ప్రియురాలిని చంపేసి.. మిస్సింగ్ డ్రామా ఆడాడు!

23 ఏళ్ల తరణుమ్ బషీర్ నాయక్, 25 ఏళ్ల శ్రీపాద్ వడర్ ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. అయితే తరణుమ్కు ఇంట్లో వేరే వ్యక్తితో పెళ్లి ఫిక్స్ చేశారు. దీంతో అక్టోబర్ 9న ఆమెను మహారాష్ట్రలోని నైక్వాడి వాటర్ఫాల్ దగ్గరకు తీసుకెళ్లిన శ్రీపాద్, లోయలోకి తోసేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు ఆమె కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. అతడి మాటలపై డౌట్ వచ్చి పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది.చివరికి శ్రీపాద్ను పోలీసులు అరెస్ట్ చేశారు.


