Latest

UPIకి 10 ఏళ్లు.. జేబులో డబ్బు ఎందుకు తగ్గిపోయింది?
National· 26 Aug 2026

UPIకి 10 ఏళ్లు.. జేబులో డబ్బు ఎందుకు తగ్గిపోయింది?

ఒకప్పుడు టీ తాగాలన్నా జేబులో క్యాష్ ఉందా అని చూసుకునేవాళ్లం.. ఇప్పుడు షాప్‌లో QR కోడ్ ఉందా అని చూస్తున్నాం! 2016లో మొదలైన UPI పదేళ్లలో మన పేమెంట్ అలవాట్లనే మార్చేసింది. మొదటి ఏడాది 1.78 కోట్లుగా ఉన్న లావాదేవీలు.. 2025-26లో ఏకంగా 24,162 కోట్లకు చేరాయి. అంటే రోజుకు సగటున 66 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. క్యాష్ వెంట తీసుకెళ్లడం తగ్గిపోయింది.. ఇప్పుడు పర్సు మర్చిపోయినా పర్లేదు, ఫోన్ మాత్రం మర్చిపోకూడదనే పరిస్థితి వచ్చింది. మన చేతిలో ఉన్న డబ్బు కన్నా.. ఫోన్‌పైనే నమ్మకం పెరిగిపోయింది!

బస్సు-కంటైనర్ ఢీ.. క్షణాల్లో మారిపోయిన ప్రయాణం
TG· 26 Aug 2026

బస్సు-కంటైనర్ ఢీ.. క్షణాల్లో మారిపోయిన ప్రయాణం

TG: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు రోడ్డుపై ఆగి ఉన్న కంటైనర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారణం డ్రైవర్‌ నిర్లక్ష్యమా, అతివేగమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

మూసీ పనుల్లో వేగం పెంచాలి: రేవంత్‌ రెడ్డి
TG· 26 Aug 2026

మూసీ పనుల్లో వేగం పెంచాలి: రేవంత్‌ రెడ్డి

TG: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు రెండోదశ పనులను వేగంగా ప్రారంభించేందుకు CM రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. మూసీ ప్రాజెక్టుపై CM సమీక్ష నిర్వహించారు. నాగోల్‌ నుంచి గౌరెల్లి వరకు వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు అధికంగా ఉన్నందున అక్కడ అభివృద్ధి పనులను త్వరగా చేపట్టాలని సూచించారు. అవసరమైన భూమిని గుర్తించేందుకు జిల్లా కలెక్టర్లు సర్వే నిర్వహించాలని, HMDA విధానంలో భూసమీకరణ చేపట్టాలని ఆదేశించారు. FTL, బఫర్‌జోన్, అసైన్డ్‌ భూముల విషయంలో చట్టపరమైన సమస్యలు రాకుండా స్పష్టమైన విధానం రూపొందించాలన్నారు.

గ్రీన్ ఎనర్జీ  రంగంతో APకి కొత్త శకం: మంత్రి లోకేశ్
AP· 26 Aug 2026

గ్రీన్ ఎనర్జీ రంగంతో APకి కొత్త శకం: మంత్రి లోకేశ్

పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో నంబర్ వన్‌గా నిలపాలన్న లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హులికెరలో రూ.10వేల కోట్ల పెట్టుబడితో సుజ్లాన్ సంస్థ ఏర్పాటు చేయనున్న 1,325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రాయదుర్గం, ఉరవకొండ, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. గ్రీన్ ఎనర్జీ రంగంలో యువతకు ఉపాధి కల్పించేందుకు ఉరవకొండ, విజయవాడలో స్కిల్ సెంటర్స్ ఏర్పాటు చేశామన్నారు.

తెలంగాణ టూరిజంపై CS మాస్టర్ ప్లాన్
Sports· 26 Aug 2026

తెలంగాణ టూరిజంపై CS మాస్టర్ ప్లాన్

తెలంగాణ టూరిజాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్తరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సచివాలయంలో పర్యాటక రంగంపై CS అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికే 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను గుర్తించామని, వాటిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Alarm మోగగానే Snooze కొడుతున్నారా..?
Education· 25 Aug 2026

Alarm మోగగానే Snooze కొడుతున్నారా..?

అలారం మోగింది.. “ఇంకో 5 మినిట్స్” అంటూ స్నూజ్ కొడుతున్నారా..? 😴 ఒక్కసారి కాదు.. మళ్లీ మళ్లీ స్నూజ్ చేస్తుంటే నిద్ర పదే పదే డిస్టర్బ్ అవుతుంది. దీంతో లేచిన తర్వాత కూడా మత్తుగా, ఫ్రెష్‌గా లేనట్టు అనిపించొచ్చు. అయితే స్నూజ్ చేయడం ప్రతి ఒక్కరికీ హానికరమే అని చెప్పడానికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదు. రెగ్యులర్‌గా సరిపడా నిద్రపోవడం, ప్రతిరోజూ ఒకే టైమ్‌కు లేవడం బెటర్. అలారం రోజూ మీతో “ఇంకో 5 మినిట్స్” యుద్ధం చేస్తుంటే.. అసలు మీ స్లీప్ టైమ్‌నే చెక్ చేయాల్సిన టైమ్ కావచ్చు!

Social Battery అంటే ఏంటి?
Education· 25 Aug 2026

Social Battery అంటే ఏంటి?

ఫ్రెండ్స్‌తో ఔటింగ్, పార్టీ లేదా ఫంక్షన్‌కి వెళ్లాక.. “ఇంక చాలు, ఇంటికి వెళ్లాలి” అనిపిస్తుందా? దీన్నే చాలామంది “సోషల్ బ్యాటరీ అయిపోయింది” అంటారు. అంటే నిజంగా బ్యాటరీ అయిపోవడం కాదు. ఎక్కువసేపు జనాలతో మాట్లాడటం, సోషల్ ఈవెంట్స్‌లో ఉండటం వల్ల మెంటల్‌గా అలసిపోయి, కొంతసేపు ఒంటరిగా ఉండాలనిపించడం. ఇది ఇంట్రోవర్ట్స్‌లో ఎక్కువగా కనిపించినా, ఎవరికైనా ఇలా అనిపించొచ్చు. కొద్దిసేపు ప్రశాంతంగా గడిపితే మళ్లీ ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఫోన్‌కి ఛార్జర్ ఎలా అవసరమో.. కొన్నిసార్లు మనకూ “మన Time” అంతే అవసరం!

ప్రభుత్వ పనుల్లో AI.. ఇక మరింత పెరగనుందా?
National· 25 Aug 2026

ప్రభుత్వ పనుల్లో AI.. ఇక మరింత పెరగనుందా?

ఇక ప్రభుత్వ పనుల్లో AI ఒక ప్రయోగంగా కాకుండా.. రోజువారీ పనుల్లోనూ కనిపించబోతోందా? కేంద్రం డిజిటల్ ఇండియా ప్రాజెక్టుల కోసం మరిన్ని AI, మెషిన్ లెర్నింగ్ భాగస్వాములను చేర్చుకునే ప్రక్రియను మళ్లీ ప్రారంభించింది. ఇప్పటికే ఎంపిక చేసిన సంస్థలతో పాటు టెక్ కంపెనీలను తీసుకురావడం దీని ఉద్దేశం. క్యాబినెట్ నోట్స్‌ను సారాంశం చేయడం, ముఖ గుర్తింపుతో హాజరు నమోదు, డిజిలాకర్‌లో AI ఆధారిత సేవలు వంటి పనులకు ఈ టెక్నాలజీని ఉపయోగించే అవకాశం ఉందని టెండర్‌లో పేర్కొన్నారు.

Bitcoin మళ్లీ $80,000 దాటింది!
Personal Finance· 25 Aug 2026

Bitcoin మళ్లీ $80,000 దాటింది!

Bitcoin ఒక్కసారిగా మళ్లీ స్పీడ్ పెంచింది! ఆగస్టు 25న తొలిసారి మే తర్వాత $80,000 మార్క్‌ను దాటింది. గత వారం రోజుల్లోనే దాదాపు 25% పెరిగింది. అమెరికా Treasury దీర్ఘకాలిక బాండ్లను ఎక్కువగా కొనుగోలు చేయబోతోందన్న వార్తలతో డాలర్ బలహీనపడొచ్చనే భయాలు పెరిగాయి. దీంతో కొందరు Investors Bitcoin, Gold వైపు మళ్లారు. మరోవైపు అమెరికాలో Cryptoకి సంబంధించి కొత్త, అనుకూలమైన రూల్స్ వస్తాయన్న అంచనాలు కూడా ఈ పెరుగుదలకు మరింత బలాన్నిచ్చాయి. దీంతో కొనుగోళ్లు ఒక్కసారిగా పెరగడం Bitcoin ర్యాలీకి మరింత ఊపునిచ్చింది.

16లోపు పిల్లలకు Social Media కట్?
International· 25 Aug 2026

16లోపు పిల్లలకు Social Media కట్?

పిల్లలకు ఫోన్ ఇవ్వొచ్చు.. కానీ Social Media మాత్రం వద్దంటోంది న్యూజిలాండ్! 16 ఏళ్లలోపు పిల్లలు Instagram, TikTok, Facebook లాంటి Social Media వాడకుండా కొత్త బిల్లు తీసుకొస్తోంది అక్కడి ప్రభుత్వం. రోజూ గంటల తరబడి Social Mediaలో ఉండటం వల్ల పిల్లల చదువు, నిద్ర, కుటుంబ జీవితం, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని ప్రభుత్వం చెబుతోంది. రూల్ పాటించని కంపెనీలకు ప్రపంచ ఆదాయంలో 10% వరకు ఫైన్ వేయాలని ప్రతిపాదించారు. అయితే ఈ రూల్‌పై రాజకీయంగా వ్యతిరేకత కూడా ఉంది.

🏸గాయత్రి, త్రిసాని అభినందించిన CM రేవంత్
Local· 25 Aug 2026

🏸గాయత్రి, త్రిసాని అభినందించిన CM రేవంత్

TG : వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ ఉమెన్స్ డబుల్స్‌లో కాంస్య పతకం (Bronze Medal) గెలిచిన గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీలను CM రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. కోచ్ పుల్లెల గోపీచంద్, పీవీవీ లక్ష్మితో కలిసి వారు CMని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. మెడల్ సాధించినందుకు వీరికి CM బెస్ట్ విషెస్ చెప్పారు.

🌱 జీవ ఎరువులతో ఖర్చు తక్కువ
Local· 25 Aug 2026

🌱 జీవ ఎరువులతో ఖర్చు తక్కువ

AP : అనంతగిరి మండలం చిలకలగెడ్డ రైతు సేవా కేంద్రంలో ఆత్మ (ATMA) ఆధ్వర్యంలో రైతులకు జీవ ఎరువులపై ట్రైనింగ్ ఇచ్చారు. అరకు ఏడీఏ మోహనరావు, ఏఓ రంగారావు పాల్గొని జీవ ఎరువుల రకాలు, వాటిని ఎలా వాడాలి, వచ్చే లాభాలను వివరించారు. ఈ ఎరువులు వాడితే నేల సారం పెరిగి పంట ఖర్చు తగ్గుతుందని చెప్పారు. కెమికల్ ఎరువులు తగ్గించి, ఇష్టంగా ఆర్గానిక్ పద్ధతులు పాటించాలని రైతులకు ఆఫీసర్లు సలహా ఇచ్చారు.

హాస్పిటల్‌లో తాగే నీళ్ల దగ్గరే తిరుగుతున్న కుక్కలు🐕
Local· 25 Aug 2026

హాస్పిటల్‌లో తాగే నీళ్ల దగ్గరే తిరుగుతున్న కుక్కలు🐕

TG : జగిత్యాల జిల్లా మెట్‌పల్లి గవర్నమెంట్ హాస్పిటల్‌లో పారిశుద్ధ్యం, సెక్యూరిటీ బాలేదని రోగులు ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్‌లో వీధి కుక్కలు తిరుగుతూ భయపెడుతున్నాయి. చివరకు పేషెంట్లు తాగే వాటర్ ట్యాంక్ దగ్గరే కుక్కలు తిరుగుతున్న ఫొటోలు బయటపడ్డాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉందని జనాలు భయపడుతున్నారు. అధికారులు రోజూ చూస్తున్నా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

📄 ఒరిజినల్ సర్టిఫికెట్లు మిస్సింగ్.. దొరికితే హెల్ప్ చేయండి
Local· 25 Aug 2026

📄 ఒరిజినల్ సర్టిఫికెట్లు మిస్సింగ్.. దొరికితే హెల్ప్ చేయండి

TG : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలానికి చెందిన అగ్గండుల అనిత తన 10వ తరగతి ఒరిజినల్ సర్టిఫికెట్లు పోగొట్టుకున్నారు. నర్సంపేట బస్టాండ్ దగ్గర ఒరిజినల్ TC, Original Memo, Short Memo ఉన్న కవర్ పోయింది. దీనిపై ఇప్పటికే నర్సంపేట పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ చేశారు. ఎవరికైనా ఈ సర్టిఫికెట్స్ దొరికితే వెంటనే నర్సంపేట పోలీస్ స్టేషన్‌లో లేదా సంబంధిత పర్సన్‌కి ఇచ్చి హెల్ప్ చేయాలని కోరుతున్నారు.

📚 నవోదయ విద్యాసంస్థల డెవలప్‌మెంట్‌కు స్పెషల్ ప్లాన్
Local· 25 Aug 2026

📚 నవోదయ విద్యాసంస్థల డెవలప్‌మెంట్‌కు స్పెషల్ ప్లాన్

TG : నాగర్‌కర్నూల్ జవహర్ నవోదయ విద్యాలయంలో స్టూడెంట్స్‌కి బెటర్ ఎడ్యుకేషన్, ఫెసిలిటీస్ అందించేందుకు స్పెషల్ ప్లాన్ రెడీ చేయాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన అడ్వైజరీ కమిటీ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. పాఠశాలకు రోడ్ రిపేర్లు, విద్యార్థుల కోసం 20 కొత్త కంప్యూటర్లు కావాలని ప్రిన్సిపాల్ కోరగా, అన్ని వసతులకు ప్రపోజల్స్ రెడీ చేస్తే జిల్లా యంత్రాంగం నుంచి ఫుల్ సపోర్ట్ ఇస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

🏫 జూనియర్ కాలేజీలో క్లాస్ రూమ్స్ లేవు
Local· 25 Aug 2026

🏫 జూనియర్ కాలేజీలో క్లాస్ రూమ్స్ లేవు

TG : కామారెడ్డి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో 1000 మందికి పైగా స్టూడెంట్స్ చదువుతున్నారు. కానీ సరిపడా రూమ్స్ లేక స్టూడెంట్స్ చెట్ల కింద కూర్చుని చదువుకోవాల్సి వస్తోంది. ఒకే రూమ్‌లో రెండు మూడు కోర్సులు కూర్చుంటూ ఇబ్బందులు పడుతున్నారు. బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేవని మండిపడుతూ SFI, AISA ఆధ్వర్యంలో విద్యార్థులు కాలేజ్ ఎదుట ప్రొటెస్ట్ చేశారు. గవర్నమెంట్, లోకల్ ఎమ్మెల్యే వెంటనే స్పందించి ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని డిమాండ్ చేశారు.

‘మహిళలకు ఫ్రీ బస్’ అంటూ సీఎం గొప్పలు..రియాలిటీ ఇదేనా?
TG· 25 Aug 2026

‘మహిళలకు ఫ్రీ బస్’ అంటూ సీఎం గొప్పలు..రియాలిటీ ఇదేనా?

TG: మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ అని చెప్తూ ఓ వ్యక్తి మాట్లాడిన ఓ వీడియో వైరల్ అవుతోంది. బస్సులో 80 మంది ఉంటే అందులో ఇద్దరే మగవాళ్లు ఉన్నారన్నారు. డిపార్ట్‌మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోందని, ఇలా అయితే డబ్బులెలా తేవాలని ప్రశ్నించారు. మహిళల డెవలప్‌మెంట్ కోసం ప్రభుత్వం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. వాళ్ల టికెట్ల డబ్బులు మేమే చెల్లిస్తున్నామని ఈ మధ్య సీఎం రేవంత్ కూడా గొప్పగా చెప్పారు. కానీ డబ్బులు తెమ్మని ఆర్టీసీ వేధిస్తోందని కొందరు ఇలా అంటున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటి?

🪧 స్కూల్లో టీచర్లు లేరు..
Local· 25 Aug 2026

🪧 స్కూల్లో టీచర్లు లేరు..

TG : వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం బిచ్చాల్ గ్రామంలోని ZPHS హైస్కూల్‌లో నలుగురు, MPPS స్కూల్లో ఇద్దరు టీచర్లు మాత్రమే పనిచేస్తున్నారు. టీచర్ల కొరత వల్ల చదువు దెబ్బతింటోందని 150 మందికి పైగా స్టూడెంట్స్ స్కూల్ గేట్ బయట ప్రొటెస్ట్ చేశారు. MEO ఆఫీస్‌కు వెళ్లి వినతిపత్రం ఇచ్చారు. తమ ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకుని వెంటనే కొత్త టీచర్లను నియమించి, ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

🚰 15 ఏళ్లుగా మంచినీళ్లు లేవు
Local· 25 Aug 2026

🚰 15 ఏళ్లుగా మంచినీళ్లు లేవు

AP : ఏలూరు జిల్లా కట్టుమోతులగూడెంలో తాగునీరు లేక 15 ఏళ్లుగా జనాలు ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ కొళాయిల నుంచి బురద, కలుషిత నీరు రావడంతో పిల్లలు, పెద్దలు రోగాల బారిన పడుతున్నారని గ్రామస్తులు, మహిళలు నిరాహార దీక్ష చేశారు. 300 నుండి 400 ఫ్యామిలీస్ ఉండే ఈ ఊళ్లో కనీసం డ్రైనేజీ కూడా లేదని మండిపడ్డారు. అధికారులు వెంటనే కొత్త బోర్ వేసి మంచినీళ్లు అందించాలని డిమాండ్ చేశారు.

📱 అంగన్‌వాడీలకు డిజిటల్ పాఠాలు
Local· 25 Aug 2026

📱 అంగన్‌వాడీలకు డిజిటల్ పాఠాలు

AP : కాకినాడ జిల్లా శంఖవరంలో అంగన్‌వాడీ సిబ్బందికి 6 రోజులుగా జరుగుతున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఆఖరి రోజున వాట్సాప్, SMS లాంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ఎలా వాడాలో, డిజిటల్ కంటెంట్‌తో పిల్లలకి పాఠాలు ఎలా చెప్పాలో వివరించారు. అలాగే పిల్లల డెవలప్‌మెంట్‌ను చెక్ చేయడం, వారిలోని లోపాలను గుర్తించి పేరెంట్స్‌కి సరిగ్గా ఎలా ఎక్స్‌ప్లేన్ చేయాలో ట్రైనింగ్ ఇచ్చారు. నేర్చుకున్న విషయాలను క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు చేయాలని నిర్ణయించారు.

అక్రమ నిర్మాణాలు ఆపాలి
Local· 25 Aug 2026

అక్రమ నిర్మాణాలు ఆపాలి

AP : కాకినాడ జిల్లా పారుపాక గ్రామంలోని గవర్నమెంట్ ఆఫీసుల దగ్గరున్న ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా కడుతున్న నిర్మాణాలను వెంటనే ఆపేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం కాకినాడ కలెక్టర్‌కు, మంగళవారం స్థానిక MPDOకి దీనిపై వినతిపత్రం ఇచ్చారు. ప్రభుత్వ స్థలాల్లో కుల, మతపరమైన కట్టడాలు కడితే భవిష్యత్తులో గొడవలు జరిగే ఛాన్స్ ఉందని చెప్పారు. అధికారులు వెంటనే రెస్పాండ్ అయి, ఆ ల్యాండ్‌ను కాపాడి అక్రమ కట్టడాలను నిలిపివేయాలని కోరారు.