బుల్లెట్ ట్రైన్ కారిడార్‌పై కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వాలి

సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ కారిడార్, స్టేషన్ ఏర్పాటు చేసి పాత అలైన్‌మెంట్‌నే కొనసాగించాలని తెలంగాణ యువజన సంఘం డిమాండ్ చేసింది. 52వ రోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్న CPI (ML) మాస్ లైన్ నాయకులకు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు, ఉపాధ్యక్షుడు సునీల్ సంఘీభావం తెలిపారు. 70 రోజులుగా ఆందోళనలు సాగుతున్నాయని, కాంగ్రెస్ అధిష్టానం దీనిపై వెంటనే క్లియర్ స్టాండ్ తీసుకోలని మధు కోరారు.



