బెంగాల్ సీఎంగా సువేందు ప్రమాణం.. కొలువు దీరిన బీజేపీ తొలి సర్కార్

పశ్చిమ బెంగాల్ లో తొలి బీజేపీ సర్కార్ ఏర్పడింది. సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. కోల్ కతా బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్స్ లో అంగరంగవైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు తదితరులు హాజరయ్యారు. 55 ఏళ్ల సువేందు అధికారి కాంగ్రెస్ కేంద్ర మాజీ మంత్రి శిశిర్ అధికారి కుమారుడు. రాజకీయ నేపథ్యం ఉండడంతో యువకుడిగా ఉన్నప్పుడే కాంగ్రెస్ లో చేరారు. తర్వాత టీఎంసీలో చేరి మమత కుడి భుజంగా ఉన్నారు. 2020లో బీజేపీలో చేరి ఆరేళ్లలోనే ఆ పార్టీని విజయానికి దగ్గర చేశారు.



