వైసీపీకి షాక్.. జనసేనలో 30 కుటుంబాలు!

విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పూసపాటిరేగ మండలం గుంపాం పంచాయతీ నుంచి వైసీపీని వీడి 30 కుటుంబాలు జనసేనలో చేరాయి. గుంపాం వైసీపీ నాయకులు ఆల్తి అప్పలనాయుడు, బొబ్బాది శంకర్, మహంతి రామకృష్ణ, బొబ్బాది పైడినాయుడు, బొబ్బాది సంతోషికుమారి, బొబ్బాది సంతోష్ తదితరులు పార్టీ మారారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి, కోట్ల రఘు వారికి జనసేన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, జనసేన సిద్ధాంతాలు నచ్చి వచ్చామని నాయకులు తెలిపారు.



