← Back to news

బంజారాహిల్స్‌‌కు సమానంగా ఆదివాసీ బడులు: ఆకునూరి మురళి

By A.Ajay· 1h ago
బంజారాహిల్స్‌‌కు సమానంగా ఆదివాసీ బడులు: ఆకునూరి మురళి

TG: పిల్లలందరికీ దగ్గర్లోనే మంచి ప్రభుత్వ స్కూల్ అందుబాటులో ఉండాలని రిటైర్డ్ IAS అధికారి ఆకునూరి మురళి అన్నారు. TPF <a href="https://www.theclearcutnews.com/n/tNXHyWg">విద్యాబస్సు యాత్ర</a>లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా మల్కాపూర్‌లో ఆయన మాట్లాడుతూ ఆశ్రమ, రెసిడెన్షియల్, గురుకుల స్కూళ్లు అందరికీ శాశ్వత పరిష్కారం కాదని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను దూరంగా ఉన్న గురుకులాలకు పంపేందుకు ఆలోచించే పరిస్థితి ఉందన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని స్కూళ్లలో సౌకర్యాలు ఎలా ఉంటాయో, ఆదివాసీ గ్రామాల బడుల్లోనూ అలాంటి వసతులు ఉండాలని డిమాండ్ చేశారు.

బంజారాహిల్స్‌‌కు సమానంగా ఆదివాసీ బడులు: ఆకునూరి మురళి

More in TG

మల్కాపూర్ బడి నిండా సమస్యలు: సృజన యాదవ్
TG· 51m ago

మల్కాపూర్ బడి నిండా సమస్యలు: సృజన యాదవ్

TG: ఆదివాసీ గ్రామాల్లోని పిల్లల పరిస్థితులు చూస్తే బాధగా ఉందని సృజన యాదవ్ అన్నారు. TPF<a href="https://www.theclearcutnews.com/n/Aq6od2X"> విద్యా బస్సుయాత్ర</a>లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా మల్కాపూర్‌లో ఆమె మాట్లాడుతూ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు తరగతులు ఉన్నాయని చెప్పారు. ఇద్దరు టీచర్లు, రెండు గదులు ఉండగా ఒక గదిలో సామగ్రి ఉండటంతో పిల్లలు వరండాలో కూర్చొని చదువుకుంటున్నారని తెలిపారు. నాలుగు బాత్రూమ్‌లలో మూడు పనిచేయడం లేదని, నల్లాలు కూడా దెబ్బతిన్నాయని చెప్పారు. ఇద్దరు టీచర్లలో ఒకరు సెలవులో ఉంటే ఒక్క టీచర్‌తోనే పాఠశాల కొనసాగుతోందన్నారు.