ఈవీఎం ట్యాంపరింగ్ అనుమానాలు.. స్ట్రాంగ్ రూమ్ దగ్గర మమత పహారా
పశ్చిమ బెంగాల్ లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోందన్న ఆరోపణలపై సీఎం మమతా బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగారు. దక్షిణ కోల్‌కతాలో ఈవీఎంలను భద్రపరిచిన సాఖావత్ మెమోరియల్ స్కూల్ దగ్గర గురువారం అర్ధరాత్రి ఆమె మూడు గంటలు పహారా కాశారు. ఆ స్కూల్లో మమత పోటీ చేసిన భవానీపూర్ నియోజకవర్గం ఈవీఎంలను ఉంచారు. అక్కడ పరిస్థితులు పర్యవేక్షించాక మమత మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం తాను జీవితాంతం పోరాటం చేస్తానన్నారు. మమత ఈ స్థాయిలో ఈవీఎంలకు పహారా కాయడం బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.


