రియా అహిర్‌లాగే.. పోలీసు బస్సును ఆపేందుకు యువతి యత్నం
ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో జరిగిన ఆందోళనలో కూడా ఓ యువతి పోలీసు బస్సును ఆపేందుకు ప్రయత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆందోళనకారులను తీసుకెళ్తున్న పోలీసు బస్సు బయలుదేరుతుండగా ఆమె దాని ముందు నిలబడి ఆపాలని కోరింది. ఈ వీడియో చూసిన వారు జూలైలో ముంబైలో జరిగిన ఘటనను గుర్తు చేసుకుంటున్నారు. అయితే ఇదంతా ఓ పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

