← Back to news

ప్రకృతిని పరిరక్షిస్తే, ప్రకృతే మనల్ని కాపాడుతుంది: రేవంత్‌రెడ్డి

By డీకే· 19 Jun 2026· Eenadu· రంగారెడ్డి జిల్లా
ప్రకృతిని పరిరక్షిస్తే, ప్రకృతే మనల్ని కాపాడుతుంది: రేవంత్‌రెడ్డి

TG: ప్రకృతిని పరిరక్షిస్తే ప్రకృతే మనల్ని కాపాడుతుందని CM రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్‌లో తెలంగాణ వన మహోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. రూ.15 కోట్ల వ్యయంతో రూపొందనున్న ఎకోపార్క్ పనులకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్యం నుంచి రక్షించేందుకు కోట్ల సంఖ్యలో మొక్కలు పెంచుతున్నట్లు CM పేర్కొన్నారు. 30వేల ఎకరాల్లో నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో 15వేల ఎకరాల్లో సహజ సిద్ధమైన అటవీ వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

More in Politics