CJP నిరసనకు షబానా ఆజ్మీ మద్దతు
ముంబయిలో CJP నిరసన సాగుతోంది. శివాజీ పార్క్‌లో నిరసనకు పోలీసులు పర్మిషన్ ఇవ్వకున్నా, పార్క్ బయటే అభిజీత్ దీప్కే సహా ఇతర నేతలు నిరసన తెలుపుతున్నారు. ఈ కార్యక్రమానికి నటి, సామాజిక కార్యకర్త షబానా అజ్మీ పాల్గొని మద్దతు పలికారు. యువత ఆక్రోశాన్ని కేంద్రం అర్థం చేసుకోవాలని, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రిజైన్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.

