పిడుగుపడి రైతు మృతి

TG : ఖమ్మం జిల్లా వేంసూరు మండలం లచ్చన్నగూడెంలో దారుణం జరిగింది. పొలం పనులకు వెళ్లిన పర్స ఆనందరావు (52) పిడుగుపడి చనిపోయారు. వర్షం, ఉరుముల సమయంలో పిడుగు పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. సత్తుపల్లి గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించగా ఆయన అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని గవర్నమెంట్ ఆదుకోవాలని ఊరి ప్రజలు కోరుతున్నారు.




