ఇన్‌స్టా రీల్ చూసి నకిలీ కరెన్సీ దందా

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన కూరగాయల వ్యాపారి ఇన్‌స్టాగ్రామ్ రీల్ చూసి నకిలీ కరెన్సీ దందా గురించి తెలుసుకున్నాడు. టెలిగ్రామ్ ద్వారా నకిలీ నోట్లు తయారు చేయడం నేర్చుకున్నాడు. మండదుంగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో నకిలీ రూ.100, రూ.500 నోట్లను ముద్రించడం మొదలుపెట్టాడు. పోలీసులు అక్కడ సోదాలు చేపట్టారు. నోట్లతోపాటు సీపీయూ, మానిటర్, రెండు ప్రింటర్లు, లామినేటర్ హీటర్ మెషీన్, బటర్ పేపర్, నకిలీ నోట్ల ముద్రణకు ఉపయోగించిన కాగితాలను స్వాధీనం చేసుకున్నారు.


