← Back to news

ట్రైన్ 5 గంటలు ఆలస్యం..₹ 500 జరిమానా

By Lokesh· 1h ago
ట్రైన్ 5 గంటలు ఆలస్యం..₹ 500 జరిమానా

ముంబైలోని కల్యాణ్ జంక్షన్‌లో ఓ ప్రయాణికుడికి వింత అనుభవం ఎదురైంది. కుటుంబ సభ్యులకు సహాయం చేసేందుకు ప్లాట్‌ఫామ్ టికెట్‌తో స్టేషన్‌కు వెళ్లిన ఆదిత్య సింగ్ చౌహాన్ రైలు కోసం దాదాపు 5 గంటలు ఎదురుచూశారు. అప్పటికే ప్లాట్‌ఫామ్ టికెట్ టైం ముగిసింది. దీంతో కొత్త టికెట్ తీసుకోలేదని TTE ₹ 500 ఫైన్ విధించారు. రైలు ఆలస్యమైతే తన తప్పు లేకపోయినా ఫైన్ ఎందుకని ఆదిత్య ప్రశ్నించారు. దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

More in National