనా బీచ్ పై విజయ్ ప్రభావం!

By Subhash· 8 May 2026· Instagram· Chennai

తమిళనాడులో పొలిటికల్ హీట్ పెరిగింది. టీవీకే (TVK) అధినేత విజయ్ ప్రమాణ స్వీకారంపై కొనసాగుతున్న సందిగ్ధత నేపథ్యంలో, చెన్నై పోలీసులు మెరీనా బీచ్ వద్ద భారీగా మోహరించారు. గవర్నర్ నుంచి ఆహ్వానం అందడంలో జాప్యం జరుగుతుండటంతో, ఆగ్రహించిన అభిమానులు మెరీనా బీచ్ వద్ద నిరసనలు తెలిపే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. బీచ్ కి వెళ్లే దారులను బారికేడ్లతో మూసివేసి, ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారు. మెరీనా తీరం ఇప్పుడు పోలీసుల పహారాలో ఉంది.

More in Politics