← Back to news

చదువుతోపాటు స్కూల్లో ఫెసిలిటీస్ ఉండాలి

By A.Ajay· 42m ago
చదువుతోపాటు స్కూల్లో ఫెసిలిటీస్ ఉండాలి

TG: తెలంగాణ పీపుల్స్‌ ఫ్రంట్‌ విద్యా బస్సు యాత్రలో భాగంగా ఖమ్మం జిల్లాలోని ఎల్లన్న నగర్‌లో పొలిటికల్‌ ఎకానమీ అనలిస్ట్‌ సృజన యాదవ్‌ మాట్లాడారు. పిల్లలకు రెండు మూడు అక్షరాలు నేర్చుకుంటే సరిపోదని, మంచి చదువు అందేలా స్కూల్స్‌ ఉండాలని అన్నారు. స్కూల్లో ఆట వస్తువులు, బాత్రూమ్‌లు, తాగునీరు, విద్యార్థులు కూర్చునేందుకు బెంచీలు ఉండాలని తెలిపారు. టీచర్లు రెగ్యులర్‌గా వచ్చి పిల్లలకు మంచి విద్య అందించాలని ఆమె కోరారు.

More in TG