AIతో మారతున్న ఎంటర్టైన్మెంట్

ఇండియాలో మైక్రోడ్రామా రంగంలో AI సరికొత్త మార్పులు తెస్తోంది. తక్కువ టైమ్ పట్టే ఎపిసోడ్లకు స్టోరీస్ రూపొందించేందుకు బుల్లెట్ మైక్రోడ్రామా, స్టోరీ టీవీ లాంటి కంపెనీస్ AI టూల్స్ను ఉపయోగిస్తున్నాయి. స్టోరీస్ రాయడం, క్యారెక్టర్స్ సృష్టించడం, డబ్బింగ్, మ్యూజిక్లకు AI హెల్ప్ తీసుకుంటున్నాయి. దీంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ స్టోరీస్ రూపొందించే అవకాశం ఉంది. 2026లో ₹12,300 కోట్లు ఉన్న భారత మైక్రోడ్రామా మార్కెట్, 2032 నాటికి ₹25,500 కోట్లకు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

