IUML యూటర్న్.. విజయ్ ప్రమాణ స్వీకారంపై సస్పెన్స్

తమిళనాడులో సీఎం కుర్చీపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. వరుసగా మూడోసారి గవర్నర్‌ను కలిసిన నటుడు విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి క్లెయిం చేసినా.. ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. TVKకు 5 సీట్లున్నbకాంగ్రెస్ , 4 సీట్లున్న వామపక్షాల మద్దతు లేఖలు ఉన్నాయి. 2 సీట్లు ఉన్న వీసీకే ఇవాళ మద్దతు లేఖ ఇస్తామని చెప్పింది. మరోవైపు ఐయూఎంఎల్ మొదట మద్దతు ఇస్తామని చెప్పి ఆ తర్వాత యూ టర్న్ తీసుకుంది. దీంతో విజయ్ పార్టీకి మేజిక్ ఫిగర్ 118 ఇంకా లభించలేదు. విజయ్ ఎప్పటికి సీఎం అవుతాడాని అభిమానులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు.



