← Back to news

పెళ్లి పేరుతో వేధింపులు.. సౌరవ్ గుజ్జర్‌పై కేసు

By Bala· 2h ago· TG
పెళ్లి పేరుతో వేధింపులు.. సౌరవ్ గుజ్జర్‌పై కేసు

TG: గచ్చిబౌలిలో యాక్టర్, రెజ్లర్ సౌరవ్ గుజ్జర్‌పై కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఫిజికల్‌గా, మెంటల్‌గా వేధించాడని ఓ యువతి ఆగస్టు 15న పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2021లో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఇద్దరూ సన్నిహితంగా ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లి, వ్యాపారం పేరుతో ఉద్యోగం మానేసి వచ్చినట్లు తెలిపింది. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి ముంబై ఎయిర్‌పోర్టులో సౌరవ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

More in TG

ఆరుట్లలో ప్రభుత్వ బడికి కొత్త రూపు.. ఇది కదా కావాల్సింది!
TG· 15h ago

ఆరుట్లలో ప్రభుత్వ బడికి కొత్త రూపు.. ఇది కదా కావాల్సింది!

TG: రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్.. ప్రభుత్వ విద్యలో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇక్కడ ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకూ.. ఒకే క్యాంపస్‌లో ఇంగ్లీష్ మీడియం విద్య అందుతోంది. డిజిటల్ క్లాస్‌రూమ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, డైనింగ్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్‌తో పాటూ.. విద్యార్థులకు రవాణా సౌకర్యం కూడా ఉంది. ఇక్కడ దాదాపు 1,800 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇలాంటి స్కూల్స్ మరిన్ని రావాలనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే <a href="https://www.theclearcutnews.com/n/9RMisjV">TPF విద్యా బస్సుయాత్ర</a> కొనసాగుతోంది.