రోడ్డు ప్రమాదంపై MP స్పందన

రఘునాథపాలెం మండలం పంగిడి దగ్గర జరిగిన ఘోర రోడ్డు యాక్సిడెంట్‌పై ఖమ్మం MP రామసహాయం రఘురాం రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి తీసే పనులకు వెళ్లిన కూలీల ఆటోను లారీ ఢీకొట్టడంతో 55 ఏళ్ల సరుపు భారతమ్మ చనిపోవడం, 12 మంది గాయపడటం పట్ల విచారం తెలిపారు. డాక్టర్లతో ఫోన్లో మాట్లాడి గాయపడినవారికి బెటర్ ట్రీట్‌మెంట్ అందించాలని ఆదేశించారు.


