నిరాటంకంగా CJP నిరసన

ముంబయిలో CJP నిరసన నిరాటంకంగా సాగుతోంది. శివాజీ పార్క్‌లో నిరసనకు పోలీసులు పర్మిషన్ ఇవ్వకున్నా, పార్క్ బయటే అభిజీత్ దీప్కే సహా ఇతర నేతలు నిరసన తెలుపుతున్నారు. కార్యక్రమానికి వేలాదిమంది యువత మద్దతు తెలిపారు. గాయకుడు విశాల్ దద్లానీ అక్కడికి చేరుకొని అభిజీత్‌కు మద్దతు తెలిపారు. అనంతరం దీప్కే మాట్లాడుతూ మహాత్మాగాంధీ జయంతి రోజున గాంధీని ఇవాళ ఇంతకుమించిన నివాళి ఉండదని తెలిపారు. జ్ఞానేష్ కుమార్ రిజైన్ చేసేదాకా అందరం కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.


