చినకాకానిలో డెవలప్‌మెంట్ వర్క్స్ స్టార్ట్

మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని చినకాకాని గ్రామంలో 1.86 కోట్ల రూపాయిలతో మౌలిక వసతుల పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా బీటీ రోడ్లు, RCC డ్రెయిన్లు, కొత్తగా బోర్‌వెల్స్, చేతిపంపులు నిర్మించనున్నారు. NRI హాస్పిటల్ నుంచి SR ప్యారడైజ్ వరకు రోడ్డు డెవలప్‌మెంట్ పనులు చేపట్టనున్నారు. తమ ఏరియాలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు తీరుతుండటంతో స్థానిక ప్రజలు హ్యాపీగా ఉన్నారు.




