బహార్ కేఫ్‌లో సడెన్ రైడ్స్.. 50 కిలోల మాంసం పారవేత!
TG: హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని బహార్ బిర్యానీ కేఫ్‌పై TGSAFE అధికారులు సడెన్ రైడ్స్ చేశారు. కిచెన్‌లో స్టోర్ చేసిన 50 కిలోల పాడైపోయిన చికెన్, మటన్, రొయ్యలతో పాటు ఎక్స్‌పైరీ డేట్ ముగిసిన ఫుడ్ ఐటమ్స్‌ను గుర్తించి స్పాట్‌లోనే డంప్ చేశారు. అధికారులు ఫుడ్ శాంపిల్స్‌ను కలెక్ట్ చేసుకొని, టెస్టుల కోసం ల్యాబ్‌కు పంపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ రెస్టారెంట్ FSSAI లైసెన్స్‌ను వెంటనే రద్దు చేయాలని సిఫార్సు చేశారు.



