రామాయణాన్ని అలా చూపించబోతున్నా

దర్శకుడు S.S. రాజమౌళి తన తాజా సినిమా ‘వారణాసి’లో రామాయణంలోని ఓ ఘట్టాన్ని చూపించనున్నారు. మన పురాణాల ఆధారంగా గతంలో ఎన్నో సినిమాలు వచ్చినా, వాటిని తెరపై చూపించిన విధానంలో ఇంకా మెరుగుదలకు అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రామాయణంలోని ఓ ఘట్టాన్ని నేరుగా సినిమాలో చూపించే అవకాశం రావడం తనకు అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ సినిమాలో మహేశ్బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సినిమా 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది.

