యూనిఫామ్ కోసం ఎదురుచూపు

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సర్ధార్ నగర్ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్‌లో విద్యార్థులకు ఇప్పటివరకు స్కూల్ యూనిఫామ్, షూస్ అందలేదని తెలిపారు. ముఖ్యంగా స్కూల్ యూనిఫామ్‌ను ఏ ఒక్క విద్యార్థికీ ఇవ్వలేదని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో DEO వెంటనే స్పందించి, పెండింగ్‌లో ఉన్న యూనిఫామ్, షూలను పిల్లలందరికీ అందించాలని కోరారు.



