Latest

పచ్చదనం కోసం అందరూ కదలాలి: ఎస్పీ జానకి షర్మిల
TG: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవంలో భాగంగా సారంగాపూర్ మండలం ఆడెల్లి గ్రామంలో ఎస్పీ మొక్కలు నాటారు. రాష్ట్రవ్యాప్తంగా 16.03 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యంలో ఇప్పటికే 9.06 కోట్ల మొక్కలు నాటినట్లు ఆమె తెలిపారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రజలు వనమహోత్సవంలో భాగస్వాములు కావాలని కోరారు.

వర్షం పడితే ఫ్లైట్స్ ఎందుకు క్యాన్సిల్ అవుతాయి?
వర్షాలు, తుఫాన్ల వల్ల ఢిల్లీలో 26విమానాలు క్యాన్సిల్ అవ్వగా, మరో 15 ప్లేన్స్ డైవర్ట్ అయ్యాయి. నిజానికి మోడర్న్ కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు బ్యాడ్ వాతావరణంలో ప్రయాణించేలా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో డిజైన్ చేస్తారు. పైలట్లకు బయటి విజిబిలిటీ తగ్గినా, కాక్‌పిట్‌లోని ఇన్‌స్ట్రుమెంట్స్ సాయంతో ఫ్లై చేసేలా స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది. విమానం చాలా ఎత్తులో ఉన్నప్పుడు వర్షంతో ప్రాబ్లమ్ ఉండదు. కానీ టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో బ్యాడ్ వెదర్ వల్ల రన్‌వే విజిబిలిటీ తగ్గి ఫ్లైట్ ఆపరేషన్స్ బాగా డిస్టర్బ్ అవుతుంటయి.

'ఇరుముడి’ పాపకి బిగ్ surprise!
'ఇరుముడి' మూవీ సక్సెస్ మీట్ తర్వాత డైరెక్టర్ శివ నిర్వాణ చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్రకు ఒక క్రేజీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. కోలీవుడ్ స్టార్ హీరో, నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్‌తో ఆమెకు వీడియో కాల్ మాట్లాడించారు. సినిమాలో నక్షత్ర పర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయిన ధనుష్, 'ఎప్పుడైనా కలిసినప్పుడు నీ దగ్గర యాక్టింగ్ నేర్చుకోవాలి' అని సరదాగా అభినందించారు. స్టార్ హీరో నుంచి ఇలాంటి కాంప్లిమెంట్ రావడం చూసి నక్షత్ర ఫుల్ హ్యాపీ అయిపోయింది.
భద్రాచలంలో యూత్ కాంగ్రెస్ నాయకుల నిరసన
TG: నీట్ పేపర్ లీకేజీపై నిరసన తెలిపిన విద్యార్థులపై పెలెట్ గన్ దాడిని ఖండిస్తూ భద్రాద్రికొత్తగూడెం జిల్లా యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చీకటి కార్తీక్ ఆధ్వర్యంలో, తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో నిరసన నిర్వహించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

గ్రామాన్ని పచ్చదనంతో నింపేసిన జనం
TG : నిర్మల్ జిల్లా ముధోల్ మండలం చింతాల గ్రామంలో 'వన మహోత్సవం' కార్యక్రమంలో భాగంగా మెగా ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు స్కూల్ ఆవరణతో పాటు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దొడ్డికింది సర్వేశ్, ఉపసర్పంచ్ పీసర సాయినాథ్ గౌడ్, టీచర్లు, స్టూడెంట్స్, ఉపాధి హామీ కూలీలు పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు.

పాడుబడ్డ గదిలో మృతదేహం
AP: సత్యసాయి జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. చిలమతూరు మండలం కనిశెట్టిపల్లి గ్రామ శివారులో NH-44 పక్కన ఉన్న పాడుబడ్డ గదిలో గుర్తుతెలియని వ్యక్తి ఉరివేసుకుని మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. సుమారు రెండు రోజుల క్రితమే కొబ్బరిపీచు తాడుతో ఉరివేసుకుని మృతిచెందినట్లు తెలిపారు. మృతుడు ఎరుపు రంగు టీషర్ట్, నల్ల ప్యాంటు ధరించి ఉన్నాడు. ఘటనాస్థలంలో లభించిన బ్యాగులో షాంపూ, డియో, టూత్‌పేస్ట్ మాత్రమే ఉండగా ఎలాంటి గుర్తింపు కార్డులు లభించలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కాలనీవాసుల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే
TG: ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా మదీనాగూడలో ‘వన్ డే–వన్ వార్డ్’ కార్యక్రమం నిర్వహించారు. మైత్రినగర్ పార్క్‌లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్, కమిషనర్ సృజనతో పాటు అధికారులు పాల్గొన్నారు. మదీనాగూడ, హఫీజ్‌పేట్ ప్రాంతాల కాలనీవాసులతో నేతలు ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. రోడ్లు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ తదితర సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు.
పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు!
AP : విజయనగరం జిల్లా రేగిడి మండలం తునివాడ దగ్గర తమ్మినాయుడు కాలేజీ & స్కూల్ బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఆ టైమ్‌లో బస్సులో 7 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ యాక్సిడెంట్‌లో 9వ తరగతి చదువుతున్న పల్లి మిధున అనే అమ్మాయికి గాయాలవ్వగా, మిగతా పిల్లలంతా సేఫ్‌గా బయటపడ్డారు. బస్సు కండిషన్ అస్సలు బాలేదని ముందే మేనేజ్‌మెంట్‌కి చెప్పానని డ్రైవర్ అంటున్నాడు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పేరెంట్స్ ఊపిరి పీల్చుకున్నారు.

పైలట్లకు డ్రగ్ టెస్ట్ రూల్స్ Strict.. కేంద్రం ప్లాన్
కమర్షియల్ పైలట్లకు ఏడాదికోసారి ర్యాండమ్‌గా డ్రగ్ టెస్టులు చేసేందుకు Proposalను కేంద్రం పరిశీలిస్తోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం మొత్తం పైలట్లలో 10 శాతం మందికి ర్యాండమ్ డ్రగ్ టెస్టులు చేస్తున్నారు. రూల్స్‌ను మరింత స్ట్రిక్ట్ చేయాలని DGCA ఏవియేషన్ కంపెనీలతో చర్చలు జరుపుతోందని సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఇప్పటికే పైలట్లందరికీ కంపల్సరీగా డ్రగ్ టెస్టులు ప్రారంభించాయన్నారు.

అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు
AP: శ్రీకాకుళం జిల్లాలో విద్యార్థులతో వెళ్తున్న ప్రైవేటు స్కూల్ బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. రేగిడి మండలం తునివాడ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్సులో మొత్తం 15 మంది విద్యార్థులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడగా, వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం రాజాం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ పెను ప్రమాదం తప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

పార్కింగ్ పరేషాన్!
TG : వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్‌లో ట్రాఫిక్ కష్టాలు రోజూ ఎక్కువైపోతున్నాయి. అమరవీరుల స్తూపం, అంగడీ సెంటర్, అంబేడ్కర్ జంక్షన్, పాకాల సెంటర్‌తో పాటు మల్లంపల్లి, నెక్కొండ రోడ్లలో వాహనాలను ఎక్కడికక్కడ రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్నారు. దీంతో మెయిన్ రోడ్లలో రాకపోకలు ఆగిపోయి పబ్లిక్, డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు. ఆఫీసర్లు స్పందించి రోడ్డుపై పార్కింగ్‌ను ఆపి, శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

27న కోర్టులకు Special Holiday
TG: రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాలకు ఈ నెల 27న Special Holiday ప్రకటించారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టుతోపాటు జిల్లా కోర్టులు, ఇతర న్యాయస్థానాలు, ట్రిబ్యునళ్లు, లేబర్ కోర్టులకు సెలవు వర్తించనుంది. దీంతో 26, 27, 28వ తేదీల్లో వరుసగా మూడు రోజులు న్యాయస్థానాలకు సెలవులు వచ్చాయి. శనివారం మాత్రం హైకోర్టు పని చేయనుంది.

కుమారుడిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన తల్లి
TG: భూములు సాగు చేసుకుంటున్నా.. తన బాగోగులు పట్టించుకోవడం లేదంటూ ఓ వృద్ధురాలు కలెక్టర్‌ను ఆశ్రయించింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన రాజమ్మ తన పెద్ద కుమారుడు బాబుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చిన్న కుమారుడితో కలిసి కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందజేశారు. తనకు 3.15 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు 36 గుంటల భూమి ఉందని, వాటిని పెద్ద కుమారుడు సాగు చేసుకుంటున్నాడని తెలిపారు. తనను పట్టించుకోవడం లేదని, కుమారుడు, కోడలు తనపై దాడి చేస్తున్నారని ఆరోపించారు.

‘CM అయితే మాకేంటి?’..పాట్నాలో స్టూడెంట్స్ ఉద్యమం
బిహార్‌లో ఉద్యోగావకాశాలు, పరీక్షల్లో అవకతవకలపై వేలాది విద్యార్థులు ఫైర్ అవుతున్నారు. ఇవాళ పాట్నాలో భారీ మార్చ్ నిర్వహించారు. 15 విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గాంధీ మైదానం నుంచి సీఎం సమ్రాట్ చౌదరి అధికార నివాసం వైపు మార్చ్ చేశారు. వీళ్లను అడ్డుకోవడానికి 1,200 మందికి పైగా పోలీసులు వాటర్ కానన్లు, బాంబూ లాఠీలు వాడారు. అడ్డంగా బారికేడ్లు పెట్టారు. అయినా సరే వాటిని దాటుకొని స్టూడెంట్స్ సీఎం ఇంటి వద్దే నిరసన తెలిపారు.

చలాన్ కట్టినా సర్వే కాలేదు.. రైతుల తీవ్ర ఇబ్బందులు
TG: జగిత్యాల జిల్లా బుగ్గారం మండలానికి వెంటనే సర్వేయర్‌ను నియమించాలని తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి ప్రజావాణిలో అధికారులను కోరారు. తన వ్యవసాయ భూమి సర్వే కోసం మీ సేవ ద్వారా ఎఫ్‌లైన్ పిటిషన్ దాఖలు చేసి చలాన్ చెల్లించినా 14 నెలలుగా సర్వే జరగలేదని తెలిపారు. మండలంలోని అనేక మంది రైతులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఎఫ్‌లైన్ పిటిషన్ల ద్వారా చలాన్ చెల్లించిన రైతుల భూములకు కొలతలు నిర్వహించి, చట్టబద్ధంగా హద్దు రాళ్లు ఏర్పాటు చేయాలని ఎంపీడీవో ఎం.సుమంత్‌ను కోరారు.

రైల్వేలో ఉద్యోగాలు.. 1,599 అప్రెంటిస్ పోస్టులు
ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 1,599 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్ట్ 26 నుంచి సెప్టెంబర్ 15, 2026 వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు చేసుకోవచ్చు. 10th క్లాస్‌లో 50 శాతం మార్కులతోపాటు ITIలో Fitter, Welder, Turner, Electrician, Carpenter వంటి ట్రేడ్స్ పూర్తి చేసి ఉండాలి. సెప్టెంబర్ 15 నాటికి ఏజ్ 15–24 ఏళ్ల మధ్య ఉండాలి. General, OBC, EWS మేల్ క్యాండిడేట్స్‌కు రూ.100 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. SC, ST, PwBD, మహిళలకు ఎటువంటి ఫీజు లేదు. మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ <a href="https://www.rrcbbs.org.in/">Click</a> చేయండి.
UPI ట్రాన్సాక్షన్స్ పై మోదీ స్పెషల్ ట్వీట్!
భారత్‌లో UPI సేవలు ప్రారంభమై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా <a href="https://x.com/narendramodi/status/2092092111059660832?s=20">PM మోదీ</a> 'X' లో స్పెషల్ పోస్ట్ చేశారు. ఈ డిజిటల్ సక్సెస్‌పై ప్రతీ ఇండియన్ ప్రౌడ్‌గా ఫీలవ్వాలని అన్నారు. 2016-17లో కేవలం 1.78 కోట్లుగా ఉన్న UPI ట్రాన్సాక్షన్లు, 2025-26 నాటికి 24,162 కోట్లకు రీచ్ అయ్యాయని తెలిపారు. వరల్డ్‌లో జరిగే మొత్తం రియల్-టైమ్ డిజిటల్ ట్రాన్సాక్షన్లలో 50% ఒక్క ఇండియాలోనే జరుగుతున్నాయని, ప్రస్తుతం UPI 11 దేశాల్లో అందుబాటులో ఉందని మోదీ చెప్పారు. అలాగే మీ లైఫ్‌లో UPI తెచ్చిన ఛేంజ్ ఏంటో షేర్ చేయాలని మోదీ కోరారు.

ఐదు కుటుంబాల కుల బహిష్కరణ
TG: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్ తండాలో భూవివాదం నేపథ్యంలో ఐదు కుటుంబాలను కుల బహిష్కరణ చేసినట్లు బాధితులు ఆరోపించారు. తమతో ఎవరైనా మాట్లాడితే రూ.50 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారని, తిరిగి కులంలో చేర్చుకునేందుకు ఒక్కో కుటుంబం రూ. 1 లక్ష చొప్పున మొత్తం రూ. 5 లక్షలు డిమాండ్ చేస్తున్నారన్నారు. పండుగల సందర్భంగా ఆలయానికి కూడా అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Special TET నోటిఫికేషన్ విడుదల..నేటి నుంచి Applications
ఆంధ్రప్రదేశ్‌లో ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం Special Teachers Eligibility Test(Special TET) నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ రిలీజ్ చేసింది. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం..2011కి ముందు అపాయింట్ అయిన సర్వీసు టీచర్లు టెట్ అర్హత సాధించేందుకు ఈ ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇవాళ్టి నుంచి సెప్టెంబర్ 24 వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్ తీసుకుంటారు. ఈ <a href="https://tet2dsc.apcfss.in/">వెబ్‌సైట్</a>లో అప్లై చేసుకోవచ్చు. అక్టోబర్ 11 నుంచి 21 వరకు రెండు విడతల్లో కంప్యూటర్ మీద పరీక్షలు నిర్వహిస్తారు.

రహదారిపై చేరిన వరద.. నిలిచిన రాకపోకలు
AP: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పోలవరం జిల్లాలో గోదావరి, శబరి నదుల్లో ప్రవాహం పెరిగింది. దీంతో వాగులు పొంగి వరదనీరు రహదారులపై ప్రవహిస్తున్నాయి. పోలవరం జిల్లా చింతూరు మండలం సోకిలేరు వాగు పొంగి వరదనీరు రహదారిపై చేరడంతో చింతూరు, వర రామచంద్రపురం మండలాల నడుమ రాకపోకలు నిలిచిపోయాయి. దీంతోపాటు చింతూరు మండలంలోని 11 గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోవడంతో గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కొనసాగుతున్న సాగర్ మాల ప్రాజెక్టు పనులు
సాగర్‌మాల ప్రాజెక్టులో భాగంగా కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం దేవస్థాన నమూనా ఆలయం నుంచి కాకినాడ లైట్‌హౌస్ వరకు 42 కిలోమీటర్ల మేర హైవే నిర్మాణ పనులు శర వేగంగా సాగుతున్నాయి. గతంలో అన్నవరం ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు కోసం పరిశీలించిన భూముల్లోనే ఈ రహదారి పనులు జరుగుతున్నాయి. మరోవైపు ఎయిర్‌పోర్ట్ కోసం భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరించడంతో విమానాశ్రయ ప్రతిపాదనలకు చెక్ పడింది.