← Back to news

MLA ఇంటి ముట్టడికి పిలుపు.. హౌస్ అరెస్టులు

By DK· 20 Jul 2026· నిజామాబాద్ జిల్లా
MLA ఇంటి ముట్టడికి పిలుపు.. హౌస్ అరెస్టులు

TG: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో BJP, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ‘ఛలో అంకాపూర్’ కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. శాంతిభద్రతల దృష్ట్యా ఆర్మూర్, అంకాపూర్ ప్రాంతాల్లో ధర్నాలు, ర్యాలీలు, బంద్‌లను నిషేధించారు. MLA పైడి రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడికి కాంగ్రెస్ పిలుపునివ్వగా, దాన్ని అడ్డుకునేందుకు BJP కార్యకర్తలను అంకాపూర్‌కు తరలిరావాలని నేతలు పిలిచారు. దీంతో ఇరు పార్టీల నేతలకు నోటీసులు జారీ చేసిన పోలీసులు, పలువురిని హౌస్ అరెస్ట్ చేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

More in Politics