నేషనల్ లెవెల్ షూటర్ దమయంతి సేన్ అదృశ్యం !

పశ్చిమ బెంగాల్‌కు చెందిన 15 ఏళ్ల జాతీయ స్థాయి షూటర్ దమయంతి సేన్ గురువారం మధ్యాహ్నం నుండి కనిపించకుండా పోయింది. హౌరాలోని తన నివాసం నుండి కిరాణా సామాను కొనేందుకు బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. వెతకగా ఎలాంటి ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హౌరా స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ 4, 5 ల మధ్య ఆమె నడుస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో చివరిసారిగా రికార్డైంది. పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.


