← Back to news

ప్రశ్నించిన పాపానికి కాల్చి చంపేశాడు.

By Nani Eluri· 1d ago· Indianexpress

పంజాబ్‌లో డ్రగ్స్ అమ్మకాలపై ప్రశ్నించిన ఓ యాక్టివిస్ట్‌ను గన్‌తో కాల్చి చంపేశారు. మాన్సాలోని ఓ మెడికల్ షాప్‌లో డ్రగ్స్ అమ్ముతున్నారంటూ పర్విందర్ సింగ్ ఝోటా షాప్ ఓనర్‌ను నిలదీశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో షాప్ ఓనర్ కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఫేస్‌బుక్ లైవ్‌లో రికార్డ్ అయింది. కాల్పుల్లో మరో వ్యక్తి కూడా గాయపడ్డారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పర్విందర్ కొంతకాలంగా పోరాడుతున్నారు. నిందితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు.

More in Crime