ఎల్లుండినుంచి ఉత్తరాంధ్రలో వర్షాలు పడే ఛాన్స్ !!

ఎండలకు మాడిపోతున్న ఉత్తరాంధ్ర వాసులకు శుభవార్త. మే 2వ తేదీ నుండి విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో వర్షాలు పెరుగుతాయని, అదే సమయంలో తిరుపతి, నెల్లూరు, ఒంగోలు దక్షిణ కోస్తా ప్రాంతంలో తీవ్రమైన వడగాల్పులు, అలాగే తూర్పు రాయలసీమ, విజయవాడ, గోదావరి ప్రాంతాలలో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా. నిన్నటి ఉరుములు, వడగళ్ల వాన వాతావరణమే ఈరోజు కూడా కొనసాగుతూ చిత్తూరు, వైఎస్ఆర్ కడప, నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు,సాయంత్రానికి తిరుపతి పశ్చిమ ప్రాంతాలతో పాటు ఉత్తర, మధ్య ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది.



