← Back to news

బండ బాదుడు.. కమర్షియల్ సిలండర్ పై రూ.993 పెంపు

By aravinda nyayapati· 1 May 2026· New Delhi
బండ బాదుడు.. కమర్షియల్ సిలండర్ పై రూ.993 పెంపు

కమర్షియల్ LPG సిలండర్ ధర భారీగా పెరిగింది. 19 కేజీలు ఉండే ఒక్కో సిలండర్ పై రూ.993 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్ లో ఒక్క సిలండర్ ధర రూ. 3,315కి చేరుకుంది. గృహ అవసరాలకు వినియోగించే సిలండర్ ధర మాత్రం పెంచలేదు. అమెరికా, ఇరాన్ యుద్ధంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కమర్షియల్ సిలండర్ ధర పెరిగినా సామాన్యుడి జేబుకు చిల్లు పడినట్టే. చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్, రెస్టారెంట్స్ లో ఫుడ్ బాగా కాస్ట్లీ కానుంది.

More in General